Aquarius in telugu / Kumbh Rashi Telugu

YouTube Subscribe
Please share it
5/5 - (1 vote)

 Aquarius in telugu – కుంభ రాశి 

ధనిష్ఠ 3,4 పాదాలు

శతభిషం 1,2,3,4 పాదాలు

పూర్వాభాద్ర 1,2,3 పాదాలు కుంభ రాశి కి చెందుతారు. రాశి చక్రంలో ఈ కుంభరాశి 11 వ ది. ఈ రాశికి అధిపతి శని. 

Aquarius in teluguఈ కుంభ రాశి ని స్థిరరాశి, వాయు తత్వ పు రాశి, శీర్షోదయ రాశి అని పిలుస్తారు. ఒక జల కుటుంబమును ధరించినటువంటి మానవుడు, ఈ రాశికి చిహ్నము గా శాస్త్రాలలో చెప్పబడినది. జల కుంభము ధరించిన మానవుడు అనగా, ఒక వ్యక్తి ఒక కుండను మోస్తూ ఉంటాడు. అలా వస్తున్నటువంటి మానవుడిని ఈ రాశికి చిహ్నము గా శాస్త్రాలలో చెప్పబడింది. 

ఈ రాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరం, గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు. చక్కటి ముఖవర్ఛస్సు ఉంటుంది. సుందరమైనవంటి స్వరూపం, ఎప్పుడూ సంతోషంగా ఉల్లాసంగా బయటివారికి కనబడతారు. వీరికి జ్ఞాపకశక్తి అధికంగా ఉంటుంది. కార్యదీక్ష ఉంటుంది దక్షత కూడా ఉంటుంది. మంచి-చెడు ఆలోచించిన తరువాతనే కార్యసాధన చేస్తారు. వీళ్ళకి అతీంద్రియ విద్య పై ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. వీరు ఏ పని చేసిన మనస్ఫూర్తిగా చేస్తారు. ఎలాంటి ఆశ లేకుండా పనులు పూర్తి చేస్తారు. తమ ఆలోచనలను ఎవ్వరికీ తెలియనివ్వరు బయటపెట్టరు. తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవ్వరికీ తెలియనివ్వరు. తాము ఎప్పుడు గుంభనంగా ఉంటారు.

కుంభ రాశి వారు సున్నిత స్వభావులు కావున ఈ చిన్న మాట అన్నా నోచ్చు కుంటారు. అదేవిధంగా కొన్ని విషయాలలో సత్వర నిర్ణయం తీసుకోలేరు. ఏ నిర్ణయం తీసుకోవాలని ఊగిసలాడుతుంటారు. దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యలో చిక్కుకునే ప్రమాదముంది.

ఈ కుంభరాశి వారిలో కొంతమంది పీలగా సన్నగా ఉంటారు,  అయినప్పటికీ చాలా ఆకర్షణీయంగా ఉంటారు. ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తారు. మంచి ఎత్తులో తెల్లని రంగులో, చూడగానే ఇట్టే ఆకట్టుకునే ఆకృతి వీరి సొంతం.

అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండటం వల్ల ఈ రాశి వారిని అందరూ ఇష్టపడతారు. ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అస్సలు నచ్చదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడతారు. తమ చేసే పనులు మాటల్లో కాక చేతల్లో చూపిస్తారు.

వీరు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన వల్ల వీరికి శత్రువులు తయారవుతారు. మిత్రులు కూడా శత్రువులు గా అయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ తమ ఆలోచనలను ఎప్పటికీ మార్చుకోరు. అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరి తో పాటుగా పట్టుదల కూడా ఉంటుంది. ఫలితంగా అనవసర చిక్కుల్లో,సమస్యల్లో వీరు చిక్కుకుంటారు.

కుంభరాశి వాయు తత్వ రాశి, వీరు ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రణాళికలు రచిస్తూ, పథకాలు వేస్తూ ఉంటారు. కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయి వీరికి తెలియదు. సాంఘిక కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. కొత్త కొత్త పథకాలను తయారు చేయుట అనేకమందిని కలుసుకుంటారు. కొత్త విషయాలను తెలుసుకొనుటకు ఆసక్తిని కనబరుస్తారు. నూతన ప్రదేశాలను దర్శించుట వీళ్ళకి చాలా ఇష్టం. ఎక్కువగా కష్టించి పని చేయుట వీరికి చాలా ఇష్టము.

కుంభ రాశి వారికి ప్రేమ తత్వము అని చెప్పవచ్చు కానీ వీరు వారి ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు. వీరి ప్రేమను ఎదుటివారికి ఎలా వ్యక్తీకరణ చెయ్యాలో వీరికి తెలియదు. ప్రపంచము ఈ విషయాన్ని అర్థం చేసుకోలేక పోతుంది.వీరి దగ్గరి బంధువులకు స్నేహితులకు వీరి మీద ఎలాంటి ఆపేక్ష ఉండదు. కొత్తగా పరిచయం అయిన వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు. తమ వలన ఇతరులకు కష్టం కలిగితే వీరు చాలా బాధ పడతారు.

కుంభరాశి వారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా, తాము చెప్పిందే వేదం అనే, అని భావిస్తూ ప్రవర్తిస్తారు. వీరు పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే చందాన ఉంటారు. ఇదే వీరి బలహీనత. ఈ గుణం వలన ఎదుటి వారు చెప్పే సత్యాన్ని వీరు గుర్తించలేరు. వీరు వారిని పట్టించుకోరు. ఎక్కడికి వెళ్ళినా తమ పంథాను మార్చుకోరు. తమ వ్యక్తిత్వం లో తనకంటూ కొన్ని కట్టుబాట్లను ఏర్పరచుకుంటారు. తమపై ఆధిపత్య ధోరణిని వీరు సహించరు.తమ వలన అధికారులు తలెత్తుకోలేని పరిస్థితులు ఏర్పడితే రాజీనామా చేయడానికైనా వెనుకాడరు.కొన్ని సందర్భాలలో ఈ కుంభ రాశి వారు అతిగా ప్రవర్తించే వారిని చెప్పవచ్చు.

కుంభ రాశి వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువ అని చెప్పవచ్చు. తమకు మేలు చేసిన వ్యక్తులను గుర్తుంచుకుంటారు. కొత్త వారు ఎంతమంది పరిచయమైన తమ బంధువులను, స్నేహితులను, వీరు మరవరు.

ఇంటి భోజనం అంటే చాలా ప్రీతి కలిగి ఉంటారు. తమ అలవాట్లను మార్చుకుని నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తారు. కానీ ఎక్కువ కాలము క్రమశిక్షణతో నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి. వీళ్ళ లో ఉన్న ఆవేశము ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే పరిస్థితి, వీరికి ఇబ్బందులు కలుగజేస్తాయి. తమ బాధను ఇప్పటికీ ఎవరికీ పంచుకోరు తమలోని కుళ్ళి కుళ్ళి బాధపడతారు. ఉన్న విషయాన్ని మొహం మీద చెప్పటం వల్ల వీరికి విరోధాలు వస్తాయి. ఈ మనస్తత్వం వదిలితే వీరికి మంచిది. తగాదాలకు, మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు. ఇతరులకు హామీ ఉండి వీరు చిక్కులు కొనితెచ్చుకుంటారు.

కుంభరాశి వారికి చర్మవ్యాధులు, అజీర్ణ వ్యాధులు, నరాలకు సంబంధించిన వ్యాధులు, తల నొప్పి, కీళ్ల వ్యాధులు వీరికి ఆరోగ్యమును కలిగిస్తాయి.

ధనిష్ట నక్షత్రం లో జన్మించిన వారు ధనసంపాదన నేర్పు కలిగి ఉంటారు. సామాన్య ఎత్తు కలిగి బలహీనంగా కనిపించినప్పటికీ ఆకర్షణీయంగా ఉంటారు. మంచి తెలివితేటలు కలిగి ఉంటారు.

శతభిషా నక్షత్రం లో జన్మించిన వారు తమోగుణాన్ని కలిగి ఉంటారు.పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మార్చుకునే గుణాన్ని కలిగి ఉంటారు. వీరికి మొండితనం చాలా ఎక్కువగా ఉంటుంది. తమకు తాము తెలివితేటలు కలవారని వీళ్ళు భావిస్తుంటారు.

పూర్వభద్ర నక్షత్రం లో జన్మించిన వారు, పొడవుగా బలిష్టమైన దేహాన్ని కలిగి ఉంటారు, వెడల్పైన ముఖము పెద్ద,పెద్ద దంతాలను కలిగి ఉంటారు. కోపం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. స్వేచ్ఛా జీవితం పై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అన్యాయాన్ని వీలైనంతవరకు ప్రకటిస్తారు. గాలిలో మేడలు కట్టే స్వభావాన్ని కలిగి ఉంటారు.

కుంభరాశి వారు ధనిష్టా నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను, శతభిషం నక్షత్రం లో జన్మించిన వారు అష్టముఖి రుద్రాక్షను, పూర్వభద్ర నక్షత్రం లో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష ధరించాలి.

ఇకఇక రత్న విషయానికి వస్తే, ధనిష్ట నక్షత్రం వారు పగడమును శతభిషం నక్షత్రం వారు గోమేధికమును పూర్వాభాద్ర నక్షత్రం వారు పుష్యరాగాన్ని ధరించాలి.

కుంభ రాశి వారు రాజరాజేశ్వరి అష్టకం చదవండి. లక్ష్మీగణపతిని తెల్లని పూలతో పూజించాలి.

ధనిష్ఠనక్షత్రం వారు జమ్మి చెట్టును, శతభిషా నక్షత్రం వారు అరటి చెట్టును, పూర్వభద్ర నక్షత్రం వారు మామిడి చెట్టును మొక్కలను దేవాలయాలలో నాటాలి.

 

Please share it

5 thoughts on “Aquarius in telugu / Kumbh Rashi Telugu”

Leave a Comment