Navagraha Stotram Telugu / నవగ్రహ స్తోత్రం

YouTube Subscribe
Please share it
4.5/5 - (2 votes)

Navagraha Stotram Telugu / నవగ్రహ స్తోత్రం

నవగ్రహ స్తోత్రం ఎవరైతే రోజు చదువుతారో వారు నవగ్రహ బాధ నుండి విముక్తి పొందుతారు.

నవగ్రహ పీడాహర స్తోత్రం 

Navagraha Stotram Telugu

శ్లో||          ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ   

                  గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ||

రవి       :   జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్ 

                  కమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకమ్ ||

నవగ్రహాలలో సూర్యుడు మొదటివాడు. ఈయన ఎరుపు రంగులో ఉంటాడు. ఈయనకు ఆదివారం చాలా ముఖ్యము. సూర్యుడు నాలుగు చేతులు కలిగి ఉంటాడు అందులో రెండు చేతులలో శంఖచక్రాలు, ఒక చేతిలో పద్మము, మరొక చేతిలో అభయముద్ర ఉంటాయి. ఇతని రథానికి చక్రం ఒకటే ఉంటే, గుర్రాలు ఏడు ఉంటాయి. సృష్టిని కావించే టప్పుడు వచ్చే, ఓం శబ్దమునుండి సూర్యుడు ఉద్భవించాడని, మార్కండేయ పురాణం చెబుతోంది. ఇతని యొక్క తల్లిదండ్రులు అదితి, కశ్యపుుడు. ఇతనికి ఇద్దరు భార్యలు కలరు ఒకరు ఉష, మరొకరు ఛాయ. సూర్యుడిని ప్రభాకరుడు, భాస్కరుడు అనే పేర్లు కలవు. ఈ సూర్య గ్రహ దోషం ఉన్నవారు కెంపును ధరించాలి. ప్రతిి దినము సూర్యనమస్కారాలు చేయాలి. శివుడిని పూజించి ఎర్రని గోవును దానం ఇవ్వాలి. అదేవిధంగా సూర్యయదేవాలయం లో పది దీపాలు వెలిగించాలి. సుద్దానం నివేదించాలి.ఇలా చేసినట్లలైతే గ్రహ దోషం తొలగి పోయి కీర్తి అధికారం సంపూర్ణ ఆయురారోగ్యాలు కలుగుతాయి.

చంద్ర    :   దశి శంఖ తుషారాభం క్షీరోదార్ణవ సంభవం

                   నమామి శశినం సోమం శంభోర్మకుట భూషణం ||

నవగ్రహాలలో చంద్రుడు రెండవవాడు. ఈయన తెలుపు రంగులో ఉంటాడు. సోమవారం ఈయనకు చాలా ప్రశస్తి. చంద్రుడు నాలుగు చేతులు కలిగి ఉంటాడు. రెండు చేతులలో గద పద్మము ఉంటాయి. రెండు చేతులు అభయ వరద ముద్రలలో ఉంటాయి. ఇతడు పిల్లని 10 అశ్వాల తో నున్న రధాన్ని కలిగి ఉంటాడు. ఈయన శిరస్సున స్వర్ణ కిరీటం, మెడలో ముత్యాల మాలను ధరించి ఉంటాడు. చంద్రుడు పాల సముద్రాన్ని చిలికినప్పుడు అమృతం కంటే ముందు వచ్చాడని, పురాణాల వాక్కు. విష్ణుమూర్తి హృదయం నుంచి వచ్చాడు అని వేదాలు చెబుతున్నాయి. శివుడి ఎడమకన్ను శిరస్సున ఆభరణం గా విరాజిల్లుతూ ఉంటాడు ఈయన. ఇతని తల్లిదండ్రులు అత్రి అనసూయలు. ఇతని భార్య రోహిణి దేవి. ఇతనికి చంద్ర మనస్కుడు, శశి, సోమ, అని పేర్లు ఉన్నాయి ఈ చంద్రగ్రహ దోషం ఉన్న వారు తెల్లని ముత్యాన్ని ధరించాల. శక్తి దేవతకు తెల్లని పువ్వులతో అర్చన చేయాలి. బీదవారికి తెల్లటి వస్త్రాలు, బియ్యాన్ని దానం ఇవ్వాలి. ఈ యొక్క దేవాలయంలో ఐదు లేదా తొమ్మిది వత్తుల దీపాన్ని వెలిగించాలి. అక్కడ పాయసం నివేదించాలి. ఇలా చేసినట్లయితే గ్రహ దోషాలు తొలగి పంటలు బాగా పండి ఆరోగ్యం కీర్తి యశస్సు కలుగుతాయి. 

కుజ    :     ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమ ప్రభమ్

                   కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం ||

అంగారకుడు నవగ్రహాలలో మూడవ వాడు. మనము ఈయనని కుజుడు అని పిలుస్తాం. ఈయన అంగారకుడు ఎరుపు రంగులో ఉంటాడు. ఈయనకు మంగళవారం అంటే చాలా ఇష్టం. ఈయన నాలుగు చేతులు కలిగి ఉంటాడు. ఇందులో గదా,శక్తి, శూలము అభయముద్ర ఉంటాయి. ఈయన వాహనము పొట్టేలు. తపస్సు ద్వారా ఈయన ఈ ఉన్నతస్థానాన్ని సాధించాడు. మహేశ్వరుడు మూడవ కన్ను నుండి వీరభద్రుడు గా పుట్టి, దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేస్తుండగా, దేవతలు వణికిపోవడం చూసి తన రూపాన్ని అంగారకుడు గా మార్చుకున్నారని మత్స్యపురాణం చెబుతోంది. ఈయన భార్య శక్తి దేవి. ఇతనికి భూమిపుత్రుడు, కుజుడు, భౌముడు అనే పేర్లు కలవు. ఈ అంగారక దోషములు ఉన్నవారు పగడాన్ని ధరిస్తే, చాలా మంచిది. ఒక మంగళవారం నాడు ఉపవాసం ఉండి ఎర్రటి వస్త్రం, ఎర్రటి పువ్వులతో సుబ్రహ్మణ్యస్వామిని పూజించాలి. అంతేకాదు కందులు దానం చెయ్యాలి. ఇలా చేయటం వల్ల సకల శుభ ఫలితాలు పొందుతారు.గ్రహ దోషాలు తొలగి ఏదైనా ఆస్తి తగాదాలు ఉంటే తొలగిపోతాయి. భూమి ఇల్లు వంటివి సమకూరి అన్ని శుభాలే కలుగుతాయి.

బుధ    :     ప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధం

                   సౌమ్యం సత్వ గుణం పేట తం బుధం ప్రణమామ్యహం || 

నవగ్రహాలలో నాలుగవ వాడు బుధుడు. ఈ బుధుడు పచ్చని రంగులో ఉంటాడు. బుధవారము ఈయనకు చాలా ప్రశస్తి. ఈయన నాలుగు చేతులు కలిగి ఉంటాడు. అందులో కత్తి డాలు ఉండి, మరి రెండు చేతులు అభయ వరద ముద్రలలో ఉంటాయి. ధనస్సు ఆకారపు ఆసనాన్ని కలిగి ఉంటాడు. నాలుగు అశ్వాల తో ఉన్న రథాన్ని కలిగివుంటాడు. జెండా పై సింహం గుర్తు ఉంటుంది. శ్రీ మహావిష్ణువును పోలి ఉంటాడు. ఘోర తపస్సు చేసిన తర్వాత శుభ్రంగా వరాన్ని పొందాడు. ఇతని తల్లిదండ్రులు చంద్రుడు, తార. ఇతని భార్య పేరు ఈల. ఇతనికి బుద్ధి దాత, దాన ప్రదుడు, మనోహరుడు అని పేర్లు కలవు. ఈ బుధగ్రహ దోషం ఉన్నవారు మరకతం అనగా పచ్చను ధరించాలి. ఉపవాసం ఉండి శ్రీ మహా విష్ణువును పూజించాలి. విష్ణుసహస్రనామ పారాయణ చేస్తే చాలా అంతేకాదు బంగారము పచ్చని పెసలు దానం చేయాలి. ఈయన దేవాలయంలో 17 దీపాలు వెలిగించాలి. లేదా నవగ్రహాలు ఉన్నచోట పదిహేడు దీపాలు వెలిగించాలి. అలాగే త్వరగా అన్నం నివేదించాలి. ఇలా చేసినట్లయితే బుధగ్రహ దోషం తొలగి కష్టాలన్నీ తీరి, అన్ని పనులు నందు శుభప్రదం జయప్రదం కాగలదు. ఉన్నత స్థితికి వస్తారు.

గురు     :   దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం

                   బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం ||

నవగ్రహాలలో ఐదవ వాడు గురువు. బంగారు రంగులో ఉంటాడు. గురువారం ఈయనకు ప్రశస్తి. ఇతడు నాలుగు చేతులు కలిగి ఉంటాడు. అందులో కమండలం, రుద్రాక్ష జపమాల, దండము ఉంటాయి. ఒక చెయ్యి వరద ముద్రతో ఉంటుంది. ఇతని వాహనం ఏనుగు. ఇతని తల్లిదండ్రులు అంగిరసుడు, వసుధ. ఈయన భార్య పేరు తార. ఇతనికి మంతీ బృహస్పతి అని పేర్లు కలవు.ఈ గురు గ్రహ దోషం ఉన్నవారు కనక పుష్యరాగాన్ని ధరించాలి. ఒక గురువారం నాడు ఉపవాసం ఉండి గురువు పూజించి బంగారము, పసుపు గుడ్డ శనగలు, దానం చేయాలి.ఈయన దేవాలయంలో 24 దీపాలు అలా కుదరని పక్షంలో నవగ్రహాల ఎదుట 24 దీపాలు వెలిగించాలి. పరమాన్నం నివేదించాలి. ఇలా చేసినట్లయితే గురు దోషం తొలగి ఐశ్వర్య ప్రాప్తి, మనశ్శాంతి కలుగుతాయి.

శుక్ర      :    హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం

                    సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం ||

నవగ్రహాలను ఆరవ వాడు శుక్రుడు. ఈ శుక్రుడు వెండి వలె తెల్లని రంగులో ఉంటాడు.ఇతడికి శుక్రవారం చాలా ప్రశస్తి ఇతడు నాలుగు చేతులు కలిగి ఉంటాడు. అందులో దండం, రుద్రాక్షమాల, కమండలం, ఉండి ఒక చెయ్యి వరముద్ర తో ఉంటుంది. 10 అశ్వాల తో ఉన్న రథాన్ని ఈయన కలిగి ఉంటాడు. శుక్రాచార్యుడు అని ఈయనను పిలుస్తారు. తెల్లని పంచముఖ కోణం శుక్రుడి యొక్క చిహ్నం. ఇతని తల్లిదండ్రులు గృహ మహర్షి, పురో మిజుడు. ఈ శుక్ర గ్రహ దోషం ఉన్నవారు వజ్రాన్ని ధరించాలి.వజ్రాన్ని గురించే టప్పుడు ఒక జ్యోతిష్కుడిని సంప్రదించి మీ జాతకం ప్రకారం కుండలి పరిశీలించి వజ్రం ధరిస్తే మంచిది.గజలక్ష్మి మరియు రాజరాజేశ్వరి అమ్మవారికి పూజలు చేయించాలి. అంతేకాదు దేవి మహత్యం పారాయణ చేయాలి. బీదలకు తెల్లటి వస్త్రాలు, అలసందలు, అనగా బొబ్బర్లు దానం ఇవ్వాలి. ఈ యొక్క దేవాలయంలో తొమ్మిది దీపాలను వెలిగించాలి. లేదా మీ ఊర్లో నవగ్రహాలు ఉన్న దేవాలయంలో 9 దీపాలు వెలిగించాలి తరువాత పసుపు అన్నాన్ని నివేదించాలి. ఇలా చేసినట్లయితే శుక్ర గ్రహ దోషం తొలగి అత్యుత్తమ కీర్తి, ఆయురారోగ్యాలు కలుగుతాయి.

శని       :    నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం

                  ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం ||

నవగ్రహాలలో శని ఏడవ వాడు.  ఈ శని నల్లని రంగులో సన్నగా ఉంటాడు. శనివారం ఈయనకు చాలా ప్రశస్తి నల్లని దుస్తులను ఈయన ధరిస్తాడు. ఈ యొక్క కాలు కొంచెం వక్రం గా ఉంటుంది. ఇతడు నాలుగు చేతులను కలిగి ఉంటాడు. అందులో ధనస్సు బాణం ఉంటాయి. రెండు చేతులతో నమస్కార భంగిమలో ఉంటాడు. అతని వాహనం బంగారు కాకి. ఇతని తల్లిదండ్రులు సూర్యుడు, ఛాయ. ఇతని భార్య జ్యేష్టాదేవి. శని గ్రహ దోషం ఉన్నవారు ఇంద్రనీలం ధరించాలి. నల్ల నువ్వులను నల్ల గుడ్డ దానమివ్వాలి. నువ్వులను నల్ల గుడ్డలో చుట్టి నువ్వుల నూనెలో ముంచి ఆ  గుడ్డని వత్తిగా చేసి స్వామి సన్నిధిలో వెలిగించాలి. ఇలా చేసినట్లయితే శని గ్రహ దోషం తొలగి శాంతి చేకూరుతుంది. ఈ శని అంటే శక్తి అని శనేశ్వర అంటే శివశక్తి అని అర్థం. అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని, జరుగుతున్న వాళ్ళు శనీశ్వర మంత్రాన్ని నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయటం వల్ల వారికున్న గ్రహ దోషాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

రాహు    :   అర్థకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం

                  సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం ||

నవగ్రహాలలో 8వ గ్రహం రాహువు ఈయనకు ఆదివారం ప్రశస్తి. ఈ రాహువు తల సింహం తల మాదిరిగా ఉంటుంది. శరీరమంతా నల్లని పాము వలె ఉంటుంది. ఇతనికి నాలుగు చేతులు ఉంటాయి. అందులో ఒక కత్తి త్రిశూలము, త్రికోణ ఆకృతి నమూనా ఉండి ఒక చేయి అభయ ముద్రతో ఉంటుంది. ఎనిమిది అశ్వాల తో ఉన్న రథాన్ని ఈయన కలిగి ఉంటాడు. ఇతని వాహనం మేక. ఇతని తల్లిదండ్రులు సింహికా విప్రసిద్ధి అనే, రాక్షసులు.రాహుగ్రహ దోషం ఉన్న వారు గోమేధికమును ధరించాలి. వెండి నాగు పము రేకులను మినుములను దానం చేయాలి. నవగ్రహ సన్నిధిలో 21 దీపాలు వెలిగించాలి మినప పప్పు అన్నం నివేదించాలి. ఇలా ఇలా చేయడం వల్ల రాహు గ్రహ దోషము తొలగి సమస్యలను పరిష్కరించుకునే జ్ఞానం కలుగుతుంది. శుభ ఫలితాలు పొందుతారు.

కేతు       :   ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహ మస్తకం

                  రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం ||

నవగ్రహాలలో తొమ్మిదవ గ్రహం కేతువు. ఈయన ఎరుపు రంగులో ఉంటాడు ఈయనకు ఆదివారం చాలా ప్రశస్తి. ఈయన రెండు చేతులను కలిగి ఉంటాడు. ఎడమ చేతిలో పక్షి కుడిచేతిలో వరద ముద్ర ఉంటాది. ఈయన ఈశ్వరుడి గురించి తపస్సు చేసి ఒక గ్రహంగా ఉండే వరాన్ని పొందాడు. ఆయన శరీరం దైవ శరీరం లా, తల ఐదు పడగల పాము లాగా ఉంటుంది. మాయ దేవతా రూపం ధరించినటువంటి రాహువు తలను మొండెం నుండి శ్రీ మహా విష్ణువు సుదర్శన చక్రంతో వేరు ఆ మొండెం కేతు గా మారింది అని అంటారు. ఇతని భార్య చిత్ర లేఖ. ఈ కేతు దోషం ఉన్నవారు వైఢూర్యాన్ని ధరించండి. మత్స్య పురాణాన్ని చదవాలి. ఉలవలు దానం ఇవ్వాలి. శివాలయం లో ఉన్న నవగ్రహాల సన్నిధి లో, ఏడు దీపాలు వెలిగించి ఆవాలు కలిపిన అన్నాన్ని నివేదించాలి. ఇలా చేయటం వల్ల కేతు గ్రహ దోషం తొలగి ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతాయి.

          

 

Please share it

4 thoughts on “Navagraha Stotram Telugu / నవగ్రహ స్తోత్రం”

Leave a Comment