Achyutashtakam in Telugu – అచ్యుతాష్టకం

YouTube Subscribe
Please share it
Rate this post

Achyutashtakam in Telugu

అచ్యుతాష్టకం ఆదిశంకరాచార్యులు స్వరపరిచినారు. ఈ అచ్యుతాష్టకం ద్వారా పరమాత్మ యొక్క దయ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని తెలియజేస్తుంది.ఇక్కడ అచ్యుత అంటే పరమాత్మ యొక్క శాశ్వతమైన మరియు మార్పులేని స్వభావాన్ని చూసిస్తుంది. ఈ అచ్చుతాష్టకాన్ని ఎవరైనా వారి మతపరమైన సంబంధంతో నేపథ్యంతో సంబంధం లేకుండా పటించవచ్చు

అచ్యుతాష్టకం

అచ్యుతం కేశవం రామ నారాయణం
కృష్ణ దామోదరం వాసుదేవం హరిమ్ |
శ్రీధరం మాధవం గోపికావల్లభం
జానకీనాయకం రామచంద్రం భజే || 1 ||

అచ్యుతం కేశవం సత్యభామాధవం
మాధవం శ్రీధరం రాధికాఽరాధితమ్ |
ఇందిరామందిరం చేతసా సుందరం
దేవకీనందనం నందజం సందధే || 2 ||

విష్ణవే జిష్ణవే శంఖినే చక్రిణే
రుక్మిణీరాగిణే జానకీజానయే |
వల్లవీవల్లభాయాఽర్చితాయాత్మనే
కంసవిధ్వంసినే వంశినే తే నమః || 3 ||

కృష్ణ గోవింద హే రామ నారాయణ
శ్రీపతే వాసుదేవాజిత శ్రీనిధే |
అచ్యుతానంత హే మాధవాధోక్షజ
ద్వారకానాయక ద్రౌపదీరక్షక || 4 ||

రాక్షసక్షోభితః సీతయా శోభితో
దండకారణ్యభూపుణ్యతాకారణమ్ |
లక్ష్మణేనాన్వితో వానరైస్సేవితో-
ఽగస్త్యసంపూజితో రాఘవః పాతు మామ్ || 5 ||

ధేనుకారిష్టకోఽనిష్టకృద్ద్వేషిణాం
కేశిహా కంసహృద్వంశికావాదకః |
పూతనాకోపకః సూరజాఖేలనో
బాలగోపాలకః పాతు మాం సర్వదా || 6 ||

విద్యుదుద్యోతవత్ప్రస్ఫురద్వాససం
ప్రావృడంభోదవత్ప్రోల్లసద్విగ్రహమ్ |
వన్యయా మాలయా శోభితోరస్స్థలం
లోహితాంఘ్రిద్వయం వారిజాక్షం భజే || 7 ||

కుంచితైః కుంతలైర్భ్రాజమానాననం
రత్నమౌళిం లసత్కుండలం గండయోః |
హారకేయూరకం కంకణప్రోజ్జ్వలం
కింకిణీమంజులం శ్యామలం తం భజే || 8 ||

అచ్యుతస్యాష్టకం యః పఠేదిష్టదం
ప్రేమతః ప్రత్యహం పూరుషః సస్పృహమ్ |
వృత్తతస్సుందరం వేద్య విశ్వంభరం
తస్య వశ్యో హరిర్జాయతే సత్వరమ్ || 9 ||

Also read : శ్రీ శివ సహస్రనామావళి 1008

 

Please share it

Leave a Comment