Bilvashtakam in telugu
పూర్వజన్మ సుకృతం ఉంటే కాని శివలింగాన్ని అర్చించాలి అన్న కోరిక కలగదు. శివుడు అల్పసంతోషి. బిల్వ దళాలతో శివుని పూజిస్తే అంతులేని పుణ్యం ప్రాప్తిస్తుంది. అంతేకాదు దారిద్ర దుఃఖ తొలగిపోతుంది. పరమేశ్వర సన్నిధికి చేరుకోవడానికి ఇంతకుమించిన తరుణోపాయం లేదు. కావున అందరూ బిల్వాష్టకము చదివి సుఖసంతోషాలు పొందండి.
బిల్వాష్టకం
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం,
త్రిజన్మపాపసంహారం ఏకబిల్వం శివార్పణమ్ …
త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః ,
శివపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణమ్…
అఖండబిల్వపత్రేణ పూజితే నందికేశ్వరే,
శుద్ధ్యంతి సర్వపాపేభ్యః ఏకబిల్వం శివార్పణమ్…
సాలగ్రామ శిలామేకాం జాతు విప్రాయ యోఽర్పయేత్,
సోమయజ్ఞమహాపుణ్యం ఏకబిల్వం శివార్పణమ్ …
దంతికోటిసహస్రాణి వాజపేయశతాని చ,
కోటికన్యామహాదానాం ఏకబిల్వం శివార్పణమ్ …
పార్వత్యాస్స్వేదతోత్పన్నం మహాదేవస్య చ ప్రియం,
బిల్వవృక్షం నమస్యామి ఏకబిల్వం శివార్పణమ్…
దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం
అఘోరపాపసంహారం ఏకబిల్వం శివార్పణమ్ …
మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే
అగ్రతశ్శివరూపాయ ఏకబిల్వం శివార్పణమ్ …
బిల్వాష్టక మిదం పుణ్యం యః పఠేచ్ఛివసన్నిధౌ
సర్వపాపవినిర్ముక్తః శివలోక మవాప్నుయాత్…
ఇతి బిల్వాష్టకం సంపూర్ణమ్..
ఇలా రోజు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ బిల్వాష్టకము ను ఎవరైతే చదువుతారో, వారు అత్యంత సంపన్నులుగా కావటమే కాదు, కీర్తి ధనము యశస్సు లభిస్తాయి.
Also read : దక్షిణా మూర్తి స్తోత్రం