Dharmasastha Bhujanga Stotram in Telugu
Dharmasastha Bhujanga Stotram is a special prayer that people say to ask for help and blessings from a powerful and kind god named Dharmasastha. We say this prayer to show our love and respect for him, and to ask for his protection and guidance in our lives. It’s like when we ask mommy or daddy for something, but we’re asking Dharmasastha instead!
శ్రీ ధర్మశాస్త భుజంగ స్తోత్రం
శ్రితానందచింతామణి శ్రీనివాసం
సదా సచ్చిదానంద పూర్ణప్రకాశం |
ఉదారం సుదారం సురాధారమీశం
పరం జ్యోతిరూపం భజే భూతనాథం || 1 ||
విభుం వేదవేదాంతవేద్యం వరిష్ఠం
విభూతిప్రదం విశ్రుతం బ్రహ్మనిష్టం |
విభాస్వత్ప్రభావప్రభం పుష్కలేష్టం
పరం జ్యోతిరూపం భజే భూతనాథం || 2 ||
పరిత్రాణదక్షం పరబ్రహ్మసూత్రం
స్ఫురచ్చారుగాత్రం భవధ్వాంతమిత్రం |
పరం ప్రేమపాత్రం పవిత్రం విచిత్రం
పరం జ్యోతిరూపం భజే భూతనాథం || 3 ||
పరేశం ప్రభుం పూర్ణకారుణ్యరూపం
గిరీశాదిపీఠోజ్జ్వలచ్చారుదీపం |
సురేశాదిసంసేవితం సుప్రతాపం
పరం జ్యోతిరూపం భజే భూతనాథం || 4 ||
హరీశానసంయుక్తశక్త్యైకవీరం
కిరాతావతారం కృపాపాంగపూరం |
కిరీటావతంసోజ్జ్వలత్ పింఛభారం
పరం జ్యోతిరూపం భజే భూతనాథం || 5 ||
గురుం పూర్ణలావణ్యపాదాదికేశం
గరీయం మహాకోటిసూర్యప్రకాశం |
కరాంభోరుహన్యస్తవేత్రం సురేశం
పరం జ్యోతిరూపం భజే భూతనాథం || 6 ||
మహాయోగపీఠే జ్వలంతం మహాంతం
మహావాక్యసారోపదేశం సుశాంతం |
మహర్షిప్రహర్షప్రదం జ్ఞానకందం
పరం జ్యోతిరూపం భజే భూతనాథం || 7 ||
మహారణ్యమన్మానసాంతర్నివాసాన్
అహంకారదుర్వారహింస్రా మృగాదీన్ |
నిహంతం కిరాతావతారం చరంతం
పరం జ్యోతిరూపం భజే భూతనాథం || 8 ||
పృథివ్యాదిభూతప్రపంచాంతరస్థం
పృథగ్భూతచైతన్యజన్యం ప్రశస్తమ్ |
ప్రధానం ప్రమాణం పురాణప్రసిద్ధం
పరం జ్యోతిరూపం భజే భూతనాథం || 9 ||
జగజ్జీవనం పావనం పావనీయం
జగద్వ్యాపకం దీపకం మోహనీయం |
సుఖాధారమాధారభూతం తురీయం
పరం జ్యోతిరూపం భజే భూతనాథం || 10 ||
ఇహాముత్ర సత్సౌఖ్యసంపన్నిధానం
మహద్యోనిమవ్యాహతాత్మాభిధానం |
అహః పుండరీకాననం దీప్యమానం
పరం జ్యోతిరూపం భజే భూతనాథం || 11 ||
త్రికాలస్థితం సుస్థిరం జ్ఞానసంస్థం
త్రిధామ త్రిమూర్త్యాత్మకం బ్రహ్మసంస్థం |
త్రయీమూర్తిమార్తిచ్ఛిదం శక్తియుక్తం
పరం జ్యోతిరూపం భజే భూతనాథం || 12 ||
ఇడాం పింగళాం సత్సుషుమ్ణాం విశంతం
స్ఫుటం బ్రహ్మరంధ్ర స్వతంత్రం సుశాంతం |
దృఢం నిత్య నిర్వాణముద్భాసయంతం
పరం జ్యోతిరూపం భజే భూతనాథం || 13 ||
అణుబ్రహ్మపర్యంత జీవైక్యబింబం
గుణాకారమత్యంతభక్తానుకంపమ్ |
అనర్ఘం శుభోదర్కమాత్మావలంబం
పరం జ్యోతిరూపం భజే భూతనాథం || 14 ||
ఇతి శ్రీ ధర్మశాస్త భుజంగ స్తోత్రం |
Also read :శ్రీ అయ్యప్ప అష్టోత్రం