మీ రాశిఫలాలు లను ఖచ్చితంగా తెలుసుకోవాలంటే, ఖచ్చితంగా మీకు మీ రాశి ఏదో మీకు తెలిసి ఉండాలి. అలాంటప్పుడే మీరు ఖచ్చితమైనటువంటి ఫలితాలను తెలుసుకోగలరు. ఈ క్రింద ఇచ్చిన లింక్ మీరు క్లిక్ చేసి, మీరు మీ పుట్టిన సంవత్సరం, నెల, రోజు మరియు ఎక్కడ జన్మించారు ఆ ప్రదేశం, మీ పేరు మీ ఫోన్ నెంబర్ మీ ఈమెయిల్ ఇవ్వండి. మీ యొక్క ఖచ్చితమైన ఎటువంటి రాశి, మీ యొక్క లగ్నం, మీరు ధరించవలసిన రుద్రాక్ష , మరియు రత్నం ఇలాంటి విషయాలు మీకు ఈమెయిల్ ద్వారా పంపుతాను. ఈ లింక్ ని క్లిక్ చేయం

Mesha Rasi / aries in telugu – Character – hidden secrets

Join Telegram Channel
Please share it
3.5/5 - (4 votes)

అశ్విని నక్షత్రం 1,2 ,3 ,4 పాదములు     

భరణి నక్షత్రం 1,2 ,3 ,4 పాదములు

కృత్తికా నక్షత్రం 1, వ పాదములో జన్మించిన వారు మేష రాశికి చెందుతారు.

Mesha Rasi / aries in telugu

Mesha Rasi

Mesha Rasi వారి చిహ్నము గొర్రె. మేష రాశి వారికి అధిపతి కుజుడు. కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య యుద్ధవిద్యలు, అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవడంలో కొత్త పరికరాలను తయారు చేయడంలో ఆరితేరి ఉంటారు. యుద్ధ ట్యాంకులను నడపడం, నేవీ కి సంబంధించిన వాహనాలను నడపటం, యుద్ధ విమాన పైలెట్లు గాను, అను సంబంధమైన సాంకేతిక వ్యవహారాల అన్నిటిలోనూ, నిష్ణాతులుగా చెప్పవచ్చు.

ఈ రాశి వారు స్వతంత్ర అభిప్రాయములు కలవారుగా ఉంటారు. ఈ స్వాతంత్రమునకు ఎవరైనా  అడ్డు వచ్చినచో ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు. అయితే వీరికి స్వాతంత్రం ఇచ్చినచో ఎంతటి ఘన కార్యములు నైనను సులభముగా చేస్తారు. ఇలాంటి విషయాల వలన వీరిలో అహంకారము నిర్లక్ష్యము పెరిగిపోతుంది. ఒక్కొక్క సారి వీరి పతనము  కూడా దారి తీస్తుంది.

ఈ  Mesha Rasi వారికి ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోవు స్వభావము కలదు. ఎవరైనా  సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకునవచ్చును. వీరి శరీరము చాలా శక్తివంతమైనది పెద్ద వ్యాపారాలు నిర్వహించుట వీరికి వెన్నతో పెట్టిన విద్య. చక్కటి సంభాషణ చాతుర్యము వీళ్ళకి ఉంటుంది. వీళ్లకు ఉన్నటువంటి వాగ్ధాటితో వేలాది ప్రజల నూట కట్టుకుని మహా కార్యములు కూడా సాధించగలరు. వీరిని అనుసరించే వారు వీరికి విధేయులై ఉండి ఎంతటి దుష్కర కార్యములలో నైనను దూకగలరు.

అచంచలమైన మనో నిశ్చయము సాహసము వీరి లక్షణములు. ఇవి కాకుండా వీరిలో మూర్ఖత్వము కూడా వుండును. ముక్కుసూటిగా ఆవేశము గా ప్రవర్తిస్తారు కానీ కొంచెం కూడా ఆలోచించరు. మేష రాశి వారికి సాహసమే ఊపిరి. పది మందిని కూడ పెట్టుకుని నాయకత్వం వహించుట వీరి జీవలక్షణం. లక్ష్యసాధనలో ఎంతటి త్యాగము కైనను వెనుకంజ వేయరు.

మేష రాశి వారి హృదయము దయార్థ హృదయము ఎవరి మీదనైనా విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపం గానీ చూపిస్తారు. అయితే ఇతరులు ఎంత గాఢముగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరిపట్ల చూపినప్పుడు అంత తీవ్రంగా బాధ పడతారు. దీని వలన వీళ్ళకి అనారోగ్యం మానసిక ఆందోళన కలుగుతుంది. మేష రాశి వారు శారీరకముగా మానసికముగా చాలా శక్తివంతులు ఉత్సాహవంతులు అగుటవలన నిరంతర స్త్రీ సాంగత్యము వీరికి అవసరం అవును. దీనివలన వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మ అగుదురు.  అయితే యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవటంలో పొరపడి మోసపోతారు. ప్రేమ వివాహము ఈ రాశి వారికి కలిసి రాదు.

మేష రాశి వారు జన్మత నాయకులు వీరు పోలీసు యుద్ధ శాఖలలో బాగా రాణిస్తారు. యంత్రములు ఫ్యాక్టరీలు నడుపుట పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము. ఖనిజములు వస్తు సామాగ్రి శాస్త్ర చికిత్స పరికరములు మొదలగు వ్యాపారములు వీరికి లాభదాయకం అవుతాయి. ఈ రాశివారు రాజకీయాల నందు సమర్థులైన వ్యవహరించగలరు. వీరికున్న  ప్రజ్ఞ పాటవం వలన పిరికి శత్రువులను ఏర్పడును. దీని వలన వీరికి ప్రాణహాని కూడా కలుగును. ఈ రాశి వారు క్రీడల నందు కూడా రాణిస్తారు. వీరికి చక్కని దర్శనజ్ఞాన వుండును‌ 

మేష రాశి వారు తమ వివాహ జీవితంలో నా క్రమశిక్షణతో మెలగవలెను. క్రమశిక్షణ వివేకము చాలా అవసరము. అయితే ఆవేశము న తీసుకున్న నిర్ణయం వలన జీవితాంతము బాధపడతారు. మేష రాశి వారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే చాలా మంచిది.

మేష రాశి వారు కార్య వాదులు ఆలోచించుట అనేది వీళ్ళకి పడదు మనసులో తట్టిన ఆలోచన అయినా కార్య రూపమున పెట్టనిదే వీరికి నిద్రపట్టదు. వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరి క్రింద పని చేయువారు వీరి అంటే భయము తో పని చేస్తారు కానీ మీరంటే అభిమానం ఉండదు. కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వ్యవహరిస్తారు కాబట్టి వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని పట్టించుకోదు.

ఈ మేష రాశి వారికి నీచ గ్రహ వీక్షణం ఉన్నప్పుడు, మొరటుగా ప్రవర్తించ స్తారు. దుర్బుద్ధి ఎక్కువగా ఉంటుంది. ఏ విషయము నందు అయినను ముక్కుసూటిగా ప్రవర్తించడం వల్ల తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అని వ్యవహరించటం వల్ల ఈ రాశివారు చాలా ఇబ్బందులు పడతారు. వీరి లో ఉన్నటువంటి ఆందోళన అసహనం ఆవేశము అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటారు. వీరికి వయసు దాటిన తర్వాత రక్తపోటు, రక్తనళములు చిట్లుట మెదడుకు సంబంధించిన పక్షవాతము లు రోగములు రావచ్చును. అందువలన శాస్త్ర చికిత్స చేయించుకోవాల్సి వచ్చును.

మేష రాశి వారు తమ జీవితంలో సహనము, ఓర్పు, వినయము లౌకిక జ్ఞానం, అలవరచుకున్న అపజయం అనేది వీరి చెంత చేరదు. మేష రాశి వారికి ఈ మొండితనం ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించటంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు. ఆ పని అయ్యేదాకా నిద్రపట్టని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేదాకా వీరికి నిద్ర ఉండదు మనశ్శాంతి ఉండదు. వీరు సుఖంగా ఉండరు ఎదుటివారిని సుఖంగా ఉండనివ్వరు.

మేషరాశి వారికి తొందరగా కోపం వస్తుంది. అలాగే తొందరపాటుతనం, ఆవేశము, ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు ఆవేశం వలన నష్ట పోతుంటారు. తమ తొందరపాటుతనం తో తమకు కావలసిన వారిని దూరం చేసుకుంటారు కొన్ని తప్పులు చేస్తారు. అలాగే కొన్ని వ్యవహారాలలో చిక్కుకు పోతారు.

అలాగేఅనవసరపు ఖర్చులు చేస్తారు. తక్కువ ఖరీదు చేసే వస్తువులు కూడా ఎక్కువ ఖరీదు పెట్టి కొంటారు. అలాగే అక్కరకు రాని భూములను తక్కువగా వస్తుంది కదా అని కొంటారు. అయితే వీరి ఆలోచనలు వీరి ప్రణాళికలు గొప్ప ఆర్థిక పరిస్థితులను కలిగిస్తాయి. అయితే ఏ విషయంలోనూ తొందరపాటు తగదు వీళ్ళకీ.

మేష రాశి వారు నమ్మిన వారు మోసం చేయడం వల్ల వీరి యొక్క ఆస్తులు పోగొట్టుకుంటారు. వీరి జాతకంలో నమ్మకద్రోహులుకు షూరిటీ పెట్టటం వల్ల కలుగు ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. కావున జాగ్రత్త వహించేది.

మేష రాశి వారు తొందరగా పదవులు పొందుతారు తొందరగా ఉద్యోగాలను సంపాదించుకో గలరు. తొందరగా పరీక్షలు ఉత్తీర్ణులు అవుతారు. అలాగే ఈ రాశి వారికి చంచల మనస్తత్వం కూడా ఉంటుంది. నిమిష నిమిషానికి వీరి ఆలోచనలను మార్చుకుంటారు.

వీరికి ఎదుటివారిలో ఏదైనా విషయం నచ్చకపోతే వారిని వెంటనే వదిలివస్తారు. తొందరగా ప్రేమకు లొంగిపోతారు. త్యాగం కూడా చేస్తారు. అలాగే ప్రేమ, కరుణ, దయ, జాలి ఇవి ఎక్కువగా ఉంటాయి. వీరు ఎప్పుడూ ఎలక్ట్రానిక్ వస్తువుల తో అనగా కంప్యూటర్, సెల్ ఫోన్ ఇలాంటి వాటితో కాలం గడుపుతారు.వీరికి రాగి కి సంబంధించిన వస్తువులు అనగా ఎలక్ట్రికల్ వస్తువులు బాగా కలిసి వస్తాయి.

మేషరాశివారు తాము ప్రేమించిన వారి చేయి వదలరు. పెళ్లి పీటల దాకా వెళతారు. కళ్యాణం చేసుకుంటారు. ఇష్ట పడిన వారి కోసం పోరాడి వివాహం చేసుకుంటారు. వివాహం తర్వాత ఈ రాశి వారి జీవితం చాలా సుఖవంతంగా ఆనందంగా సాగుతుంది.

మేష రాశి వారు వారి రాశి ననుసరించి త్రిముఖి రుద్రాక్షను ధరించాలి. మేషరాశి అశ్విని నక్షత్రం లో జన్మించిన వారు నవముఖి రుద్రాక్షను ధరించాలి. భరణి నక్షత్రంలో జన్మించిన వారు షణ్ముఖి రుద్రాక్షను ధరించాలి. కృత్తికా నక్షత్రం లో జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి ధరిస్తే మంచిది.

అశ్వినీనక్షత్రం వారు వైఢూర్యాన్ని ధరించండి. భరణి నక్షత్రం వారు జాతక పరిశీలన చేసుకుని వజ్రాన్ని ధరించాలి. కృత్తికా నక్షత్రం వారు కెంపును ధరించాలి. ఇలా ధరించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు.

 

Please share it

2 thoughts on “Mesha Rasi / aries in telugu – Character – hidden secrets”

  1. Hello namaskaram.
    Marraige details i need. When i marry… I like spirituality im some what fear with right partner.

    Reply

Leave a Comment