వృషభ రాశి

కృత్తిక 2, 3, 4 పాదాలు రోహిణి 1 ,2 ,3 ,4 పాదాలు మృగశిర 1, 2 పాదాలు

వృషభము ఈ రాశికి చిహ్నము గా శాస్త్రములందు చెప్పబడియున్నది. Taurus వృషభం అనగా ఎద్దు.ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి, రాశి చక్రములో రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు.

మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైన ఎటువంటి ఆహారం తీసుకోవాలని అని అనుకుంటూ ఉంటారు. ఏ పని అందమైన అలసట ఎరుక ఓపికతో కష్టపడి పనిచేయు మనస్తత్వం కలవారు.

ధన సంపాదన విషయంలో వీరు అదృష్టవంతులు అని చెప్పవచ్చు. అయితే వీరికి విలాసము ల కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేయు బుద్ధి కలదు.

నిద్ర యందు శ్రద్ధ చూపక పోవుట వలన వీరి ఆరోగ్యము క్రమముగా క్షీణించే అవకాశం కలదు

ఊపిరితిత్తులు శ్వాస సంబంధ వ్యాధులు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశం కలదు.

అదృష్టపు రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6, అదృష్ట వారం శుక్రవారం. ఈ రాశి వారికి మధ్య వయసు ఉంటే జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది

వృషభరాశి కృత్తిక నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి. ఉంగరపు వేలుకు బంగారంలో ధరించాలి.

రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ముత్యం ధరించాలి. ఉంగరపు వేలుకు వెండిలో ఒక సోమవారం శుభ సమయంలో

ది.మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు పగడం ధరిస్తే శుభ ఫలితాలు పొందుతారు. ఉంగరపు వేలుకు వెండిలో ధరించాలి

వృషభ రాశి కృత్తికా నక్షత్రం లో జన్మించిన వారు, ఏకముఖి లేదా ద్వాదశ ముఖి రుద్రాక్షను ధరించాలి.

రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి. మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి.