Capricorn in telugu / మకర రాశి
ఉత్తరాషాడ 2,3,4 పాదాలు
శ్రవణం 1,2,3,4 పాదాలు
ధనిష్ఠ 1,2 పాదాలలో జన్మించిన వారు మకర రాశి కి చెందుతారు. మకర రాశి రాశి చక్రంలో 10 వ ది.ఈ రాశికి అధిపతి శని.
Makara rasi characteristics in telugu
ఈ మకర రాశి ని చరరాశి, భూతత్వ రాశి అని అంటారు. ముసలి శరీరాన్ని కలిగి, జింక మొహాన్ని కలిగిన చిత్రం అయినటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడింది.
ఇందులో ముసలి గట్టి పట్టుదలను, జింక సున్నితత్వాన్ని తెలియజేస్తుంది.దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది వీళ్ళు ఏదైనా ఒక విషయం పట్ల పట్టు పడితే దాన్ని వదిలిపెట్టరు, ఎలాగైతే ముసలి గట్టి పట్టు పడుతుందో, అదేవిధంగా వీరు ఒక పనిని మొదలు పెడితే దాని అంతు చూసే వరకూ వదిలిపెట్టరు.జింక ఏ విధంగా అయితే సున్నితంగా ఉంటుందో అదే విధంగా వీరి మనస్సు కూడా ఎంతో సున్నితంగా ఉంటుంది.
ఈ రాశి వారు ఏదైనా తమకు వచ్చిన అవకాశాన్ని జార కుండా జాగ్రత్తగా పూర్తి చేస్తారు. వీరు మంచి శరీర బలం కలిగి ఉంటారు భోజనప్రియులు అని చెప్పవచ్చు. ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు లాభనష్టాలను బేరీజు వేసుకొని, లాభం వస్తేనే ఆ పనిని చేసే మనస్తత్వం కలిగి ఉంటారు. ఒకవేళ ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూడనిదే వదిలిపెట్టరు. తమ వ్యక్తిగత ప్రయోజనాలను చూసుకున్న తరువాత మిగతా విషయాలను మాట్లాడుతారు. తమకు ఏదైనా పనిచేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే, ప్రయోజనాన్ని ఆశించి న తరువాతనే, ఆ పనిని మొదలు పెడతారు.
ఏవేవో భ్రమలు కల్పించుకుని మురిసిపోవటం వీరికి నచ్చని పని. భౌతిక సంబంధమైన విషయముల మీదనే వీళ్లకు విశ్వాసం ఉంటుంది. మూఢనమ్మకాలను అస్సలు నమ్మరు. అంతేకాదు వీరు ఊహా జగత్తులో విహరించరు. కొన్ని రాశుల వారు ఊహ జగత్తులో విహరిస్తూ ఉంటారు కానీ వీరు చాలా ప్రాక్టికల్ గా ఉంటారు. ఏదైనా పని ప్రారంభిస్తే దానిని మధ్యలో విడిచిపెట్టకుండా వాయిదా వేయకుండా ముగించేస్తారు.
ఈ రాశిలో జన్మించిన వారికి గట్టి పట్టుదల, గట్టి జాగరత అవకాశాన్ని వదిలిపెట్టని మనస్తత్వం ఇలాంటి ముఖ్య లక్షణాలు ఉంటాయి. అందువలన వీరు జీవితము చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది. అర్థం కాని ఈ విషయాన్ని వీళ్లు అంగీకరించరు దేనినైనా సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధి కుశలతతో ప్రవర్తిస్తారు. ఎదుటివారి లోటుపాట్లను గమనించి యుక్తితో ఎటువంటి కార్యాన్నైనా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఈ రాశి వారిది ఆచరణ ప్రధానమైన జీవితం అని చెప్పవచ్చు.
ఈ మకర రాశి వారిని చూస్తే ఎవరైనా లొంగిపోతారు ఎందుకంటే వీరికి జింకపిల్ల వంటి ఆకర్షణ ఉంటుంది. వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా ఏ పనైనా చేసి పెడతారు. అయితే తమకు లాభం లేనిదీ మీరు ఏ పని చేయరు ఇది వీరిలో ఉన్న స్వార్థం. వీరు ఎవరికీ లాభం లేనిదే పని చేయకపోయినా కానీ నీ వీరికి మాత్రం ఇతరులు పని చేసి పెడతారు. వీరు తమ స్వార్థాన్ని వదులుకొని తమ తెలివితేటలు పలుకుబడిని ఉపయోగించుకుని పని చేస్తే సమాజానికి ఎంతో మేలు చేసినవారవుతారు.
ఈ మకర రాశి వారు తమ జీవితంలో ఎవరిని నమ్మరు కానీ అందరినీ నమ్మినట్లుగా ప్రవర్తిస్తారు. కొన్ని విషయాలలో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు.
ఈ రాశి వారు ప్రయత్నమున మనసు పెట్టి ఏ పని చేసినా, దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఎదుటి వారిని మించి పోతారు. అయితే వీరు కర్తవ్య నిర్వహణలో హృదయం లేని వారుగానూ, క్రూరులు గాను కనిపిస్తారు. కానీ వీళ్ళ లో ఉన్న నిజాయితీ కర్తవ్య నిర్వహణ వీరికి చాలా ముఖ్యం. ఈ రాశి వారు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటే చాలా మంచిది. సమస్యలను పరిష్కరించడంలో వీళ్లకు అందెవేసిన చెయ్యి. వీళ్ళ తరవాతే ఎవరైనా అని చెప్పవచ్చు.
మకర రాశి వారు ప్రేమ వివాహాల కు చాలా దూరంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పురుషుల ప్రవర్తన లో చాలా సందేహాలు ఉటాయి. భర్త విషయంలో కూడా ఇలాగే ప్రవర్తించి భర్తను కూడా అనుమానిస్తారు. ఇలా అనుమానించి భర్త ను దూరం చేసుకునే అవకాశం కలదు. ఈ జాతి స్త్రీలు తమలోని లోపాన్ని గుర్తించి సరి చేసుకుంటే సంసారం బాగుంటుంది.
మకర రాశి లో జన్మించిన వారి జీవితం అంతా కష్టార్జితం మీదే ఆధారపడి ఉంటుంది అని చెప్పవచ్చు. వీరికి 30 సంవత్సరాల వరకు ఆర్థిక సంపత్తి పెద్దగా ఉండదు. పేదరికాన్ని అనుభవిస్తారు. అయితే ఈ రాశిలో పుట్టిన కొంతమందికి ఆకస్మిక ధన యోగం కలుగుతుంది. వయస్సు దాటిన కొద్దీ ఆర్థికంగా, సాంఘికంగా, జీవితంలో స్థిరపడతారు. వీరికి స్థిరాస్తులు ఉంటాయి సొంత ఇల్లు కూడా ఉంటుంది.
ఈ రాశి వారు సంభాషణ ఎవరితోనైనా గంటల తరబడి చేస్తారు. అక్కరకు రాని అనవసరపు మాటలు చర్చిస్తూ ఉంటారు.ఇలా అనవసరపు పాత కానీ కొట్టి ఎదుటివారితో పనులు చాకచక్యంగా తమకు అనుకూలంగా చేయించుకుంటారు. వీరికి జ్ఞాపకశక్తి అధికంగా ఉంటుంది. ఆచార వ్యవహారాల్లో చాలా నిజాయితీగా ఉంటారు. వీళ్లకు ఉన్న సంకల్పసిద్ధి అద్భుతమని చెప్పవచ్చు, ఎన్ని విఘ్నాలు కలిగిన తమ అనుకున్న పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అనగా వీరు ఓటమిని అంగీకరించరు.
ఎవరి లో ఉన్న తప్పులు నైనా ఇట్టే పెట్టేస్తారు. ఎవరిని నమ్మరు అయితే మంచి వారిని కూడా నమ్మని పరిస్థితులు ఏర్పడతాయి.. సామాన్యంగా వీరు సంతోషపడరు. వీరికి పదవీ వ్యామోహం కూడా ఎక్కువగా ఉంటుంది.
మకరరాశి వారు నీలం ధరించిన శుభ ఫలితాలు పొందుతారు. నీలం ధరించటానికి ముందు మీ రాశిచక్రాన్ని పరిశీలించిన తర్వాతనే ధరించుట శుభ ఫలితాలను ఇస్తుంది.
ఉత్తరాషాడ నక్షత్రంలో జన్మించిన వారు, నక్షత్రాధిపతి రవి కావున కెంపును ధరించాలి.
శ్రవణా నక్షత్ర జాతకులు ముత్యం ధరించాలి. మకర రాశి ధనిష్ట నక్షత్రం లో జన్మించిన వారు నక్షత్ర అధిపతి కుజుడు కావున పగడము ధరించుట మంచిది.
ఉత్తరాషాడ నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష ,శ్రవణా నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష, ధనిష్ట నక్షత్రం వారు ఏ రుద్రాక్ష ధరించాలి. ఇలా ధరించడం వల్ల మకర రాశి వారి శుభ ఫలితాలు పొందుతారు.