sri hanuman badabanala stotram in telugu -2025

YouTube Subscribe
Please share it
4.7/5 - (3 votes)

Sri hanuman badabanala stotram in telugu

Unlock the power of Sri Hanuman Badabanala Stotram with our comprehensive guide. Discover the sacred verses that invoke the blessings and protection of Lord Hanuman. Dive deep into the spiritual significance and learn how to incorporate this powerful chant into your daily practice. Start your journey towards spiritual awakening today.

శ్రీ హనుమాన్ బడబానల స్త్రోతం

        హనుమంతుని శక్తిని స్తుతిస్తూ ఈ స్తోత్రము మొదలవుతుంది. సాక్షాత్తు రావణాసురుడి సోదరుడు విభీషణ విరచితం ఈ హనుమాన్ బడబానల స్తోత్రం. అన్ని అనారోగ్యాల నుండి రుగ్మతల నుండి శత్రువుల నుండి వేడుకుంటూ ఈ స్తోత్రాన్ని చదువుతారు. తమకు ఉన్న భయాలను ఇబ్బందుల నుండి కష్టాల నుండి విముక్తి చేయాలని కోరుతూ చివరగా స్వామి వారి ఆశీస్సులు కోసం ఆరోగ్యం అన్నింటా విజయం సాధించే టట్లుగా దీవించమని ఈ శ్లోకం సాగుతోంది.

హనుమాన్ బడబానల స్తోత్రం చాలా శక్తివంతమైనది. గురువుల ఆశీస్సులతో లేదా పెద్దల అనుమతితో, 41 రోజులు లేదా వారి ఉపదేశం అనుసరించి అత్యంత భక్తి శ్రద్ధలతో తమకు ఇష్టమైన ఏదైనా ఆహారాన్ని వదిలి, పారాయణ చేస్తే అన్ని రకాల సమస్యలు ముఖ్యంగా ఆరోగ్యపరమైన సమస్యలు నుండి తప్పక ఉపశమనం లభిస్తుంది. అలాగే మానసిక సమస్యల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. పారాయణ చేయు కాలమంతయు, పరుపుల మీద నిద్రించకూడదు. చాపల మీదనే నిద్రించాలి. సత్యమునే పలకాలి. ఎవరిని దూషించకు కూడదు.

హనుమాన్ బడబానల స్తోత్రం నిత్యము పఠించు దగినది. దీని పారాయణం వలన శత్రు నాశనం జరుగుతుంది. సకల విధములైన టువంటి జ్వరములు, భూతప్రేత పిశాచ బాధలు శత్రువులు చేసిన ప్రయోగములు తొలగిపోతాయి. అసాధ్యాలను కూడా సాధింప గలది స్తోత్రము. 

sri hanuman badabanala stotram in telugu read

ఓం అస్యశ్రీ హనుమద్బడబానల స్తోత్రమంత్రస్య శ్రీరామచంద్ర ఋషిః
శ్రీబడబానల హనుమాన్ దేవతా మమసమస్త రోగప్రశమనార్ధం ఆయురా
రోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం సీతారామచంద్ర ప్రీత్యర్ధ్యం
హనుమద్బడబానలస్తోత్ర జప మహం కరిష్యే.

           ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే శ్రీ మహా హనుమతే ప్రకటపరాక్రమ
సకల దిజ్మండల యశోవితాన ధవళీకృత జగత్రయ వజ్రదేహ రుద్రావతార
లంకాపురీ దహన ఉమా అనలమంత్ర ఉదధి బంధన దశశిరః కృతాంతక
సీతాశ్వాసన వాయుపుత్ర అంజనీ గర్భసంభూత శ్రీరామలక్ష్మణానందకర
కపిసైన్య ప్రాకార సుగ్రీవసాహాయ్యకరణ పర్వతోత్పాటన కుమార బ్రహ్మ
చారిన్ గంభీరనాద సర్వపాప వారణ సర్వజ్వరోచ్చాటన డాకినీ విధ్వంసన
ఓం హ్రాం హ్రీం ఓంనమోభగవతే మహావీరాయ సర్వదుఃఖ నివారణాయ
గ్రహ మండల సర్వభూత మండల సర్వపిశాచ మండలోచ్చాటన
భూతజ్వరైకాహిక జ్వర ద్వ్యాహిక జ్వర త్ర్యాహిక జ్వర చాతుర్ధిక జ్వర
సంతాప జ్వర విషమజ్వర తాపజ్వర మహేశ్వర వైష్ణవజ్వరాన్ ఛింధిఛింధి
భింధి భింధి యక్షరాక్షస భూత ప్రేత పిశాచాన్ ఉచ్చాటయఉచ్చాటయ
ఓం హ్రాంహ్రీం నమో భగవతే శ్రీమహా హనుమతే ఓం హ్రాం హ్రీం హ్రూం
హైం హ్రీం హ్రః ఆం హాం హాం హాం ఔం సౌం ఏహి ఓం హం ఓం
హం ఓం హం ఓం నమోభగవతే శ్రీమహా హనుమతే శ్రవణ చక్షుర్భూతానాం
శాకినీ డాకినీ విషమ దుష్టానాం సర్వవిషం హరహర ఆకాశం భువనం
భేదయ భేదయ ఛేదయ భేదయ మారయ మారయ శోషయ శోషయ
మోహయ మోహయ జ్వాలయ జ్వాలయ ప్రహారయ ప్రహారయ సకల
మాయాం భేదయ భేదయ ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే మహా
హనుమతే సర్వగ్రహో చ్చాటన పరబలం క్షోభయ క్షోభయ సకల బంధన
మోక్షణం కురు శిరఃశూల గుల్మశూల సర్వశూలాన్ నిర్మూలయ నిర్మూలయ
నాగపాశానంత వాసుకి తక్షక కర్కోటక కాళియాన్ యక్షకుల జలగత
బిలగత రాత్రించర దివాచర సర్పాన్నిర్విషం కురుకురు స్వాహా, రాజభయ
చోరభయ పరయంత్ర పరమంత్ర పరతంత్ర పరవిద్యాన్ భేదయ ఛేదయ
స్వమంత్ర స్వయంత్ర స్వవిద్యా ప్రకటయ ప్రకటయ సర్వారిష్టా న్నాశయ నాశయ సర్వశత్రూన్నాశయ నాశయ అసాధ్యం సాధయ సాధయ హుంఫట్ స్వాహా.

 

Please share it

Leave a Comment