Sri Anjaneya Dandakam Lyrics in Telugu – ఆంజనేయ దండకం

YouTube Subscribe
Please share it
Rate this post

Sri Anjaneya Dandakam Lyrics in Telugu

Discover the power of Anjaneya Dandakam in Telugu, a powerful hymn filled with devotion and strength. Sri Bala Murali Krishna brings this divine chant to life, instilling fearlessness and unwavering faith. Immerse yourself in the spiritual journey of Anjaneya Dandakam and experience its transformative impact.

ఆంజనేయ దండకం

ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం |
తరుణార్క ప్రభోశాన్తం రామదూతం నమామ్యహం | |
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం
ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం
భజే వాయుపుత్రం భజే వాలగాత్రం
భజే హం పవిత్రం భజే సూర్యమిత్రం
భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం
బటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్నీనామ సంకీర్తనల్ చేసి
నీ రూపు వర్ణించి, నీ మీద నే దండకం బొక్కటింజేయ నూహించి,
నీ మూర్తినిన్ గాంచి, నీ సుందరం బెంచి,
నీ దాస దాసుండనై, రామ భక్తుండనై,
నిన్ను నే గొల్చెదన్, నీ కటాక్షంబునన్ జూచితే, వేడుకల్ చేసితే,
నా మొరాలించితే, నన్ను రక్షించితే,
అంజనాదేవిగర్భాన్వయా! దేవ! నిన్నెంచ నేనెంత వాడన్
దయాశాలివై చూచితే, దాతవై బ్రోచితే, దగ్గరన్ నిలిచితే,
తొల్లి సుగ్రీవునకున్ మంత్రివై స్వామి కర్యంబు నందుండి, శ్రీరామసౌమిత్రులం జూచి,
వారిన్ విచారించి, సర్వేశు పూజించి, యబ్బానుజున్ బంటుగావించి,
యవ్వాలినిన్ జంపి, కాకుస్థతిలకున్ దయా దృష్ఠి వీక్షించి, కిష్కిందకేతెంచి,
శ్రీరామ కర్యార్థివై, లంకకేతెంచియున్, లంకిణింజంపియున్, లంకనున్ గాల్చియున్,
భూమిజన్ జూచి, యానందముప్పొంగ, యాయుంగరంబిచ్చి, యారత్నమున్ దెచ్చి,
శ్రీరాముకున్నిచ్చి, సంతోషనున్ జేసి,
సుగ్రీవునుం అంగదున్ జాంబవంతాది నీలాదులున్ గూడి,
యాసేతువున్ దాటి, వానరుల్ మూకలై, దైత్యులన్ ద్రుంచగా,
రావణుడంత కాలాగ్ని ఉగ్రుండుడై, కోరి, బ్రహ్మాండమైనట్టి యాశక్తినిన్ వేసి,
యా లక్ష్మణున్ మూర్ఛనొందింపగ నప్పుడేపోయి సంజీవనిన్ దెచ్చి,
సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా, కుంభకర్ణాది వీరాదితో పోరాడి,
చెండాడి, శ్రీరామబాణాగ్ని వారందరిన్ రావణున్ జంపగా నంత లోకంబులానందమైయుండనవ్వేళనన్,
నవ్విభీషణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి, పట్టాభిషేకంబు చేయించి,
సీతామహాదేవినిన్ దెచ్చి, శ్రీరాముకున్ ఇచ్చి,
అయోద్యకున్ వచ్చి, పట్టాభిషేకంబు సం రంభమైయున్న
నీకన్ననాకెవ్వరున్ గూర్మిలేరంచు మన్నించినన్
రామభక్తి ప్రశస్థంబుగా నిన్ను నీనామసంకీర్తనల్ చేసితే
పాపముల్ బాయునే భయములున్ దీరునే
భాగ్యముల్ గల్గునే సకలసామ్రాజ్యముల్ సకలసంపత్తులున్ గల్గునే
వానరాకార! యోభక్తమందార! యోపుణ్యసంచార! యోధీర! యోశూర!
నీవే సమస్తంబు నీవే మహాఫలంబుగా వెలసి యాతారకబ్రహ్మ మంత్రంబు పఠియించుచున్ స్థిరముగా వజ్రదేహంబునున్ దాల్చి, శ్రీరామ శ్రీరామ యంచున్ మనఃపూతమై యెప్పుడున్ తప్పకన్ తలచు
నాజిహ్వయందుండి నీదీర్ఘదేహంబు త్రైలోక్యసంచారివై,
శ్రీరామ నామాంకితధ్యానివై బ్రహ్మవై, బ్రహ్మ తేజంబంటచున్ రౌద్ర నీ జ్వాల కల్లోల హావీర హనుమంత!
ఓంకారహ్రీంకార శబ్దంబులన్ భూతప్రేతపిశాచంబులన్,
గాలి దయ్యంబులన్, నీదు వాలంబునన్ జుట్టి నేలంబడంగొట్టి
నీముష్టిఘాతంబులన్ బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి, కాలాగ్ని రుద్రుండవై
బ్రహ్మప్రభా భాసితంబైన నీదివ్యతేజంబునన్ జూచి, రారా నాముద్దు నరసింహాయంచున్,
దయాదృష్ఠివీక్షించి, నన్నేలు నాస్వామీ!
నమస్తే సదా బ్రహ్మచారీ నమస్తే! వాయుపుత్రా నమస్తే!
నమస్తే,నమస్తే
నమస్తే నమస్తే నమస్తే నమః
ప్రార్థన
అతులిత బలధామం స్వర్ణశైలాభ దేహం
దనుజ వనకృశానుం జ్ఞానినా మగ్రగణ్యమ్
సకల గుణ నిధానం వానరాణా మధీశం
రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి.
గోష్పదీకృత వారాశి
మశకీకృత రాక్షసమ్.
రామాయణ మహామాలా
రత్నం వందే నిలాత్మజమ్.
యత్ర యత్ర రఘునాధ కీర్తనమ్
తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్.
బాష్పవారి పరిపూర్ణలోచనమ్
మారుతిం నమత రాక్షసాంతకమ్.

హనుమాన్‌ కి హారతి

ఆరతికీజై హనుమాన్ లలాకీ
దుష్టదలన రఘునాధ కలాకీ
జాకే బలసే గిరివర కాంపై
రోగదోష జాకే నికట నఝూంపై
అంజని పుత్ర మహాబలదాయీఁ
సంతనకే ప్రభు సదా సహాయీ
దేబీరా రఘునాధ పఠాయే
లంకా జారి సీయ సుధిలాయే
లంకా సోకోట్ సముద్రసీ ఖాయీ
జాత పవనసుత బారన లాయీ
లంకా జారీ అసుర సంహారే
సియా రామజీకే కాజ సవారే
లక్ష్మణ మూర్చిత పడే సకారె
ఆని సజీవన ప్రాణ ఉబారే
పైఠిపతాల తోరి జమ కారే
అహిరావనకీ భుజా ఉఖారే
బాయే భుజా అసుర దల మారే
దహినే భుజా సంతజన తారే
సుర నర ముని సంతజన ఉతారే
జైజైజై హనుమాన ఉచారే
కంచన ధార కపూర లౌ ఛాయీ
ఆరతి కరత అంజనా మాయీ
జోహనుమాన(జీ)కి ఆరతి గావై
బసి వైకుంఠ పరమపద పావై

హనుమంతుని గుణగానము

రామపుజారి పర ఉపకారి – మహావీర బజరంగబలీ
సద్దర్మచారి సద్బ్రహ్మచారి – మహావీర బజరంగబలీ
జ్ఞాన గుణసాగర రూప ఉజాగర – మహావీర బజరంగబలీ
శంకరసువన సంకటమోచన – మహావీర బజరంగబలీ
కేసరినందన కలిమల భంజన – మహావీర బజరంగబలీ
రాఘవదూత జయహనుమంత – మహావీర బజరంగబలీ
అంజనినందన అసురనికందన – మహావీర బజరంగబలీ
మంగళమూరతి మారుతినందన – మహావీర బజరంగబలీ
జయ రణధీర జయ రణరోర – మహావీర బజరంగబలీ
జయ బలభీమ జయ బలధామ – మహావీర బజరంగబలీ 
Please share it

Leave a Comment