Sagittarius in telugu / ధనుస్సు రాశి

YouTube Subscribe
Please share it
4.6/5 - (5 votes)

sagittarius in telugu – ధనుస్సు రాశి స్వభావం-లక్షణాలు వివరణ

మూల 1,2,3,4 పాదాలు

పూర్వాషాడ 1,2,3,4 పాదాలు

ఉత్తారాషాడ 1,  వ పాదం లో జన్మించిన వారు ధనుస్సు రాశి కి చెందుతారు. ధనస్సు రాశి రాశి చక్రములో 9వ ది.  ఈ రాశికి అధిపతి గురువు.

Sagittarius in teluguఈ ధనస్సు రాశి లో జన్మించిన వారు సన్నగా, పొడవుగా, విశాలమైన నుదురు, పొడవైన ముక్కు కలిగి ఉంటారు. వీరి మనస్సు చాలా నిర్మలంగా ఉండి నిష్కల్మష మైన మనసుతో, కల్లాకపటం లేకుండా మాట్లాడుతూ, మిత్రులకు ఉపయోగకరం చేయడానికి ముందుంటారు. వీరు ఎవరికైనా ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని భావిస్తుంటారు.అంతేకాదు ప్రతి విషయాన్ని స్వయంగా తెలుసుకుని తమకు తోచిన విధంగా చేస్తారు. ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలు అసలు పాటించరు. ఎందుకైనా ఏదైనా విషయాన్ని తమకు తాముగా లోతుగా పరిశీలించి ఎవరి సలహాలు పాటించకుండా ఆ విషయం పై ఒక సొంత అభిప్రాయానికి నిర్ణయానికి వస్తారు.

స్వభావరీత్యా ఈ రాశి ద్విస్వభావ రాశి. ఏదైనా విషయంపై ఒకసారి వేగంగానూ మరొకసారి చాలా నిధానంగా స్పందిస్తారు. అనగా ఇందులో మనకు స్వభావం అనేది కనబడుతోంది. ఒకసారి అత్యంత వేగముతో ను మరోసారి విధానంగా నిర్ణయాలు తీసుకుని మనస్తత్వం కలిగి ఉంటారు. అంతే కాదు ప్రాణం ఎంత వేగంగా ముందుకు వెళ్తుందో వీరి ఆలోచనలు కూడా అంతే వేగంగా ఉంటాయి. అనగా గా  చాలా వేగంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు.

ధనస్సు రాశి వారు తమకు ఇష్టమైన పని మాత్రమే చేస్తారు. అంతే కాదు ఎవరైనా ఏదైనా పని చేయమని బలవంతం చేసిన ఆ పని చేయరు. అంటే తమకు ఇష్టపడితే నే ఆ పని చేస్తారు.

ఈ రాశిలో జన్మించిన పురుషులు చాలా హ్యాండ్ సమ్ గా ఉంటారు. స్త్రీలు అయితే చాలా అందంగా ఉంటారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ రాశి వారి యొక్క మనసు కల్మషం లేని మనసు అని చెప్పవచ్చు. అయితే తమ మనసులో ఏది ఉంచుకోరు అంతా బయటికి లోడ లోడ చెప్పేస్తారు. ఈ కల్మషంలేని మనసును చూసి ఎంతో మంది స్నేహితులు ధనుస్సు రాశి వారిని ఇష్టపడతారు స్నేహం చేస్తారు. తమ మనసులోని ది యధాతథంగా ఎదుటివారికి చెప్పటం వలన ఒక్కొక్కసారి అపార్థాలు కూడా దారి తీయవచ్చు.అంతేకాదు వీరి మాటలు బాణాలు లాగా మనసుకు ఎదుటివారి మనసు కు గుచ్చుకుంటాయి. అయినా వీరి మనస్సు చాలా సున్నితమైనది.అయితే ఎదుటివారు వీరి మాటల్లో నిజం ఉంది అని నిదానంగా గ్రహించి పశ్చాత్తాప పడతారు.

ధనుస్సురాశి మూల నక్షత్రం లో జన్మించిన వారు స్థిర చిత్తం కలిగినవారు అని చెప్పవచ్చు. వీరిలో గర్వం డాంబికం చాలా ఎక్కువగా ఉంటుంది. మూలా నక్షత్రానికి అధిపతి కేతువు. మరి ఈ కేతువుకి అధిష్టాన దైవం వచ్చి గణపతి. అందువల్ల మూల నక్షత్రం వారు గణపతిని ఆరాధన చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. మూలా నక్షత్ర జాతకులు ఖర్చు అధికంగా చేయు మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంతేకాదు వీరు దురలవాట్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ప్రాపంచిక జ్ఞానం అధికంగా ఉంటుంది వీరికి. భార్యతో సంసార జీవితం చాలా సంతోషంగా గడుస్తుంది. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. రవి, చంద్ర, కుజ దశలు వీరికి బాగా యోగిస్తాయి.

పూర్వాషాడనక్షత్రం లో జన్మించిన వారు, పూర్వాషాడ నక్షత్రము శుక్ర గ్రహ నక్షత్రము అని చెప్పవచ్చు, ఈ నక్షత్ర జాతకులు ఎక్కువగా మాట్లాడుతూ ఊహాలోకంలో విహరిస్తూ ఉంటారు. ఎక్కువగా ఇతరులకు ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. వీరు వారు ఇచ్చినటువంటి మాటను వాగ్దానమును కొనలేరు. జీవితంలో మొదటి భాగం కుటుంబం కోసం వెచ్చిస్తారు, వీరికి స్నేహితులు తరచుగా మారిపోతుంటారు. వీరికి వివాహము ఆలస్యంగా జరిగే అవకాశం కలదు.లేదా ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లో జరిగే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనను వివాహ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. భార్య యొక్క ప్రేమ అనురాగాలను వీరు పొందుతారు. వీరు స్వల్పమైన గర్వాన్ని కలిగిఉంటారు.వీరికి స్నేహితులు అధికంగా ఉన్నప్పటికీ త్వరత్వరగా స్నేహితులు మారిపోతుంటారు. వీరి జీవితంలో అనుకూల మైనటువంటి భార్య వీరికి ప్రాప్తిస్తుంది. ఈ నక్షత్రం వారికి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. జీవితంలో అనేక కోణాల్లో చూసి అనుభవం గడిస్తారు. స్నేహితుల సహాయ సహకారాలతో మంచి స్థానాన్ని అలంకరిస్తారు. మొత్తం మీద అ ధనుస్సు రాశి లో పూర్వాషాడ నక్షత్రం లో జన్మించిన వారు మంచి తెలివితేటలు కలవారు అని చెప్పవచ్చు.

ఉత్తరాషాడ నక్షత్రంలో జన్మించిన వారు పరిస్థితిని చూస్తే ఈ నక్షత్రము రవి గ్రహ నక్షత్రము, వీరు అందరికీ ఇష్టులు గా ఉంటారు. అనగా ఈ నక్షత్రములో జన్మించిన వారు ఎవరైనా ఇష్టపడతారు. అంతేకాదు వీళ్ళతో స్నేహం చేస్తారు. వీరు ఎక్కువగా దానధర్మాలు చేస్తారు. అంతే కారు ఎక్కువగా స్నేహితులు ఉంటారు మంచి పని చేయాలని ఆలోచన వీళ్లలో ఎప్పుడూ ఉంటుంది. ఈ నక్షత్రంలో పుట్టిన వారు ప్రజ్ఞావంతులు ,శాంతస్వభావం కలవారు గాను ఉంటారు. ధనవంతులు గాను కూడా ఉంటారు. మీరు జీవితం సాధారణ జీవితం తో మొదలవుతుంది. ఆ తర్వాత క్రమంగా మంచి స్థితికి చేరుకుంటారు. ఒక్కసారి విపరీతంగా ను మరొక సారి నెమ్మదిగా నూ మాట్లాడతారు మొత్తం మీద మిత భాషి అని చెప్పవచ్చు ఈ నక్షత్రంలో జన్మించిన వారికి భక్తి అధికంగా ఉంటుంది. దేవుడి పట్ల అచంచల విశ్వాసం ఉంటుంది స్నేహితుడు ఆపదలో ఉన్నారు అంటే ఆదుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు.

ధనుస్సు రాశి వారు ధరించాల్సిన రుద్రాక్ష మూలా నక్షత్రం లో జన్మించిన వారు, నవముఖి రుద్రాక్షను, పూర్వాషాడ నక్షత్రం లో జన్మించిన వారు షణ్ముఖి రుద్రాక్షను, ఉత్తరాషాడ నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్షను ధరిస్తే శుభ ఫలితాలు పొందుతారు.

అలాగేరత్నధారణ విషయానికి వస్తే మూలా నక్షత్రం వారు వైడూర్యమును పూర్వాషాడ నక్షత్రం వారు పుష్యరాగాన్ని ఉత్తరాషాడ నక్షత్రం వారు కెంపు ధరించిన శుభ ఫలితాలు పొందుతారు. ధనుస్సు రాశి వారికి 2022 ఏప్రిల్ వరకు ఏలినాటి శని జరుగుతోంది. కావున సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి. సర్ప సూక్త పారాయణం చేయాలి శివుడికి నమకము చమకము రుద్రం తో అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల ఏలినాటి శని ప్రభావం తగ్గి శుభ ఫలితాలు పొందుతారు.

Please share it

3 thoughts on “Sagittarius in telugu / ధనుస్సు రాశి”

Leave a Comment