ek mukhi rudraksha benefits in telugu
ఏకముఖి రుద్రాక్ష సాక్షాత్తూ పరమేశ్వర స్వరూపం, దీనినే ‘అఖండ రుద్రాక్ష’ అంటారు. ఈ ఏకముఖి రుద్రాక్ష గురించి శివుడు స్వయంగా తన కుమారుడైన షణ్ముఖునితో యిలా చెప్పాడు –
ఈ క్రింది నక్షత్రాల వాళ్ళు ఏకముఖి రుద్రాక్షను ధరించాలి
కృత్తిక,ఉత్తర,ఉత్తరాషాడ నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష ధరించాలి
ఈ రుదాక్ష ను కొనాలంటే ఇక్కడ నొక్కండి ఏకముఖి రుద్రాక్ష
శ్రుణు షణ్ముఖ తత్వేన వక్రే వక్రే తథా ఫలమ్ ఏక వక్ష: శివ: సాక్షాత్ బ్రహ్మహత్యాం వ్యపోహతి
‘వినుము షణ్ముఖా… ఏకముఖము కలిగిన రుద్రాక్ష సాక్షాత్తూ శివునితో సమానము. దీనిని ధరించినచో బ్రహ్మహత్యాది మహాపాతకములు సైతం నశిస్తాయి. ఈ ఏకముఖి ఎవరెవరి కంఠములను అలంకరిస్తుందో… వారు రుద్రుని వలె భాసిల్లుతారు.’ అని షణ్ముఖునికి తెలిపాడు శివుడు.
అందుచేత ‘ఏకముఖి’ రుద్రాక్ష అత్యద్భుత మహిమాన్వితమైనది. దీనిని ధరించినచో…..
ఏకముఖి ధరించిన వారికి శివానుగ్రహంతో పాటు సూర్యుని అనుగ్రహం లభిస్తుంది.
దీని ధారణ వలన ఆధ్యాత్మిక శక్తి అఖండముగా వృద్ధి చెందుతుంది.
- దుష్ట మంత్ర-తంత్ర శక్తుల ప్రయోగాలు నశించిపోతాయి.
- భగవద్భక్తి, మానసిక శాంతి చేకూరుతుంది.
- ఆర్ధికాభివృద్ధి, సిరిసంపదలు పెంపొందుతాయి.
- బ్రహ్మహత్యాది మహాపాపాలు నశిస్తాయి.
ఇంద్రియ నిగ్రహం, ఆయురారోగ్యాభివృద్ధి. దీర్ఘవ్యాధులు, మొండి వ్యాధులు, తలనొప్పి, నేత్రవ్యాధులు, లివర్ సమస్యలు నివారించబడతాయి. ఈ రుద్రాక్ష వున్న గృహం సిరి సంపదలతో అలరారుతుంది. ఏకముఖి రుద్రాక్ష అర్ధచంద్రాకృతిలో జీడిపప్పు ఆకారంలో వుంటుంది. ఈ ఏకముఖి చాలా అరుదుగా లభిస్తుంది.
పరబ్రహ్మ – పరతత్వానికి చిహ్నంగా భాసిల్లే ఏకముఖి ధరించినవారు మహా రాజులు లేదా ప్రముఖ నాయకులు, లేదా ప్రజా పరిపాలకులు అవుతారు. మాజీ ప్రధాని శ్రీ॥తే॥లు శ్రీమతి ఇందిరాగాంధీ… మహానటుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కీ||శే|| శ్రీ యన్.టి. రామారావు గారు యీ ఏకముఖి రుద్రాక్షను ధరించిన తరువాత విశేషమైన జనాదరణను పొంది ప్రముఖ ప్రజా పరిపాలనాడకు లుగా భాసిల్లారు.
ప్రస్తుతం యీ ఏకముఖి నేపాల్ దేశములో రాజవంశీయుల సంరక్షణలోని రుద్రాక్ష వృక్షములనుండి మాత్రమే లభిస్తున్నది. ఈ వృక్షము సంవత్సరమునకు ఒకటి లేదా రెండు ఏకముఖి రుద్రాక్షలను మాత్రమే వుత్పత్తి చేస్తున్నది. అందుచేత నేపాల్ రాజవంశీయులు వివిధ దేశాలకి చెందిన ప్రముఖ వ్యక్తులకు మాత్రమే ‘ఏకముఖి’ని బహూకరిస్తుంటారు.
ఈ ఏకముఖి వృక్షాలు చాలా అరుదు. మన ఆంధ్రప్రదేశ్ లో శ్రీశైలం అడవుల్లో ఒకే ఒక రుద్రాక్ష వృక్షం వున్నట్లు చాలామంది చెప్తారు. కానీ దీనిని గుర్తించినవారు లేరు. ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ వారు కూడా ఖచ్చితమైన సమాచారం యివ్వలేకపోయారు. అయితే ఆ అరణ్యంలో నివసించే ఒక గిరిజన తెగవారికి మాత్రం యీ వృక్షం గురించి తెల్సుననీ, ఏడాదికొకసారి వుత్పత్తి అయ్యే ఒకే ఒక ‘ఏకముఖి’ని వారు పుణ్యక్షేత్రానికి తీసుకువచ్చి ఎవరో ఒకరికి ఉచితంగా దానిని యిస్తారని ప్రతీతి. శివానుగ్రహంతోపాటు ఆ ఏకముఖిని పొందుతున్న అదృష్టవంతు లెవరో … ఎవరికీ తెలియదు.
ఇక రుద్రాక్షలు వుత్పత్తి చేసే వృక్షాలు మన ఇండియాతోపాటు మలేసియా, ఇండోనేసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ దీవుల్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పెరుగు తాయి. మనదేశంలో మహారాష్ట్ర, హిమాచలప్రదేశ్, హిమాలయ పర్వత ప్రాంతాలు, బీహారు, బెంగాల్, అస్సాం రాష్ట్రాల ఉత్తర ప్రాంతాలతో పాటు బదరీనాథ్, హరిద్వార్, నాసిక్ సమీప ప్రాంత అరణ్యాలలో మాత్రమే యీ వృక్షాలున్నాయి. అందుచేత అతి స్వల్పంగా పెరిగే యీ వృక్షాల్లో ఏకముఖి చాలా అరుదుగా వుంటుంది. ఏకముఖి రుద్రాక్ష అరుదుగా అదృష్టవంతులు, పూర్వజన్మ పుణ్యఫలం గల వారికి మాత్రమే లభిస్తుందని ప్రతీతి. ఈ రుద్రాక్ష వృక్షాలు పెరిగే ప్రాంతాలన్నీ శైవక్షేత్రాలే కావడం విశేషం.
అందుచేత ‘ఏకముఖి’ రుద్రాక్షను నమ్మకమైన వ్యక్తులు వ్యాపార సంస్థల నుండి మాత్రమే స్వీకరించాలి లేదా ఖరీదు చెయ్యాలి. దీని ఖరీదు కూడా అధికంగానే వుంటుంది.
ఏకముఖి రుద్రాక్ష రకాలు, ధారణ:
ఏకముఖి రుద్రాక్ష నాలుగు వర్ణములలో లభిస్తుంది.
- శ్వేతవర్ణ ఏకముఖి … దీర్ఘవ్యాధుల నివారిణి
- పీతవర్ణ ఏకముఖి … భోగ, మోక్ష ప్రదాయని
- రక్త వర్ణ ఏకముఖి … బ్రహ్మహత్యాది మహాపాతకనాశని
- శ్యామవర్ణ ఏకముఖి … ఆయురారోగ్య ఐశ్వర్య ప్రదాయని
‘ఏకముఖి రుద్రాక్ష’ సాక్షాత్తూ సర్వేశ్వర లింగస్వరూపంగా భావించి ఆవు పాలతో, గంగాజలంతో, నారికేళజలంతో, పంచామృతాలతో అభిషేకం చేయించాలి. నమక చమకాలతో యీ రుద్రాక్షకి రుద్రాభిషేకం జరిపించాలి. అభిషేకానంతరం విభూది, గంధం, కుంకుమలతో రుద్రాక్షను అలంకరించి పుష్పములు, అక్షింతలతో శివాష్టోత్తర శతనామాలతో పూజించాలి. ఆ తదుపరి ధూప దీప నైవేద్యాలను, నీరాజనాన్ని సమర్పించాలి. అనంతరం – ఈ క్రింది ధారణ మంత్రాలను జపిస్తూ
ధారణ మంత్రములు :
ఓం హ్రీం శ్రీం క్లీం ఏకముఖాయనమః
ఓం ఏం హం ఔం ఐం ఓం …
ఓం ఏం హాం సౌం ఏం
ఓం నమ: శ్శివాయ
ఓం రుద్రా వక్రాశ్యా … ఇతి ఏకముఖ:
ఏక వక్ర, శివ, సాక్షాత్ బ్రహ్మహత్యాం వ్యవపోహతి
పై మంత్రములు జపిస్తూ ఏకముఖి రుద్రాక్షమాలను ధరించాలి.
మహాశివరాత్రినాడుగానీ, మాసశివరాత్రినాడుగానీ, కార్తీక మాఘ మాస ములలో వచ్చు సోమవారమునాడుగానీ లేదా యితర పర్వదినములలో అభిషేక అర్చనలు జరిపిన అనంతరమే ధారకులు ఏకముఖి రుద్రాక్షను ధరించాలి.
దీనిని ఎరుపురంగు పట్టుదారము లేదా బంగారము లేక వెండి లేక రాగి తీగలో కూర్చి మెడలో హారము మాదిరి ధరించాలి. లేదా కుడి మోచేతి పైన దండభాగమునకు ధరించాలి.
ధారకులు ఈ రుద్రాక్షమాలను ప్రతినెలా వచ్చు మాసశివరాత్రినాడు, మహాశివ రాత్రినాడు, ఇతర శైవ పర్వదినములయందు రుద్రాభిషేక అర్చనలు జరిపి మరల ధరించాలి.
ఈ రుద్రాక్ష ధారకులు నీతి నియమాలు పాటించాలి.
మద్యము, మాంసము, జూదము తదితర వ్యసనములు విసర్జించాలి.
సత్యము, ధర్మము, సత్ప్రవర్తన, సద్బుద్ధి, ఆధ్యాత్మిక చింతన కలిగివుండాలి. ఏపనిలో వున్నా మనస్సునందు శివనామ స్మరణ చేస్తూ వుండాలి.
శివభక్తుల గాధలను చదువుతూ, వింటూ, వీలున్నప్పుడల్లా వాటిని మననం చేసుకోవాలి.
ఆర్తులు, అన్నార్తులకు చేతనైనంత వుపకారం చేస్తూవుండాలి.
శివాలయ సందర్శన తరచుగా చేస్తూవుండాలి.
భూతదయ కలిగివుండాలి. శక్తిమేర దానధర్మాలు ఆచరించాలి.
ప్రతినిత్యం స్నానం, శుచి, శుభ్రత నియమంగా పాటించాలి. విభూది విధిగా ధరించాలి.
పై నియమాలను ‘ఏకముఖి రుద్రాక్ష’ ధారకులు విధిగా పాటించినట్లయితేవారు అపర రుద్రావతారునివలె భాసిల్లుతారు. ఆయురారోగ్య ఐశ్వర్య సంపదలనూ, పుత్రపౌత్రాది వంశాభివృద్ధిని పొంది సుఖించి, జీవితాంతమున శివసాయుజ్యం పొందుతారు.
అంతేకాదు. భుసుండుడు అను మహర్షికి కాలాగ్ని రుద్రుడు స్వయంగా చెప్పినట్లు
ఏకవక్షంతు రుద్రాక్షం పరతత్త్వ స్వరూపకమ్
తధారణాత్పరే తత్త్వ ప్రియతే విజితేంద్రియ:
‘ఏకముఖ రుద్రాక్ష పరతత్త్వ స్వరూపమునకు చిహ్నము. దీనిని ధరించిన వారలు ఇంద్రియజయులై పరతత్త్వమునందు విలీనులు కాగలరు…’
కనుక ఏకముఖి రుద్రాక్ష ధారణ సర్వోత్తమం.
Also read : కృత్తిక నక్షత్రము
3 thoughts on “ek mukhi rudraksha benefits in telugu”