Today rasi phalalu telugu | advanced future

YouTube Subscribe
Please share it
5/5 - (1 vote)

Today rasi phalalu telugu | Today Horoscope In Telugu

               మీ రాశిఫలాలు లను ఖచ్చితంగా తెలుసుకోవాలంటే, ఖచ్చితంగా మీకు మీ రాశి ఏదో మీకు తెలిసి ఉండాలి. అలాంటప్పుడే మీరు ఖచ్చితమైనటువంటి ఫలితాలను తెలుసుకోగలరు. ఈ క్రింద ఇచ్చిన లింక్ మీరు క్లిక్ చేసి, మీరు మీ పుట్టిన సంవత్సరం, నెల, రోజు మరియు ఎక్కడ జన్మించారు ఆ ప్రదేశం, మీ పేరు మీ ఫోన్ నెంబర్ మీ ఈమెయిల్ ఇవ్వండి. మీ యొక్క ఖచ్చితమైన ఎటువంటి రాశి, మీ యొక్క లగ్నం, మీరు ధరించవలసిన రుద్రాక్ష , మరియు రత్నం ఇలాంటి విషయాలు మీకు ఈమెయిల్ ద్వారా పంపుతాను.

ఈ లింక్ ని క్లిక్ చేయండి : https://imjo.in/AAhX9y 

2023 లో మేష రాశి వారికి అదృష్టం కలగాలంటే మేష రాశి వారు ఈ పరిహారాలు పాటించాలి.

మేష రాశి వారికి ద్వితీయంలో రాహు సంచారం, అష్టమంలో కేతు సంచారం, దశమంలో శని సంచారం జరుగుతున్నది. అవునా అనుకున్న పనుల్లో కార్య సఫలత ప్రాప్తి కలగాలంటే ఇలా చేయాలి. ద్వితీయంలో రాహువు సంచారం కలుగుతుంది కాబట్టి మేషరాశి వారు ఈ సంవత్సరంలో వీలైనప్పుడల్లా పుట్ట దగ్గరికి వెళ్ళాలి. పుట్ట మీద కాస్త పసుపు కుంకుమ చెల్లి పుట్టలో పాలు పోయాలి. పుట్ట చుట్టూ ఖచ్చితంగా 11 ప్రదక్షిణాలు చేయాలి. పుట్ట దగ్గర చలిమిడి నైవేద్యం సమర్పించి మనసులోని కోరిక స్మరించి నమస్కరించాలి. ఇలా ఆదివారాల కోట పుట్టకు పూజ చేయడం వల్ల మేష రాశి వారికి ధన లాభం తో పాటు విశేష అదృష్ట యోగం పడుతుంది.
అలాగే మేష రాశి వారికి అష్టమంలో కేతు సంచారం ఉంది కావున ఈ రాశి వారు మంగళవారం నాడు కుక్కలకు బ్రెడ్ఆహారంగా వేయాలి. ఆ బ్రెడ్ కు కొద్దిగా రెండు చుక్కలు నువ్వుల నూనె రాయాలి. అలా రాసిన బ్రెడ్ ముక్కలను కుక్కలకు ఆహారంగా వేయాలి. ఇలా చేయడం వల్ల మీ జాతకంలో దోషం పోతుంది. అలాగే మీ ఇంట్లో ఉన్నా గణపతి ఫోటో కు సింధూరం బొట్లు పెట్టాలి. ఇలా ఇలా గణపతి ని పూజించడం వల్ల మేష రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. అదేవిధంగా దశమంలో శని సంచారం నడుస్తున్నది కావున ఈ సంవత్సరంలో వీలయినప్పుడల్లా శనివారం నల్ల నువ్వులు బెల్లం గోమాతకు ఆహారంగా పెట్టాలి ఇలా చేయడం వలన గ్రహ దోషాలు తొలగిపోతాయి. . అలాగే వీలైనప్పుడు  శనివారం సాయంకాలం  5 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల 30 నిమిషాల లోపల మీ ఇంట్లో మెయిన్ హాల్ లో పడమర దిక్కు లో ఒక ప్రమిదను ఉంచి ఆ ప్రమిదలో నువ్వుల నూనెను పోసి ఎనిమిది వత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. ప్రతి శనివారం సాయంకాలం పడమర దిక్కు లో ఇలా దీపారాధన చేయటం వల్ల మేష రాశి వారికి కలిసి వస్తుంది అదృష్ట యోగం పడుతుంది. కావున రాహువుకి కేతువుకి శనికి సంబంధించిన ఈ ప్రత్యేక పరిహారాలు పాటించడం వల్ల మేష రాశి వారు 2021 సంవత్సరం పాటించినట్లయితే అన్ని రకాలైన సమస్యలు తొలగి అదృష్టం యోగాన్ని పొందుతారు.

2023  సంవత్సరంలో వృషభ రాశి వారికి అదృష్టం యోగం కలగాలంటే ఈ క్రింది పరిహారాలు పాటించాలి

ఈ రాశి వారికి ఈ సంవత్సరం లో జన్మం లో రాహు సంచారం, సప్తమంలో కేతు సంచారం, భాగ్యం లో శని సంచారం నడుస్తోంది. కావున రాహువు కేతువు శనికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి పరిహారాలు ఈ సంవత్సరం మొత్తం పాటించినట్లయితే అనేక మార్గాల్లో ధనాదాయం పెరుగుతుంది అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింప చేసుకోవచ్చు.

వృషభ రాశి వారికి జన్మం లో రాహు సంచారం నడుస్తోంది కాబట్టి మీ చేతితో ముల్లంగి దుంపలను ఎవరికైనా దానం ఇవ్వాలి. ఇలా ఇలా చేయటం వలన జన్మం లో రాహు సంచార దోషం పోతుంది. ఆటంకాలు తొలగి అదృష్టవంతులు అవుతారు. అలాగే దుర్గాదేవిని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు.

అలాగే ఈ రాశి వారికి సప్తమం లో కేతు సంచారం నడుస్తోంది. కావున ఈ రాశివారు నానబెట్టిన ఉలవలను ఆవుకి ఆహారంగా తినిపించాలి. ఈ పని మంగళవారం రోజున చేస్తే మంచిది. ఇలా చేయడం వల్ల సప్తమ కేతు దోషం తొలగిపోతుంది. దీని వలన వ్యాపారాభివృద్ధి కలుగుతుంది.

అలాగే ఈ రాశి వారికి శని మహానుభావుడు భాగ్యం లో సంచరిస్తున్నాడు కావున శని ప్రభావం తగ్గి శుభ ఫలితాలు పొందాలంటే వృషభ రాశి వారు ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజించండి. అలాగే వెంకటేశ్వర స్వామి చిత్రపటం ముందర  నెయ్యి దీపం వెలిగించాలి. ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని చదువుకోవాలి. ఇలా చేయడం వల్ల భాగ్యం లో శని సంచారం వల్ల కలుగు దోషం తొలిగి అంతా మంచే జరుగుతుంది.

మిధున రాశి వారికి 2023 సంవత్సరంలో అదృష్ట యోగము ధనలాభం కలగాలంటే ఈ పరిహారాలు పాటించండి.

ఈ రాశి వారికి ఈ సంవత్సరం పన్నెండవ ఇంట రాహు సంచారం ఆరవ ఇంట కేతు సంచారం ఎనిమిదవ ఇంట శని సంచారం నడుస్తోంది. అయితే వీళ్ళకి కేతువు విశేషంగా యోగి స్తున్నాడు. అలాగే రాహువు శని వ్యతిరేకంగా ఉన్నారు. కావున ఈ రాశివారు రాహువుకు శని భగవానుడికి సంబంధించిన పరిహారాలు పాటించాలి.

మిధున రాశి వారికి శుభ ఫలితాలు కలగాలంటే ఈ సంవత్సరం ఈశ్వరారాధన చేయాలి. శివాలయంలో అభిషేకాలు చేయాలి. ఇంట్లో శివలింగం గాని ఉంటే తేనె చెరుకు రసం తో అభిషేకించాలి. ఇలా చేయటం వలన పన్నెండవ ఇంట రాహు దోషం తొలగి దారిద్ర దుఃఖ తొలగిపోతుంది. అలాగే నానబెట్టిన మినుములు గోవులకు ఆహారంగా తినిపించాలి.

అలాగే అష్టమ శని దోషం తొలగి పోవడానికి ఆవుకు పచ్చగడ్డి, తవుడు ఆహారంగా తినిపించాలి. ఇలా చేయడం వల్ల అష్టమ శని దోషం తొలగి మిధున రాశి వారికి అంతా శుభ ప్రభావమే అవుతుంది. అలాగే శనివారం నాడు రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి రావి చెట్టు మొదట్లో పాలలో కి బెల్లం కలిపి ఆ పాలు పోయండి. అలా పాలు పోయి గా నడిచిన మట్టిని బొట్టు గా పెట్టుకోవాలి. రావి చెట్టు దగ్గర అ ప్రమిదలో ఎనిమిది వత్తులు వేసి నువ్వుల నూనె వేసి దీపం వెలిగించాలి.అలాగే రావి చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయడం వల్ల ఈ సంవత్సరం అత్యున్నత శుభ ఫలితాలు పొందుతారు మిధున రాశి వారు.

2023 లో కర్కాటక రాశి వారికి అదృష్టం ఐశ్వర్యం కలగాలంటే ఈ పరిహారాలు పాటించండి.

వీరికి రాహువు పదకొండవ ఇంట సంచరం చేస్తున్నాడు, కేతువు పంచమంలో అనగా ఐదవ ఇంట సంచారం చేస్తున్నాడు, అలాగే శని ఏడవ ఇంట అనగా సప్తమంలో సంచారం చేస్తున్నాడు. రాహువు ఈ రాశి వారికి విశేషంగా యోగి స్తున్నాడు. కావున ఈ రాశివారు కేతువుకి శనికి సంబంధించిన పరిహారాలు పాటిస్తే సరిపోతుంది.

కర్కాటక రాశి వారు ఈ సంవత్సరంలో వీలైనప్పుడల్లా మంగళవారంనాడు గణపతి ఆలయంలో ఒక ప్రమిదలో కొబ్బరి నూనె తో ఐదు వత్తులు వేసి  దీపం వెలిగించాలి. అలాగే  గణపతి ని దర్శనం చేసుకుని ఎర్రటి పుష్పాలతో అర్చన చేయించుకోండి. ఇలా చేయడం వల్ల పంచమం లో ఉన్న కేతు దోషం తొలగిపోతుంది.

అలాగే  సప్తమంలో ఉన్న శని దోషం తొలగిపోవాలంటే పాలలో కి కాసిన్ని నల్ల నువ్వులు వేసి శివాభిషేకం చేయించుకోవాలి. అలాగే శనివారం జమ్మిచెట్టుకు దగ్గరికి వెళ్లి ప్రదక్షిణలు చేయాలి. అలాగే ఒక ఒక ప్రమిదలో నువ్వుల నూనె వేసి ఎనిమిది వత్తులు వేసి దీపం వెలిగించాలి. అలాగే శని దోషం తొలగడానికి ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం అప్పుడప్పుడు చేస్తుండాలి. ఇలా చేయడం వల్ల దోషం తొలగిపోతుంది అంతా శుభప్రదమే అవుతుంది.

2023 సంవత్సరంలో సింహ రాశి వారికి పట్టిందల్లా బంగారం కావాలంటే ఈ పరిహారాలు పాటించండి.

సింహ రాశి వారికి ఈ సంవత్సరం దశమంలో రాహు సంచారం, చతుర్థంలో కేతు సంచారం, ఆరవ ఇంట శని సంచారం జరుగుతోంది. వీరికి ఈ సంవత్సరంలో రాహువు, శని విశేషంగా యోగిస్తున్నారు. అయితే కేతువు మాత్రం వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నాడు కావున ఈయనకు పరిహారాలు చేస్తే సరిపోతుంది. 

ఈ సంవత్సరంలో వీలైనప్పుడల్లా నానబెట్టిన ఉలవలను గోమాతకు ఆహారంగా పెట్టాలి. అలాగే ఎండు ఖర్జూర పండ్లను దానం ఇస్తే చాలా మంచిది. ఇలా చేయడం వల్ల సింహ రాశి వారు కేతు దోషం తొలగి పోయి సుఖసంతోషాలతో ఈ సంవత్సరం నడుస్తుంది. అలాగే సింహ రాశి వారు మరింత మంచి ఫలితాల కోసం దర్భ చేప పై కూర్చుని మంత్ర జపం చేస్తే చాలా మంచిది.

2023 సంవత్సరం లో అదృష్టం ఐశ్వర్యం కలగాలంటే కన్యారాశి వారు ఈ పరిహారాలు పాటించండి. 

కన్యా రాశి వారికి భాగ్యంలో అనగా తొమ్మిదవ ఇంటిలో రాహు సంచారం, మూడవ ఇంట కేతు సంచారం, అయిదవ ఇంకా శని సంచారం నడుస్తోంది. కేతు విశేషంగా యోగిస్తున్నాడు కావున కన్యా రాశి వారు రాహు కి, శనికి, పరిహారాలు పాటిస్తే సరిపోతుంది.

ఈ సంవత్సరమంతా కన్యా రాశి వారు ఒక ఆదివారం నాడు దుర్గాదేవి ఆలయంలో 11 ప్రదక్షిణాలు చేయాలి. అలాగే దుర్గాదేవి ఆలయం ప్రాంగణంలో రాహుకాలంలో నిమ్మకాయ దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వల్ల క్రమంగా సమస్యలు తొలగిపోతాయి. అలాగే అమ్మవారికి కుంకుమార్చన చేయిస్తే చాలా మంచిది.

శనీ ఐదవ ఇంట సంచరిస్తున్నాడు కాబట్టి, ఈ రాశి వారు వీలైనప్పుడల్లా రావి చెట్టు దగ్గర గాని జమ్మి చెట్టు దగ్గర గాని దీపాన్ని వెలిగించాలి. దీపాన్ని నువ్వుల నూనెతో 8 ఒత్తులు వేసి వెలిగించాలి. అలాగే శనివారం నాడు భోజనం లో ఆవ నూనెను ఉపయోగించండి. ఇలా చేయడం వల్ల శని సంచారం ప్రభావం తగ్గి అంతా శుభమే జరుగుతుంది.

2023 వ సంవత్సరంలో తులా రాశి వారికి అదృష్టం ఐశ్వర్యం కలగాలంటే ఈ పరిహారాలు పాటించండి.

ఈ రాశి వారికి అష్టమంలో అనగా ఎనిమిదవ ఇంటిలో రాహు సంచారం, ద్వితీయంలో అనగా రెండవ ఇంటిలో కేతు సంచారం, చతుర్థంలో అనగా నాలుగవ ఇంటిలో శని సంచారం జరుగుతోంది. అయితే ఈ ముగ్గురు దేవతలు వ్యతిరేక ఫలితాలు కలుగ చేస్తున్నారు ఈ రాశివారికి. కావున రాహువు, కేతువు, శని కి పరిహారాలు పాటించాలి.

అష్టమ రాహు దోషాన్ని తొలగించుకోవడానికి ఈ తులా రాశి వారు నెలకొకసారి పారే నీళ్లలో నాలుగు సింధూరం రాసిన పీచుతో ఉన్న కొబ్బరికాయలను, కొన్ని బుగ్గలను విడిచిపెడుతూ ఓం కుంభిని స్వాహా అనే మంత్రాన్ని 11 సార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల అష్టమ రాహు దోషం తొలగిపోతుంది.

ద్వితీయ కేతు దోషం తొలగించుకోవడానికి మంగళవారం పూట గణపతి ఆలయానికి వెళ్లాలి. స్వామికి ఎర్రటి పుష్పాలతో అర్చన చేయించుకోవాలి. అలాగే ఆలయంలో 11 ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది కేతు దోషం తొలగిపోతుంది.

ఇక తులా రాశి వారికి అర్దాష్టమ శని దోషం ఉంది కాబట్టి, ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చేయించండి. అలాగే 11 ప్రదక్షణలు చేస్తే అంతా శుభమే జరుగుతుంది. శని ప్రభావం తగ్గి కార్యసిద్ధి కలుగుతుంది.

2023 వ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి అదృష్టం యోగం కలగాలంటే ఈ పరిహారాలు పాటించండి. 

వృశ్చిక రాశి వారికి సప్తమం లో అనగా ఏడవ ఇంటిలో రాహు సంచారం నడుస్తోంది. జన్మంలో అనగా ఒకటవ ఇంట కేతు సంచారం నడుస్తోంది. తృతీయంలో మూడవ ఇంట శని సంచారం నడుస్తోంది. శని భగవానుడు విశేషంగా యోగి స్తున్నాడు.కావున రాహు, కేతు గ్రహానికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. వృశ్చిక రాశి వారు కొద్దిగా తేనె, నల్ల ద్రాక్ష ను ఒక పంతులు గారికి దానం ఇవ్వండి. ఇలా చేయడం వల్ల రాహు దోషం తొలగిపోతుంది.అలాగే దగ్గరలో ఉన్న దుర్గాదేవి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శనం చేసుకుంటే చాలా మంచిది. కేతు గ్రహ దోష నివారణార్థం గణపతికి ఎర్రటి పుష్పాలతో పూజించాలి ఇలా చేయటం వల్ల కేతు గ్రహ దోషం తొలగిపోతుంది.

2023లో ధనస్సు రాశి వారికి ఐశ్వర్య యోగం కలగాలంటే ఇలా చేయండి.

ధనస్సు రాశి వారికి రాహు ఆరవ ఇంట కేతువు పన్నెండవ ఇంట ,అలాగే శని మహానుభావుడు రెండవ ఇంట సంచరిస్తున్నాడు.కావున రాహు విశేషంగా యోగిస్తున్నాడు కేతువుకి శని మహానుభావుడికి సంబంధించిన పరిహారాలు పాటించాలి. ధనస్సు రాశి వారు మంగళవారం నాడు దర్భాసనం మీద కూర్చుని పూజ చేసుకోవాలి. అలాగే వీలైనప్పుడల్లా ఒక మంగళవారం ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూరం దానమివ్వాలి. అలాగే మంగళవారం పూట సంకటనాశన గణేశ స్తోత్రం చదువుకోవాలి. అలాగే ‘ఓం గం గణపతయే నమః’ అనే మంత్రాన్ని ఇరవై ఒక్క సారి చదువుకోవాలి. అలాగే ద్వితీయ సంచార శని దోషం తొలగి పోవడానికి నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలి. అలాగే రావిచెట్టుకు 8 ప్రదక్షిణాలు చేయాలి. అలాగే ఆంజనేయ స్వామికి ఐదు ప్రదక్షిణాలు చేయాలి. ఈ ఇలా చేయటం వల్ల ధనుస్సు రాశి వారికి అంత శుభప్రదమే అవుతుంది.

2023లో అదృష్టం యోగం కలగాలంటే మకర రాశి వారు ఈ క్రింది పరిహారాలు పాటించాలి.

వీరికి రాహు ఐదవ ఇంటా కేతువు పదకొండవ ఇంటా శని భగవానుడు జన్మలో సంచారం చేస్తున్నాడు. కేతు విశేషంగా యోగి స్తున్నాడు వీళ్ళకి రాహువు శనికి పరిహారాలు పాటిస్తే సరిపోతుంది. మకర రాశి వారు తేనె చెరుకు రసం తో శివుడికి అభిషేకం చేయించుకోవాలి. ఇలా చేయడం వల్ల రాహు దోషం తొలగిపోతుంది. జన్మ లో శని సంచారం ప్రభావం నుంచి తొలగించుకోవడానికి ఆవుకి నువ్వులు, బెల్లం ఆహారంగా పెట్టాలి. అలాగే ప్రతిరోజు ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించు కోవాలి. శని మహానుభావుడు ధన స్థానాధిపతి అయ్యాడు అనేక మార్గాలలో ఆదాయం పెరుగుతుంది.అలాగే శనివారం నాడు నవగ్రహాల చుట్టూ తొమ్మిదిసార్లు ప్రదక్షిణాలు చేయాలి. ఇలా చేయడం వల్ల అతని సంచార ప్రభావ తొలిగి అంతా శుభమే జరుగుతుంది.

2023 సంవత్సరం లో ధన ఆదాయం పెరగాలంటే కుంభ రాశి వారు ఈ పరిహారాలు పాటించండి.

కుంభ రాశి వారికి రాహువు 4 ఇంట సంచరిస్తున్నాడు. కేతువు కుంభరాశి వారికి పదవ ఇంట సంచరిస్తున్నాడు. శని భగవానుడు పన్నెండవ ఇంట సంచరిస్తున్నాడు. అంటే ఈ రాశి వారికి కేతు విశేషంగా యోగి ఇస్తున్నాడు. రాహువుకి శనికి పరిహారాలు పాటిస్తే సరిపోతుంది. రాహువు నాలుగవ ఇంత సంచరిస్తున్నాడు కాబట్టి మీరు దుర్గాదేవి ఆలయానికి వెళ్లాలి. అమ్మవారికి ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయటం వల్ల రాహు దోషం తొలగిపోతుంది.కుంభ రాశి స్త్రీలు ఆదివారం దుర్గాదేవి ఆలయంలో నిమ్మకాయలతో దీపాన్ని వెలిగించాలి. అలాగే అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోవాలి. శని పన్నెండవ ఇంట సంచరించే ఇబ్బందులు తొలగించుకోవడానికి, అనవసర వృధా ఖర్చులు తగ్గించుకోవడానికి, ఆదాయం పెరగడానికి అదృష్టం కలిసి రావడానికి, ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి ఆకు పూజ చేయించాలి. అలాగే స్వామి వారి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయడం వల్ల శని ప్రభావం తగ్గి శుభ ఫలితాలు పొందుతారు.

2023 సంవత్సరం లో మీన రాశి వారికి అదృష్టం యోగం కలగాలంటే ఈ క్రింది పరిహారాలు పాటించాలి.

రాహువు మూడవ ఇంట, కేతువు 9 వ ఇంట, శని మహానుభావుడు ఏకాదశం అనగా 11వ ఇంట లాభంలో సంచరిస్తున్నాడు. రాహువు, శని భగవానుడు ఈ మీన రాశి వారికి విశేషంగా యోగి స్తున్నాడు. కేవలం కేతువు మాత్రమే వ్యతిరేక ఫలితాలను కలుగజేస్తుంది. కావున కేతుగ్రహ దోషం తొలగడానికి పరిహారాలు పాటిస్తే సరిపోతుంది. నానబెట్టిన ఉలవలను గోవులకు ఆహారంగా తినిపించండి. దర్భాసనం మీద కూర్చుని పూజ చేసుకోండి. అలాగే మంగళవారం గణపతి ఆలయంలో ఎర్రటి పుష్పాలతో గణపతికి అర్చన చేయించండి.అలాగే గణపతి ఆలయం లో కొబ్బరి నూనె దీపం వెలిగించి తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి. ఇలా చేయడం వల్ల విశేషంగా గణపతి అనుగ్రహం కలుగుతుంది కేతు గ్రహ దోషం కూడా తొలగిపోతుంది. అలాగే మీన రాశి వారు సంకట నాశన గణేశ శ్లోకం చదువుకోవాలి. ఇలా చేయడం వల్ల 2021లో అంతా శుభప్రదం అవుతుంది.

Please share it

Leave a Comment