Vinayaka Nee Murthike Song Lyrics in Telugu-వినాయకా నీ మూర్తికే

YouTube Subscribe
Please share it

Vinayaka Nee Murthike Song Lyrics in Telugu

వినాయక నీ మూర్తికే పాట వినాయకుని ప్రసిద్ధ పాటలలో ఒకటి. వినాయక నీ మూర్తికే పాట లిరిక్స్‌ని ఇక్కడ తెలుగు పిడిఎఫ్‌లో పొందండి మరియు వినాయకుడిని పూజించడం మరియు మానసిక ప్రశాంతతను పొందడం కోసం దీనిని చదవండి.

వినాయకా నీ మూర్తికే

వినాయకా నీ మూర్తికే మా మొదటి ప్రణామం
వినాయకా నీ మూర్తిక మా మొదటి ప్రణామం
నీవు కొలువున్న మా మనసే నిరతమూ ఆనంద ధామం
నీవు కొలువున్న మా మనసే నిరతమూ ఆనంద ధామం
వినాయకా నీ మూర్తిక మా మొదటి ప్రణామం
వినాయకా నీ మూర్తికే మా మొదటి ప్రణామం

లక్ష్మీ రమణుడు శ్రీ హరి కూడా తలచును నీ శుభనామం
వాణీ బ్రహ్మలు కూరిమి తోడ చేతురు నీ గుణగానం
పార్వతి దేవి హృదయ విహారి… ఈఈ ఈ ఈ
పార్వతి దేవి హృదయ విహారి… శివస్మృతి గణనాథ
వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం
వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం

విఘ్న వినాశక వేద స్వరూప, షణ్ముఖ సోదర స్వామి
దత్తాత్రేయ అయ్యప్ప రూప, ప్రమధా థీశ నమామి
తల్లివి నీవే తండ్రివి నీవే, ఆఆ ఆ ఆ ఆ…
తల్లివి నీవే తండ్రివి నీవే, సకలము నీవయ్యా, ఆ ఆ ఆ…
వినాయక నీ ముర్తికే శత కోటి ప్రణామం
వినాయక నీ ముర్తికే శత కోటి ప్రణామం

పాపవినాశక శుభ స్వరూపా, పార్వతి తనయా స్వామి
బొజ్జ వినాయక సిద్ది వినాయక, ఉండ్రాళ్ళ ప్రియుడివి నీవే
జీవం నీవే ప్రాణం నీవే, ఆఆ ఆ ఆ ఆ…
జీవం నీవే ప్రాణం నీవే, సర్వం నీవయ్యా ఆ ఆ ఆ…
వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం
వినాయక నీ ముర్తికే శత కోటి ప్రణామం

నీవు కొలువున్న మా మనసే, నిరతమూ ఆనంద ధామం
నీవు కొలువున్న మా మనసే, నిరతమూ ఆనంద ధామం
వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం
వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం

Also read :సంతాన గణపతి స్తోత్రం 

Please share it

Leave a Comment