Anurenu Paripoornamaina Roopamu Lyrics in Telugu-అణురేణు పరిపూర్ణమైన రూపము

YouTube Subscribe
Please share it

Anurenu Paripoornamaina Roopamu Lyrics in Telugu

అనురేణు పరిపూర్ణమైన రూపము అన్నమాచార్య ద్వారా శ్రీ వేంకటేశ్వరునిపై ఒక ప్రసిద్ధ కీర్తన. ఈ కీర్తన యొక్క ప్రదర్శనను కాలక్రమేణా చాలా మంది ప్రసిద్ధ గాయకులు ప్రదర్శించారు. 

అణురేణు పరిపూర్ణమైన రూపము

అణురేణు పరిపూర్ణమైన రూపము
అణిమాది సిరి యంజనాద్రిమీఁది రూపము ॥పల్లవి॥

వేదాంతవేత్తలెల్లా వెదకేటి రూపము
ఆదినంత్యములేని యారూపము
పాదుగ యోగీంద్రులు భావించు రూపము
యీదెస నిదివో కోనేటిదరి రూపము ॥ చ1

పాలజలనిధిలోనఁ బవళించే రూపము
కాలపు సూర్యచంద్రాగ్నిగల రూపము
మేలిమి వైకుంఠాన మెరసిన రూపము
కీలైనదిదే శేషగిరిమీఁది రూపము ॥ చ2

ముంచిన బ్రహ్మాదులకు మూలమైన రూపము
కొంచని మఱ్ఱాకుమీఁది కొన రూపము
మంచి పరబ్రహ్మమై మమ్మునేలిన రూపము
యెంచఁగ శ్రీవేంకటాద్రినిదే రూపము ॥ చ3

Also read :శ్రీ వెంకటేశ్వర సహస్రనామం 

Please share it

Leave a Comment