మీ రాశిఫలాలు లను ఖచ్చితంగా తెలుసుకోవాలంటే, ఖచ్చితంగా మీకు మీ రాశి ఏదో మీకు తెలిసి ఉండాలి. అలాంటప్పుడే మీరు ఖచ్చితమైనటువంటి ఫలితాలను తెలుసుకోగలరు. ఈ క్రింద ఇచ్చిన లింక్ మీరు క్లిక్ చేసి, మీరు మీ పుట్టిన సంవత్సరం, నెల, రోజు మరియు ఎక్కడ జన్మించారు ఆ ప్రదేశం, మీ పేరు మీ ఫోన్ నెంబర్ మీ ఈమెయిల్ ఇవ్వండి. మీ యొక్క ఖచ్చితమైన ఎటువంటి రాశి, మీ యొక్క లగ్నం, మీరు ధరించవలసిన రుద్రాక్ష , మరియు రత్నం ఇలాంటి విషయాలు మీకు ఈమెయిల్ ద్వారా పంపుతాను. ఈ లింక్ ని క్లిక్ చేయం

Krittika nakshatra in telugu – కృత్తిక నక్షత్రము 2022

Join Telegram Channel
Please share it
5/5 - (4 votes)

krittika nakshatra in telugu

కృత్తికా నక్షత్రము ఒకటో పాదము మేష రాశిలో ఉంటే మిగిలినటువంటి 2, 3, 4 పాదాలు వృషభ రాశిలో ఉంటాయి. అనగా కృత్తికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేష రాశికి చెందుతారు, అలాగే కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశి కి చెందుతారు.

కృత్తికా నక్షత్రము మంగలకత్తి ఆకారంలో ఎరుపు రంగులో ఉంటుంది.  ఆరు నక్షత్రాలతో కూడుకుని ఉంటుంది. దీనికి అధిపతి సూర్యుడు. అధిదేవత అగ్ని. స్త్రీలింగం, రాక్షస గణానకి మరియు బ్రాహ్మణ వర్ణానికి చెందినదిగా జ్యోతిష్య శాస్త్రములో చెప్పబడినది.ఈ కృత్తికా నక్షత్రము ఏ ముహూర్తము పెట్టటానికి కూడా పనికిరాదు.

కృత్తికా నక్షత్రానికి సంబంధించినటువంటి ఒక పురాణ గాధ ప్రాచుర్యంలో ఉంది. ఒకప్పుడు అగ్నిదేవుడు సప్తఋషుల భార్యలను చూసి మోహిస్తాడు. అగ్ని దేవుడు భార్య స్వాహాదేవి. ఈమె మహా పతివ్రత. ఈమె తన భర్త కోరిక తీర్చవలసి ఒక్కొక్క రాత్రి ఒక్కొక్క ఋషిపత్ని వేషములో తన భర్తతో క్రీడించింది. అయితే వశిష్టుని భార్య అరుంధతి రూపాన్ని మాత్రం దరించ లేకపోయింది. ఐతే ఈ విషయం తెలిసినటువంటి సప్తఋషులు అగ్ని తమ భార్యలతో రమించాడు అనే కోపం తో, తమ భార్యలను విడిచిపెట్టారు. ఆ ఆరుగురు ఋషి పత్నులు తమ తప్పు లేదని, స్వాహాదేవి తన భర్తను నమ్మించదలచి తమని అనుగ్రహించమని కోరగా, వారిలో ఏదో లోపం ఉంది కనుకనే వారి వేషాలు స్వాహాదేవి వేయగలిగినది. అందువల్ల తృజించ బడిన ఆరుగురు ఋషి పత్నులు ష్ ట్ కృత్తి కలుగా ప్రకాశిస్తున్నారు. అనేది ఈ కథ సారాంశం. వ్యాకరణము జ్యోతిష్యము తెలిసినవాళ్ళు పురోహితులు ఈ నక్షత్రంలో ఉంటారు.
కృత్తికా నక్షత్రం 1వ పాదము, 2వ పాదంలో జన్మించిన వారికి ఎలాంటి దోషాలు లేవు. 3 పాదములో జన్మించిన వారికి అబ్బాయి అయితే తండ్రికి దోషం ఉంది. ఒకవేళ అమ్మాయి పుడితే తల్లికి దోషం వస్తుంది. 4వ పాదములో పుట్టినట్లు అయితే అబ్బాయి ఐనా అమ్మాయి ఐనా తల్లికి దోషము కలదు. అందువలన మూడవ పాదములో నాలుగో పాదములో పుట్టిన పిల్లలకు చిన్నప్పుడే నక్షత్ర హోమ శాంతి చేయించాలి. బాలారిష్ట దోష శాంతి అని చేయిస్తారు. మీ ఊర్లో పంతులు ని సంప్రదిస్తే వాళ్ళు దోష పరిహారం ఎలా చేయాలో చెప్తారు అలా చేసుకోండి. ఇలా చేయడం వల్ల బాలారిష్ట దోషాలు తొలగిపోతాయి.

కృతిక నక్షత్రం వారికి ఆకలి ఎక్కువగా ఉంటుంది వీరు ఆహారం గురించి ఆలోచిస్తూ ఉంటారు.పని చేయటం కన్నా తినటం లోనే ఆనందం ఉంది అని భావిస్తూ ఉంటారు. ఎక్కువగా అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు. తమ అవసరం తీర్చుకునే దానికి ఎక్కువ అబద్ధాలు మాట్లాడుతారు. అలాగే దనాన్ని విపరీతంగా ఖర్చు పెడతారు అనవసరపు ఖర్చులు ఎక్కువగా చేస్తారు. అప్పులు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. అనవసరపు తిరుగుళ్లు అనగా పని పాట లేకుండా వృధాగా తిరుగుతూ ఉంటారు. ఊరికేనే అనవసరంగా అనవసర ప్రయాణాలు చేస్తూ ఉంటారు. తిరగటానికి బాగా ఇష్టపడతారు. ఎవరితోనైనా సహాయం చేయించుకోవడం తమ అవసరాలు వాడుకోవటం ఆ తరువాత వారిని వదిలేసిటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. అలాగే తప్పులు చేసే స్వభావం కూడా ఎక్కువగా ఉంటుంది ఎవరికి తెలియకుండా ఏ తప్పైన చేయొచ్చు అనే భావన కలిగి ఉంటారు.కృత్తికా నక్షత్రం వారు చూడటానికి చాలా సౌమ్యముగా ఉంటారు, కానీ చేసే పనులన్నీ క్షాత్రీయము అనగా వైవిధ్యము. చాతుర్యము ను కలిగి ఉంటారు. ఈ నక్షత్రం వారికి రజోగుణము, కామప్రవృత్తి అధికంగా ఉంటాయి. అనగా కోరికలు ఎక్కువగా ఉంటాయి ఇంద్రియ భోగాలు అనుభవించాలన్న కోరికలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ నక్షత్రం వారికి చిన్నతనము నుంచి చాలా కోపం ఉంటుంది. ప్రతిదానికి పేచీ పెట్టుకునే స్వభావం ఉంటుంది. తమకు కావాల్సినది వదిలి పెట్టనటువంటి మనస్తత్వం ఉంటుంది. తమకు కావాల్సిన దాని కోసం చాలా కష్ట పడతారు.
ఈ నక్షత్రం వారికి ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది కళల మీద దృష్టి ఎక్కువగా ఉంటుంది. వీరికి మంచి స్నేహితులు, ఫ్యాన్స్ చాలా ఎక్కువమంది ఉంటారు. వీరికి అందరినీ ఆకర్షించే గుణం ఉంటుంది. ఈ నక్షత్రం వారు ఏ విషయము అయినా చాకచక్యంగా విశ్లేషణాత్మకంగా వివరణాత్మకంగా చెప్తారు. అలాగే ఏ పని చేసిన ఒక ప్రణాళికతో, ఆలోచనాత్మకంగా చేస్తారు. ప్రతి దానిని ఒక పద్ధతి ప్రకారం చేస్తారు కంగారుగా చేయరు. ఏ పని చేసినా ఆలోచించి చేస్తారు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నక్షత్రం వారు అందరి లాగా ఉండరు  అందరి లాగా కనపడరు, అందరి లాగా బిహేవ్ చెయ్యరు. అనగా వీరు చాలా విలక్షణంగా ఉంటారు. వీరిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అలాగే వీరు మనసులో అన్ని కావాలి అని ఉన్న తమ మనసులోని మాట బయట పెట్టరు. ఇది కావాలి అని అడగరు. అనగా వీరిలో మొహమాటం ధోరణి అధికంగా ఉంటుంది. అలాగే ఈ నక్షత్రం వారు ఎవరిని నమ్మరు ‌ ఐతే నమ్మితే ప్రాణాలు ఇస్తారు అయితే ఎవరినీ అంత సులభంగా నమ్మరు. అందరితోనూ దొంగ నటనలో లౌక్యం తో కూడినటువంటి ప్రేమను నటిస్తారు తప్పా, మనసు పూర్తిగా లోపల నమ్మటం ఇష్టపడటం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. అందరూ తమను గుర్తించాలి అనే తపన నీళ్ళలో ఎక్కువగా ఉంటుంది. అందరూ తమని పొగడాలి అని ఎక్కువ ఆశ పడుతూ ఉంటారు.  అలాగే సామాన్యంగా ఈ నక్షత్రం లో ఉన్న వారిని మెప్పించడం చాలా కష్టం.అయితే మానసికంగా కొద్దిగా బలహీనంగా ఉంటారు ప్రతి దానికి కోపగించు కుంటూ ఉంటారు.

కృత్తికా నక్షత్రం వారికి కలిసివచ్చే వారాలు బుధవారం, శుక్రవారం అలాగే శనివారం బాగా కలిసి వస్తుంది.
ఈ నక్షత్రానికి ఎక్కువగా ఆరాధించ వలసిన అటువంటి దేవతలు, అగ్నికి సంబంధించిన ఆరాధన అలాగే శివుడిని ఎక్కువగా, సూర్యుడిని ఆరాధన చేయవచ్చు. ప్రతి సోమవారం శివాభిషేకం చేయిస్తే చాలా మంచిది. రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా మంచిది.
ఈ నక్షత్రంలో ఎవరైనా మరణిస్తే, దానివలన దోషము ఉంటుంది. ఆరు నెలల పాటు ఆ ఇంటిని వదిలి ఆ తర్వాత హోమ శాంతి చేయించుకోవాలి.
ఈ నక్షత్రం వారికి కలిసివచ్చే అదృష్ట సంఖ్యలు. 3,4,5,9

అదృష్ట వారములు : భుద, శుక్ర,శని

ఆరాధించవలసిన దేవతలు : అగ్ని,సూర్యడు,శివుడు

అలాగే కలిసి వచ్చేటటువంటి రంగు తెలుపు రంగు ఎక్కువగా కలిసి వస్తుంది.
అలాగే ఈ నక్షత్రం వారు ధరించవలసిన అటువంటి రత్నం, కెంపు ధరించిన మంచి శుభ ఫలితాలు కలుగుతాయి
దీనికి కలిసి వచ్చేటటువంటి రుద్రాక్షలు, ఏకముఖి రుద్రాక్ష (లేదా) ద్వాదశ ముఖి రుద్రాక్ష ధరించన కలిసి వస్తుంది.లేదా స్పటికమాల ధరించన మంచి ఫలితాలు కలుగుతుంది.
నక్షత్రం వారు ఔదంభర వృక్షం నాటితే చాలా మంచిది.
వీరికి కలిసి వచ్చేటువంటి దిక్కు ఉత్తర దిక్కు.

వివాహము: – 

వివాహములో అనేది ప్రధానమైన విషయము. ఇది బాగున్నపుడు మిగిలిన విషయములు అంత ప్రాధాన్యత వహించవు. కృత్తికా నక్షత్రము పురుషునికి సరిపోయే నక్షత్రాలన్ని కృత్తికా నక్షత్రము అమ్మాయికి నప్పవు. అలాగే కృత్తికా నక్షత్రం అమ్మాయికి నప్పే నక్షత్రాలన్ని కృత్తికా నక్షత్రం అబ్బాయికి నప్పవు. ఎవరికి ఏ నక్షత్రములు నప్పేది ఈ దిగువ పరిశీలించవచ్చును.

కృత్తిక నక్షత్రం పురుషుడు:- కృత్తిక నక్షత్రం అబ్బాయికి కృత్తిక నక్షత్రము అమ్మాయితో వివాహం అంత అనుకూలము కాదనే చెప్పవచ్చును.

ప్రధానంగా కలవని నక్షత్రాలు: – 

కృత్తిక 1పాదము వారికి – కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఉత్తర 2,3,4 హస్త, చిత్త 12, స్వాతి, విశాఖ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం శతభిషం, పూ.భా 4 పాదము, ఉ.భాద్ర, రేవతి.

కృత్తిక 2,3,4 పాదముల వారికి – కృత్తిక, ఆరుద్ర, పుష్యమి, స్వాతి, విశాఖ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, రేవతి.

ఈ నక్షత్రము అమ్మాయిలతో సఖ్యత ఉండని కారణంగా వీరు కాకుండా మిగిలిన వారితో నిరభ్యంతరంగా వివాహము కుదుర్చుకోవచ్చును.

ప్రధానంగా కలిసే నక్షత్రాలు: –

కృత్తిక 1పాదము వారికి: – అశ్వని, భరణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర1, అనూరాధ, జ్యేష్ఠ , పూర్వాషాఢ, ధనిష్ఠ, పూర్వాభాద్ర 1,2,3, రేవతి అనుకూలమైనవి

కృత్తిక 2,3,4 పాదముల వారికి : రోహిణి, ఉత్తర 2,3,4 ,హస్త, చిత్త, పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర అనుకూలమైనవి.
కృత్తిక నక్షత్రం స్త్రీకి :-

కృత్తికా నక్షత్రం అమ్మాయికి కృత్తిక నక్షత్రం అబ్బాయితో పాదబేధం ఉన్నపుడు వివాహము చేసుకోవచ్చునని కొందరి ఊహ)

కృత్తిక నక్షత్రములో పుట్టిన స్త్రీలకు సరిపోని నక్షత్రాలు :

చిత్త, పూర్వాభాద్ర, విశాఖ, ఆశ్రేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రములు సరిపోవు.

కృత్తిక 1 పాదము అమ్మాయిలకు : –రోహిణి, ఉత్తర 2,3,4, హస్త, ఉత్తరాషాఢ, శ్రవణా నక్షత్రములు,

కృత్తికా 2,3,4 పాదమువారికి : స్వాతి, మూల ,పూర్వాషాఢ, ఉత్తరషాఢ, శ్రవణా నక్షత్రము సరికాదు. పై నక్షత్రముల వారు కాకుండా మిగిలిన వారితో నిరభ్యంతరంగా వివాహము కుదుర్చుకోవచ్చును.

వర నక్షత్రంగా సరిపోయే మిగిలిన నక్షత్రములు.

అశ్విని, భరణి, మృగశిర, ఆరుద్ర, పుసర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర.ఉత్తర,హస్త,స్వాతి, అనూరాధ , మూల, ధనిష్ఠ, శతభిషం

Also read : పునర్వసు నక్షత్రం 

ఏకముఖి రుద్రాక్ష్ ధారణా ఫలితములు

Please share it

1 thought on “Krittika nakshatra in telugu – కృత్తిక నక్షత్రము 2022”

Leave a Comment