మీ రాశిఫలాలు లను ఖచ్చితంగా తెలుసుకోవాలంటే, ఖచ్చితంగా మీకు మీ రాశి ఏదో మీకు తెలిసి ఉండాలి. అలాంటప్పుడే మీరు ఖచ్చితమైనటువంటి ఫలితాలను తెలుసుకోగలరు. ఈ క్రింద ఇచ్చిన లింక్ మీరు క్లిక్ చేసి, మీరు మీ పుట్టిన సంవత్సరం, నెల, రోజు మరియు ఎక్కడ జన్మించారు ఆ ప్రదేశం, మీ పేరు మీ ఫోన్ నెంబర్ మీ ఈమెయిల్ ఇవ్వండి. మీ యొక్క ఖచ్చితమైన ఎటువంటి రాశి, మీ యొక్క లగ్నం, మీరు ధరించవలసిన రుద్రాక్ష , మరియు రత్నం ఇలాంటి విషయాలు మీకు ఈమెయిల్ ద్వారా పంపుతాను. ఈ లింక్ ని క్లిక్ చేయం

3 mukhi rudraksha benefits in telugu

Join Telegram Channel
Please share it
5/5 - (4 votes)

3 mukhi rudraksha benefits in telugu

త్రిముఖి రుద్రాక్ష మూడు ముఖాలు గల రుద్రాక్ష ఇది త్రిమూర్తి స్వరూపము. దీనిని త్రేతాగ్ని ప్రతిరూపముగా కూడా వర్ణిస్తారు. సూర్య, చంద్ర, అగ్ని అను త్రినేత్రములు గల రుద్రుడే కాలాగ్ని రుద్రుడు అంటే అగ్ని స్వరూపుడు. అగ్ని అంటే మాలిన్యమును దహించేది. అగ్ని అంటే పాపాలను భస్మం చేసేది.

త్రిముఖి రుదాక్ష ను కొనాలంటే ఇక్కడ నొక్కండి –  త్రిముఖి రుద్రాక్ష

అగ్నిలో నిలిచి అగ్ని పరీక్షకు నిలిచింది కాబట్టే సీతమ్మతల్లి పవిత్రత లోకాలకు తెలిసింది. అగ్ని అంటే పవిత్రతకి ప్రతిరూపమే కాదు, అగ్ని అంటే ప్రకాశము, వెలుగు, చీకటులను పారద్రోలి వెలుగులను పంచే పవిత్ర ప్రకాశమే అగ్ని.అట్టి అగ్నులు మూడింటిని తన నేత్రాలుగా ధరించి ‘ముక్కంటి’ అయ్యాడు శివుడు. ముక్కంటి కంటి త్రేతాగ్ని ప్రతిస్వరూపమే త్రిముఖి రుద్రాక్ష. అంతేకాదు. ఇది త్రిమూర్త్యాత్మక స్వరూపము.

త్రిమూర్తులంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు.

సకల చరాచర సృష్టికి మూలకారకుడైన పరబ్రహ్మ ముక్కంటి అయిన రుద్రుడు.

ఇందు దక్షిణ సూర్య నేత్రము స్వయం ప్రకాశము కల్గిన విష్ణువు గాను, వామ చంద్ర నేత్రము ఆధారిత ప్రకాశము కల్గిన బ్రహ్మ గానూ, భృకుటి మధ్యనున్న ఫాలనేత్రము ప్రచండ జ్యోతి, కాలాగ్ని స్వరూప మహేశ్వరుడు గానూ, ఆ పరబ్రహ్మ తొలుత తననుండి త్రిమూర్తులను సృజించాడు. అట్టి త్రినేత్ర, త్రిమూర్త్యాత్మక, త్రికాలాగ్ని స్వరూపము ఈ త్రిముఖ రుద్రాక్ష.

అంటే త్రినేత్రధారి అయిన రుద్రుడు కాలాగ్ని స్వరూపుడు. కనుకనే

త్రిముఖం చైవ రుద్రాక్ష మగ్నిత్రయ స్వరూపకమ్

తధారణాచ్ఛహృత భుక్తస్యతుష్యతిప్రద నిత్యదా

త్రిముఖములుగల యీ రుద్రాక్ష త్రయాగ్ని స్వరూపకము. దీనిని ధరించినట్ల యితే సర్వభక్షకుడైన అగ్నిదేవుడు సంతసించి ధారకుల సర్వపాపాలనూ దహించివేసి వారలను ప్రతినిత్యమూ పునీతులను గావిస్తాడు. . . ” అని సాక్షాత్తూ శివుడే భుసుండ అనే మహర్షికి చెప్పాడుఅంట.

  • త్రిముఖి రుద్రాక్షను రుద్రాభిషేకము, అర్చన అనంతరం ధరించాలి.
  • దీని అధిదేవత కుజుడు. కావున కుజగ్రహ దోషమున్న వారు ధరించిన దోష నివారణమగును.
  • కుజగ్రహజపము, దానముచేసి గురువారం ఉదయం గం. 6నుండి గం, 7లోపు ధరించవలెను.
  •  నాగపంచమి, సుబ్రహ్మణ్యషష్ఠి పర్వదినాలలో దీనిని ధరించుట శ్రేష్ఠము.
  • మాలాధారణ సమయములో శివపంచాక్షరీ మహామంత్రాన్ని 108సార్లు జపించాలి.

త్రిముఖి రుద్రాక్ష రకములు, ఫలము:

ఇది కూడా నాలుగు వర్ణములలో లభిస్తుంది.

శ్వేతవర్ణ త్రిముఖి… దీర్ఘాయువు కలుగుతుంది.

రక్తవర్ణ త్రిముఖి… స్త్రీ హత్యా పాతక నివారిణి.

పీతవర్ణ త్రిముఖి… సర్వ విద్యా ప్రభావిత ప్రదాయని.

శ్యామవర్ణ త్రిముఖి సర్వరోగ, సర్వశోక నివారిణి 

Also read : ఏకముఖి రుద్రాక్ష

ద్విముఖి రుద్రాక్ష

చతుర్ముకి రుద్రాక్ష

Please share it

1 thought on “3 mukhi rudraksha benefits in telugu”

Leave a Comment