Mithuna Rasi / gemini zodiac sign in telugu – Hidden Secrets

YouTube Subscribe
Please share it
4.8/5 - (5 votes)

Mithuna Rasi – మిధున రాశి

మృగశిర 3 4 పాదములు,

ఆరుద్ర 1 2 3 4 పాదములు

పునర్వసు 1 2 3 పాదాలు, ఎవరైతే జన్మించి ఉంటారో వాళ్ళు మిధున రాశికి చెందుతారు.

Mithuna Rasi

దంపతులు ఈ రాశికి చిహ్నము గా శాస్త్రములందు చెప్పబడియున్నది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయు తత్వ రాశి. సన్నని పాదాలు నిశిత మైనటువంటి దృష్టి కలిగి ఉంటారు. వీళ్ళు కుశాగ్రబుద్ధి కలిగి ఉంటారు. ఇతరులు అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు. కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు.

ఈ మిధున రాశి  వారు చక్కని శారీరక నిర్మాణం కలిగి ఉండి వయస్సు కనిపించనీయని యువ కళ వీరిలో ఉండును. వార్ధక్యము వచ్చువరకు వీరు చిన్నవారి వలే కనిపించరు. వీరు పొడవుగా, నిటారైన దేహం, ఆజానుబాహు తత్వం,

మిధున రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి.ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూ నే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు.ఎవరినీ నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. ఇలా అందరికీ తలలో నాలుకలా వ్యవహరిస్తారు. వీరికి కళలపై ఆసక్తి ఉంటుంది అల్పసంతోషి అని వీరిని చెప్పవచ్చు. చిన్న విషయానికే సంతోషిస్తారు తమ మాటలతో ఇతరులను సంతోష పరుస్తారు.చక్కని వాగ్ధాటి ఉంటుంది అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా ఉంటుంది. చంచల స్వభావం ఉంటుంది కానీ ప్రతి పనిలో విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది.ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులను బేరీజు వేసుకుని కానీ ప్రారంభించరువీరికున్న చంచల స్వభావం వలన మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలివేస్తారు.

మిధున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు.అదే విధంగా వీరు హాస్య ప్రియులు తమ అనుకున్నదాన్ని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నిస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమ శైలిలో పరిష్కరిస్తారు.వీళ్ళ యొక్క భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు rachi స్తుంటార. ఏ విషయాన్ని ఐనా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్లలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉన్నారు. మిధున రాశి వారు, వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడుతారు. ప్రతిఘటించే తత్వం అధికంగా ఉంటుంది వీళ్లలో. తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు.తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికే సొంతం. వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి తమ జీవితంలో ఉపయోగపడుతుంది.ఎక్కువగా స్నేహితుల వలన, బంధువుల వలన ఇబ్బందులు పడతారు.ఎప్పుడు చూసినా తన గతం గురించి ఆలోచిస్తూ ఉంటారు అలా గతాన్ని ఆలోచించుకుంటే ఉన్నత స్థితికి వస్తారు

ఈ రాశివారు అనవసర విషయములు గురించి ఎక్కువగా ఆలోచించుట వలన మానసిక వ్యధ నిద్రపట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగును. ఈ రాశివారు ఇతరులను నమ్మి ఏ పని అప్పగించారు , అందువలన మీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు.

తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్ట నీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి కుట్టు తెలియకుండా దాచి వారి గుట్టు సులభముగా గ్రహించసద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గం శిక్షణ ఇస్తారు కానీ వీరు మాత్రం చిరకాలం ఎవ్వరినీ నమ్మరు.

ఇక వ్యాపారానికి విషయానికి వస్తే వృత్తి మార్పిడి వ్యాపారములు వీరు మంచి లాభాలు గడిస్తారు. రెండు పక్షముల నడుచు వ్యవహారములను చక్కదిద్దుటకు తన చాతుర్యముతో సరిదిద్దుతారు. న్యాయవాద వృత్తి వార్తా ప్రసార తంతి తపాలా శాఖలు ముద్రణాలయం లో టైపు షార్ట్ హ్యాండ్ సంబంధించిన వృత్తులు యందు బాగా రాణిస్తారు. గ్రంథ రచన చేయుట అనువాదము చేయుట పత్రికలలో రచనలు చేయుట యందు వీరు నేర్పరులు. సెక్రెటరీ రాయభారము దౌత్యం వృత్తులలో వీరు బాగా రాణిస్తారు.

ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసినటువంటి తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు. అందువలన వీరికి ధనము గురించి చింత, భవిష్యత్తు గురించి చింత ఉంటుంది.

మిధున రాశి వారికి స్త్రీ పురుష సంబంధం వ్యామోహము వీరికి తక్కువ. ప్రేమ ఒక్కరితోనూ వివాహము మరియొక తోనూ వీరి జీవితంలో జరగవచ్చును. అయినప్పటికీ వీరి విషయములో ఎవరికీ తెలియకుండా వ్యవహరిస్తారు. అయితే వీరికి వివాహము తో పాటుగా ఐశ్వర్యము కూడా కలుగుతుంది. వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడు విమర్శిస్తూ ఉంటారు. వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతులు లభించాలంటే జీవిత భాగస్వామి ని నమ్మి హృదయమును సమర్పించుట జరగ వలెను.

ఎదుటివారిని బట్టి స్వభావమును మార్చు కొనుట వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఇతరులను అర్థం చేసుకొనుట లో మంచి చెడ్డలను విమర్శించుట లో వీరికి వీరే సాటి. మిధున రాశి వారు కాలమును ధనమును వ్యక్తుల సామర్ధ్యములను అర్థవంతంగా వినియోగించగలరు. పథకములు రచించుట ప్రణాళికలు ఏర్పరచుట యందు చక్కటి నైపుణ్యం ఉండును. వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయటం కన్నా సంస్థలకు సహాయం చేయట వీరికి విశ్వాసం ఎక్కువ.

ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళా నైపుణ్యము ఉంటుంది. సంగీతము నందు మంచి నైపుణ్యం ఉంటుంది. వీణ లాంటి తంత్రి వాయిద్యములు లో మంచి నైపుణ్యం ఉంటుంది. అలాగే శిల్పా చిత్రలేఖనము కుట్టుపని అల్లికపని గృహోపకరణాల అలంకరణ ములు యందు చక్కటి ప్రావీణ్యం ఉంటుంది. అలాగే పూల మొక్కలు కూరగాయలు పెంచుట లో ప్రత్యేక కౌశలం కూడా ఉంటుంది. 

మిధున రాశి వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి. మిధున రాశి మృగశిర నక్షత్రంలో జన్మించినవారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి. ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు అష్ట ముఖి రుద్రాక్షను ధరించాలి. పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్షను ఇలా ధరించుట వలన శుభఫలితాలను పొందుతారు.

మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు పగడాన్ని ధరించాలి. ఈ పగడమును వెండి లో ఉంగరపు వేలుకు ధరించాలి. ఒక మంగళవారంనాడు సుబ్రహ్మణ్యస్వామికి అష్టోత్తర శతనామావళి పూజ చేసి పగడమును ధరించండి కందులు దానం ఇవ్వాలి.

ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు గోమేధికమును ధరించాలి. ఈ గోమేధికమును మధ్యవలుకు బంగారములో ధరించాలి. మంగళవారం నాడు దుర్గాదేవికి కుంకుమ పూజ చేసి మినుములు దానం ఇవ్వాలి.

పునర్వసు నక్షత్రం లో జన్మించిన వారు కనకపుష్యరాగం ధరించాలి. చూపుడు వేలుకు బంగారములో ధరించాలి. గురువారం నాడు శివాలయంలో అభిషేకం చేసిన తరువాత  శెనగలు దానం ఇవ్వాలి. ఇలా చెయ్యటం వలన శుభ పలితాలు కలుగుతాయి. మిధున రాశి వారికి శుభం కలుగుగాక.

 

 

Please share it

Leave a Comment