మీ రాశిఫలాలు లను ఖచ్చితంగా తెలుసుకోవాలంటే, ఖచ్చితంగా మీకు మీ రాశి ఏదో మీకు తెలిసి ఉండాలి. అలాంటప్పుడే మీరు ఖచ్చితమైనటువంటి ఫలితాలను తెలుసుకోగలరు. ఈ క్రింద ఇచ్చిన లింక్ మీరు క్లిక్ చేసి, మీరు మీ పుట్టిన సంవత్సరం, నెల, రోజు మరియు ఎక్కడ జన్మించారు ఆ ప్రదేశం, మీ పేరు మీ ఫోన్ నెంబర్ మీ ఈమెయిల్ ఇవ్వండి. మీ యొక్క ఖచ్చితమైన ఎటువంటి రాశి, మీ యొక్క లగ్నం, మీరు ధరించవలసిన రుద్రాక్ష , మరియు రత్నం ఇలాంటి విషయాలు మీకు ఈమెయిల్ ద్వారా పంపుతాను. ఈ లింక్ ని క్లిక్ చేయం

Taurus in telugu / Vrushabha Raasi – Character – Hidden Secrets

Join Telegram Channel
Please share it
4.5/5 - (2 votes)

Taurus in telugu / వృషభ రాశి  

కృత్తిక 2, 3, 4 పాదాలు                                                                                     

రోహిణి 1 ,2 ,3 ,4 పాదాలు

మృగశిర 1, 2 పాదాలు లో జన్మించినవారు వృషభ రాశికి చెందినవారు.

Taurus in telugu

వృషభము ఈ రాశికి చిహ్నము గా శాస్త్రములందు చెప్పబడియున్నది. Taurus వృషభం అనగా ఎద్దు.ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి, రాశి చక్రములో రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు.

స్థిరత్వము గా ఉండుట ఆనందముగా ఉండుట వాత్సల్యము కలిగిఉడుట ధృఢత్వం కలిగి ఉండుట అచంచల విశ్వాసం కలిగి ఉండుట ఈ రాశికి మూల సూత్రములు. వృషభ రాశి వారు దయ దానగుణము క్షమాగుణము కలవారు. ఎవరైనను గాని వీరిని విశ్వసించిన మంచి ఫలితాలు పొందుతారు వీరి మీద విశ్వసించి ఆధారపడవచ్చు. వీరు తమకు నచ్చిన వారు అపరాధము చేసినప్పటికీ క్షమించే గుణం కలవారు.ఈ రాశి వారి యొక్క అభిప్రాయములు మార్చుటకు ఎవరికీ సాధ్యం కాదు.

వృషభ రాశి వారు ఆనందంగా జీవిస్తారు. వీరికి అందమైన కళాత్మకమైన ఎటువంటి వస్తువులు సేకరించుట అనే అభిరుచి కలిగి ఉంటారు అందువలన ఎంతో ధనవయం చేస్తారు‌ మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైన ఎటువంటి ఆహారం తీసుకోవాలని అని అనుకుంటూ ఉంటారు. ఏ పని అందమైన అలసట ఎరుక ఓపికతో కష్టపడి పనిచేయు మనస్తత్వం కలవారు.

సాధారణంగా వీరు సహనము ఎప్పటికీ కోల్పోరు. అయితే ఈ రాశి వరికి కోపము ఎంత త్వరగా వచ్చును, వచ్చిన కోపము తగ్గుట చాలా కష్టం. ఈ రాశి వారు దృఢమైన ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు . దానివలన మొండి పట్టుదల గా మారుతుంది దీని వలన నష్టం చేకూరుతుంది కాబట్టి మొండి పట్టుదలను విడవాలి. ఈ రాశివారు ప్రేమకు లొంగిపోతారు వీరు ప్రేమ లో చిక్కుకున్న చో ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు. ఎంతటి కార్యములను సులభంగా చేస్తారు అయితే పొగడ్తలకు లొంగరు వీరు. వృషభ రాశి వారు తమకు అప్పజెప్పిన పని సవ్యంగా చేయుటే గాక, ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించు నేర్పరితనం కలవారు.

ఇక ధన సంపాదన విషయంలో వీరు అదృష్టవంతులు అని చెప్పవచ్చు. అయితే వీరికి విలాసము ల కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేయు బుద్ధి కలదు. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారం లో గాని, స్పెక్యులేషన్ లో గాని, నష్టపోవు అవకాశము కలదు.

ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాలలో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట, నాణాలను సేకరించుట వీరికి చాలా ఆసక్తి ఉండును. వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాలు వ్యాపారాల యందు బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉండును మిగిలిన రాశులకు అన్న చిక్కటి ఆరోగ్యం ఉంటుంది.

ఏదైనా నా కార్యక్రమము నందు నిమగ్నమై ఉన్నప్పుడు ఆహారం, నిద్ర యందు శ్రద్ధ చూపక పోవుట వలన వీరి ఆరోగ్యము క్రమముగా క్షీణించే అవకాశం కలదు. ఈ వృషభ రాశి వారికి ఊపిరితిత్తులు శ్వాస సంబంధ వ్యాధులు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశం కలదు.

ఈ రాశికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6, అదృష్ట వారం శుక్రవారం. ఈ రాశి వారికి మధ్య వయసు ఉంటే జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు అనుకున్న టువంటి జీవితాన్ని మీరు చూస్తారు. అత్యున్నత స్థాయికి, మంచి పదవులు, పొందే అవకాశం ఉంటుంది. మంచి ధనసంపాదన, స్వగృహ నిర్మించుకోవడం, జరుగుతుంది. ఈ రాశి వారు చాలావరకూ ఇతరుల మాటలను లక్ష్య పెట్టరు. శ్రమ పటానికి వయసులో వీరు శ్రమ పడని కారణంగా, చాలా ఇబ్బందులు వీరు ఎదుర్కొంటారు. అందరి మాటలు శ్రద్ధగా వింటారు గాని తాను అనుకున్నదే చేస్తారు. తాత ముత్తాతలు ప్రతిష్ఠకల వారుగా ఉంటారు. వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది. వీళ్ళకి వీలు నామాలు లాభిస్తాయి.

వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు.వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుంచి, వీరి భార్య వైపు నుంచి, చాలా మంచి సపోర్ట్ లభిస్తుంది. వృషభ రాశి లో జన్మించిన పురుషులు ధృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. వీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో ముందుంటారు. అనుకున్నది సాధించేవరకు నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు. వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి, ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు. వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు. అంతే కాదు సుమా ఇంతటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు.

వృషభ రాశి లో జన్మించిన స్త్రీలు రూపవతులు అని చెప్పవచ్చు వృషభ రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూడనిదే వదిలిపెట్టరు.తమ భర్త జీవిత భాగస్వామి నుంచి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. అంతే విధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు. ఈ  రాశి స్త్రీల లో మొండితనం ఉంటుంది స్థిరమైన భావాలు ఉంటాయి. వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుంది.

వృషభరాశి వారికి అధిపతి శుక్రుడు కావున జీవితం చాలా బాగుంటుంది. వృషభ రాశి వారు లక్ష్మీ అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం కలిగి దారిద్ర దుఃఖ తొలగిపోతుంది. అంతే కాకుండా శ్రీ లలితా సహస్రనామం చదవటం చాలా మంచిది.

వృషభరాశి కృత్తిక నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి. ఉంగరపు వేలుకు బంగారంలో ధరించాలి. ఒక ఆదివారం శివాలయంలో అభిషేకం చేయించి ధరిస్తే చాలా మంచిది అలాగే గోధుమలు దానం ఇవ్వాలి.

రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ముత్యం ధరించాలి. ఉంగరపు వేలుకు వెండిలో ఒక సోమవారం శుభ సమయంలో దుర్గాదేవి ఆలయంలో కుంకుమార్చన చేయించి ధరించాలి అలాగే బియ్యం దానం ఇవ్వాలి.

మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు పగడం ధరిస్తే శుభ ఫలితాలు పొందుతారు. ఉంగరపు వేలుకు వెండిలో ధరించాలి. మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తర శతనామావళి చేసి, ధరిస్తే చాలా మంచిది అంతేకాదు కందులు దానం ఇవ్వాలి.

వృషభ రాశి కృత్తికా నక్షత్రం లో జన్మించిన వారు, ఏకముఖి లేదా ద్వాదశ ముఖి రుద్రాక్షను ధరించాలి. రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి. మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి.

 

 

Please share it

Leave a Comment