Scorpio in telugu / వృశ్చిక రాశి – Vrischika Rasi In Telugu

YouTube Subscribe
Please share it
5/5 - (3 votes)

Scorpio in telugu / వృశ్చిక రాశి

విశాఖ నక్షత్రం 4వ పాదం

జేస్టా నక్షత్రం1, 2 ,3 ,4 పాదాలు

అనురాధ నక్షత్రం 1, 2 ,3 ,4 పాదాలు

Scorpio in telugu

వృశ్చిక రాశి వారి యొక్క జీవిత, జాతక, స్వరూప లక్షణాలు అనగా సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో చూద్దాం. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఈ రాశి రాశి చక్రంలో 8 వది. లక్షణ రీత్యా ఈ రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడే ధోరణి వీధిలో మనకు పెద్దగా కనిపించదు. తత్వ రిత్య వృశ్చిక రాశి వారిది జల స్వభావము అయినందువల్ల బయటపడకుండా పనులు చక్క బెట్టుకు నే స్వభావాన్ని కలిగి ఉంటారు. గుమ్మ నంగా వ్యవహారాలు చెక్క బెడతారు. ఏవి జరిగిపోయిన వి ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తారు.

వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు.చూడటానికి అందంగా ఉండటమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను మీతో పంచుకుంటారు .మీ మిత్రత్వాన్ని కోరుకుంటారు.ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు.అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని వలన జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం వస్తుంది.స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువ సేపు గడుపుతారు.స్నేహితులకు సహాయం చేయడం అంటే చాలా ఇష్టం అంతే కాదు వారి కష్టసుఖాలను కూడా పంచుకుంటారు. వృశ్చిక రాశి లో జన్మించిన వారు ఇతరులతో ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటారు.

ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది. అనగా దృఢమైన శరీరం ఉంటుంది అని అర్థం అంతేకాదు కోపతాపాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ముందు వెనుక ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతోనూ తగాదాలు పెట్టుకుంటారు.

ఈ వృశ్చిక రాశి వారికి అధిక మైనటువంటి పట్టుదల ఉంటుంది. అందువలన వీరు జరిపే వ్యాపారాలలో నష్టపోయే అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక విషయాన్ని ఎదుటివారికి మొహం మీద ఉన్నది ఉన్నట్టుగా చెప్పే మనస్తత్వం వీళ్లది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధం కావచ్చు. వీరిని గాని మనం చూస్తే కొద్దిగా చిరాకు కనిపిస్తూ ఉంటుంది.

ఈ వృశ్చిక రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజములో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయుటకు ఆలోచించి స్వభావము వీరిలో ఉంటుంది. అయినప్పటికీ అనవసర ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో ఆపేక్ష ఎక్కువగా ఉంటుంది.

కొన్ని సందర్భాలలో అలవాట్లు మితిమీరి టం వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందువల్ల వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చెల్లించి పోయే మనస్తత్వాన్ని వీళ్లు కలిగి ఉంటారు. వీరిలో కొంతమంది దేశాటనం చేసేవళ్ళు ఉంటారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

ఈ వృశ్చిక రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి ఇష్టపడతారు. జీవితంలో అనేక సౌఖ్యాలను పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు, విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి.

వృశ్చిక రాశి వారు జీవిత భాగస్వామి ని పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఎలా గౌరవించాలో వీరికి బాగా తెలుసు. ఈ వృశ్చిక రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది. ఈ కారణం వలన ఇలాంటి పరిస్థితులలోనైనా నిరుత్సాహ పడక ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు.వృశ్చిక రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు. ఈ వృశ్చిక రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది. ఏ విషయం కూడా మనసులో దాచుకోరు. అందువలన వృశ్చిక రాశి వారిని ద్వేషిస్తారు కొందరు.

బాల్యము నుండే సంపాదన మొదలుపెడతారు కావున ఏ వ్యాపారం ప్రారంభించిన అందులో విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగులను తమకు అనుకూలంగా మార్చుకుంటారు.మీరు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఏ పని లో నైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తారు.

అయితే నక్షత్రాన్ని బట్టి చూస్తే విశాఖ నక్షత్రంలో పుట్టిన వారు అధిక చాతుర్యాన్ని కనబరుస్తారు. విరు చక్కటి వాగ్ధాటిని కలిగి ఉంటారు. ఈ నక్షత్రం వారు తెలియని విషయం కూడా తమకు బాగా తెలిసినట్టు గా మాట్లాడుతారు. ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పటికీ ఈర్ష్య స్వభావం వీరిలో ఉంటుంది. విశాఖ నక్షత్రంలో పుట్టిన వారికి ప్రతి పనిలోనూ అనుమానాలు ఉంటాయి. ఈ నక్షత్రంలో పుట్టిన వారికి గర్వం అధికంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు విద్య, వినయం, వివేకము కలిగి ఉంటారు. అధిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ఉపన్యాసాలు చేయటం లో వీరికి వీరే సాటి. సంచార స్వభావాన్ని కలిగి ఉంటారు ఇంట్లో, బయట, రాణిస్తారు. ఈ అనురాధ నక్షత్రం లో పుట్టిన వారు ప్రియంగా మృదుమధురంగా మాట్లాడుతారు.

ఇకజేష్ఠ నక్షత్రం లో జన్మించిన వారి యొక్క విషయానికి వస్తే వీరికి అధికంగా కోపం ఉంటుంది. అయినప్పటికీ అల్పసంతోషి లు అని చెప్పవచ్చు. వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా చల్లబడ్డారు. వీరు ధర్మ గుణం ప్రధానంగా కలిగి ఉంటారు. అదేవిధంగా వ్యవహారిక జ్ఞానం కలిగి ఉంటారు.

ఈ  రాశి వారిని ఎవరైనా చూస్తే మీరు చాలా స్వార్థపరులు అని అనుకుంటారు. నిజమేమంటే వృశ్చిక రాశి వారు స్వార్ధపరులు కారు పరోపకారం చేయువారు. స్నేహితులకు సహాయం చేసే గుణం వీరికి అధికంగా ఉంటుంది. మనం ఒక విషయాన్ని గమనించాలి వృశ్చికం అనగా తేలు అనగా దాని యొక్క గుణాలు వీళ్ళకి కలిగి ఉంటారు. ఈ రాశి వారిని ఎవరైనా బాధిస్తే దానిని గుర్తించుకొని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు.కావున ఈ రాశి వారితో ఎవరైనా తగాదా పెట్టుకోవాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి.

విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష,

Video Link : పంచముఖి రుద్రాక్ష 

అనురాధ అ నక్షత్రంలో జన్మించినవారు సప్తముఖి రుద్రాక్ష,

Video Link : సప్తముఖి రుద్రాక్ష  

జేస్టా నక్షత్రం లో జన్మించిన వారు చతుర్ముఖి రుద్రాక్ష ధరిస్తే చాలా మంచిది.

Video Link : చతుర్ముఖి రుద్రాక్ష

అలాగే రత్నాల విషయానికొస్తే విశాఖ నక్షత్రం వారు కనక పుష్యరాగం ధరించాలి. శివాలయంలో లో ఒక గురువారం నాడు శివుడికి అభిషేకం చేయించి శనగలు దానం ఇచ్చి బంగారంలో పొదిగిన కనక పుష్యరాగాన్ని చూపుడు వేలుకు ధరించాలి.

అనురాధ నక్షత్రం వారు ఇంద్రనీలం ధరించాలి. ఒక శనివారం నాడు శివాలయంలో శివుడికి అభిషేకం చేయించి నల్ల నువ్వులు దానం ఇవ్వాలి. ఆ తరువాత మధ్యవేలుకు వెండిలో పొదిగిన నీలాన్ని ధరించాలి.

జేస్టా నక్షత్రం వారు పచ్చను ధరించిన శుభ ఫలితములు పొందుతారు.  ఒక బుధవారం నాడు విష్ణు అష్టోత్తర పూజ చేసి పెసలు దానం చేయాలి ఆ తర్వాత చిటికెన వేలుకు బంగారంలో పొదిగిన జాతిపచ్చను ధరించండి.

ఈ వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామని దర్శనం చేసుకోవడం  వల్ల శుభాలు పొందుతారు. అలాగే శనగలు దానము చేసిన చాలా మంచిది.

 

 

Please share it

11 thoughts on “Scorpio in telugu / వృశ్చిక రాశి – Vrischika Rasi In Telugu”

 1. DOB:16-06-1881
  Place: Kothagudem, khammam district, Telegram
  Time: 05:05 pm
  Name: Adepu Raghavendhar Raj
  Problem: i am not luckiest person, because so many health and money problems.

  Please sir, tell me the truth of my horoscope
  Thank you sir

  స్పందించు
 2. DOB:16-06-1881
  Place: Kothagudem, khammam district, Telegana
  Time: 05:05 pm
  Name: Adepu Raghavendhar Rao
  Problem: i am not luckiest person, because so many health and money problems.

  Please sir, tell me the truth of my horoscope
  Thank you sir

  స్పందించు

Leave a Comment