Pisces In Telugu / Meena Rasi Telugu 2023

YouTube Subscribe
Please share it
5/5 - (3 votes)

Pisces In Telugu – మీన రాశి

ద్వాదశ రాశులలో చివరిది, రాశి చక్రంలో 12 వది మీన రాశి

పూర్వాభాద్రా 4 వ పాదము

ఉత్తరాభాద్రా 1,2,3,4 పదములు

రేవతి 1,2,3,4 పాదములు లో జన్మించిన వారు మీన రాశికి చెందుతారు.  ఈ రాశికి అధిపతి గురువు. ఈ రాశి, రాశి చక్రంలో చివరిది.

Pisces In Telugu

మీన రాశి ని సరి రాశి, ద్విస్వభావ రాశి, జలతత్వం రాశి అని పిలుస్తారు. రెండు చేపలు ఒక దాని తోక వైపునకు మరియొక దాని తల ఉన్నట్లు, ఈ రాశికి చిహ్నముగా శాస్త్రాలలో చెప్పబడినది.

మీనరాశి పూర్వాభద్ర నాలుగో పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు. అందమైనటువంటి గంభీరమైనవంటి రూపం కలిగిన వారుగా ఉంటారు.

ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైనటువంటి రూపము, సద్గుణ గుణాలతో పాటుగా ధర్మమును కూడా తెలిసి ఉంటారు. శత్రు నాశనం చేయువారు గాను సుఖ జీవితానికి అలవాటు పడిన వారుగానూ ఉంటారు.

అయితే ఉత్తరాభాద్ర 1 పాదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకొనుట, ఇతరులపై అధికారం చలాయించే నైజాన్ని కలిగి ఉంటారు.

ఉత్తరాభాద్ర 2 పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు, గొప్ప వారు, పండితులు వీరి తో స్నేహం చేస్తారు. జ్యోతిష్య పరిచయం కూడా వీళ్ళకు ఉంటుంది రాజకీయ ప్రవేశం కూడా వీళ్లు చేస్తారు.

ఉత్తరాభాద్ర 3 పాదంలో జన్మించిన వారు, కళా నైపుణ్యం కలిగి ఉంటారు, పర స్త్రీ సాంగత్యం ఉంటుంది వీళ్ళకి, దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది, కార్య సూర్య లు అని చెప్పవచ్చు.

ఉత్తరాభాద్ర 4 వ పాదంలో జన్మించిన వారు, ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వం ఉంటుంది చాలా చాతుర్యం గా మాట్లాడుతారు,

రేవతి నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు, అందరి గౌరవం పొందగలుగుతారు చాలా అదృష్టవంతులు, సుఖ జీవనానికి వీళ్ళు అలవాటు పడతారు.

రేవతి నక్షత్రం 2 పాదం లో జన్మించిన వారు పాపపు పనులు చేయడంలో వీరికి ఎక్కువగా ఆసక్తి ఉంటుంది, పర స్త్రీ సాంగత్యం ఉంటుంది. తమ కుటుంబం మీద కాకుండా ఇతరుల పై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది.

రేవతి నక్షత్రం 3 వ పాదములో జన్మించిన వారు అందమైన రూపం కలిగి ఉంటారు. పాపపు పనులు చేయడంలో ఎక్కువగా ఆసక్తి ఉంటుంది.

రేవతి నక్షత్రం 4వ  పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. మంచి స్వభావం ఉంటుంది దైవభక్తి ఉంటుంది పెద్దలంటే గౌరవం ఉంటుంది.

మీన రాశి వారి గుణగణాలు :- మీన రాశి వారు స్వసిద్ధముగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకుని ఆలోచన వీరికి ఉండదు. రహస్యంగా దాచుకోవటం వీరికి చేతకాదు అని చెప్పవచ్చు. ఇతరులకు అపకారం తలపెట్టటం కుట్రలు పొందటం వీరికి చేతకాదు. వీరు చూడటానికి ఆవేశపరులు గా కనిపిస్తారు గాని వీరికి దుష్ట బుద్ధి మాత్రం ఏమాత్రం ఉండదు. వీరికి ఎవరి పైన కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ వారి మీద కక్ష తీర్చుకోరు. దుష్టులును కూడా మంచి వారిగా మార్చటానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఇదే వీరి గొప్ప గుణము.

మీన రాశి వారికి చేతులు, పాదాలు పుష్టికరంగా వుంటాయి. మెత్తని అందమైనటువంటి తలవెంట్రుకలను కలిగి ఉంటారు. వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనలలో ఉండదు. చాలా భయపడుతూ ఉంటారు.  కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం. ఎప్పుడు ఏదో పని చేస్తూ, ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు. అలా లేకపోతే వీడికి ఏమీ తోచదు. ఏదైనా పని చేయాలంటే వీరికి ఎవరైనా తోడు ఉండాల్సిందే, ఒక్కరు స్వతంత్రంగా ఏ పని చేయలేరు. మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు వీరికి నమ్మకం ఉండదు. వీరికి మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి.పనులను వేగంగా చేయాలి అని ఆలోచన ఎంత గా ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు. ఏ విషయంలో నైనా లోతుగా పరిశీలించే తత్వం వీరిలో ఉండదు. పైపైన చూసి నిర్ణయాన్ని తీసుకుంటారు.

మీన రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం, విశ్రాంతి లేకపోతే ఏ పనులను వీరు సమర్ధవంతంగా నిర్వహించ లేరు. తొందరగా అలసిపోయేవంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారిపై స్త్రీల ప్రభావము ఎక్కువగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమురాలు ఐతే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది. సంసార జీవితం ఈ రాశివారికి చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. వీరు వారి కుటుంబ సభ్యులకు అన్నిరకాల అయినటువంటి ఆనందాన్ని ఇవ్వగలరు. మీన రాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మార్చివేస్తుంది. అంతేకాదు సమూల మార్పును తీసుకువస్తుంది. వీరు తమ భార్య పిల్లలు అంటే చాలా వాత్సల్యాన్ని, అభిమానాన్ని చూపిస్తారు.

మీన రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం ఎక్కువగా ఉంటుంది. అనేక విషయాలలో మానసిక ఆందోళన చెందుతుంటారు. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడుతూ ఉంటారు. పనులు ఎక్కువగా చేయడం వల్ల అది వేగంగా తొందరగా చేయడం వల్ల అలసిపోతుంటారు.

సాధారణంగా మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులై ఉంటారు. కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకొను సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. మీన రాశి వారు వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడతారు.వృత్తి ఉద్యోగాలలో చాలా ఒడిదుడుకులు వీరికి తరచుగా వస్తూ ఉంటాయి. ఐనా ముఖ్య విషయం ఏమంటే ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా నిద్రిస్తారు.

వీరికి కళ, సాహిత్య రంగాలలో మంచి ఆసక్తి నిపుణత ఉంటుంది. వంశపారంపర్యంగా లభించిన ఆస్తులను వృద్ధి చేస్తారు. ఇతరుల మాయ మాటల ప్రభావం వీరి మీద చాలాకాలం చూపిస్తుంది. నిధానం అవసరమని నిదానంగా వీళ్లు గ్రహిస్తారు. వంశ గౌరవం, మంచితనం చాలావరకు వీరిని ఆదుకుంటుంది. ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్దరిస్తారు అని చాలాకాలం పాటు వేచి చూస్తారు. ఆ విధంగా విశ్వసిస్తారు. చివరకు వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు.

మీన రాశి వారు సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం వల్ల వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు.

పూర్వభద్ర నక్షత్రం లో జన్మించిన వారు పొడవుగా ఉంటారు. బలిష్టమైన దేహం కలవారుగా ఉంటారు. వెడల్పైన ముఖం ఉంటుంది. పెద్దపెద్ద దంతాలను వీరు కలిగి ఉంటారు. కోపం ఎక్కువగా ఉంటుంది స్వేచ్ఛా జీవితాన్ని కోరుకుంటారు.

ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు భారీ విగ్రహం గా చాలా పెద్ద గా ఉంటారు. లేదా చాలా బక్కపలచగా ఉంటారు. తీక్షణమైన చూపులను కలిగి ఉంటారు. పెద్ద చెవులు తో ఒక రకమైనటువంటి ఆకర్షణ వీరిలో ఉంటుంది. మాట కూడా చాలా పౌరుషం గా ఉంటుంది. మీరు ముఖంలో ఎటువంటి భావాలు బయటికి కనపడవు. తమ స్వశక్తితో వీరు పైకి వస్తారు.

రేవతి నక్షత్రం లో జన్మించిన వారు కొద్దిగా ఎత్తుగా ఉంటారు. కొద్దిగా వయస్సు వచ్చిన తర్వాత స్థూలకాయులు అవుతారు. గుండ్రటి ముఖం, విశాలమైన నుదురు ఉంటుంది. మనసులోని భావాలు మనకు ముఖంలో చాలా స్పష్టంగా కనబడతాయి. భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి ప్రేమ, దయ, జాలి, కలిగి ఉంటారు.

మీన రాశి కి అధిపతి గురువు కావున కనక పుష్యరాగాన్ని ధరించాలి. కనక పుష్యరాగాన్ని బంగారములో చూపుడు వేలుకు ధరించాలి.

ఉత్తరభద్ర నక్షత్రానికి అధిపతి శని కావున నీలం ధరిస్తే మంచిది. ధరించే ముందు మీ జాతకాన్ని ఒక జ్యోతిష్యుడి చూపించుకుని ఆయన సలహా మేరకు ధరిస్తే మంచిది. ఈ రత్నాన్ని వెండిలో మధ్య వేలుకు ధరించాలి.

రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు కావున జాతిపచ్చ ధరిస్తే చాలా మంచిది. జాతి పచ్చను బంగారములో చిటికెన వేలుకు ధరించాలి.

మీన రాశి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు. పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష, ఉత్తరాభాద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి. రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరించాలి. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు.

వీటిని కూడా చదవండి.  మేషరాశి

                               వృషభ రాశి

 

 
Please share it

Leave a Comment