Punarvasu Nakshatra In Telugu – పునర్వసు నక్షత్రం ఫలాలు
పునర్వసు నక్షత్రం ఎరుపు రంగుతో కూడిన నారింజ రంగులో ప్రకాశిస్తుంది. ఈ నక్షత్రాన్ని చూడాలనుకుంటే మార్చినెల ప్రాంతంలో మధ్యాకాశములో రాత్రి 9 గంటల ప్రాంతంలో కనిపిస్తుంది. పునర్వసు నక్షత్రముకు అధిపతి గ్రహముల అన్నిటిలోనూ శుభ గ్రహముగా చెప్పబడినది గురువు. ఈ నక్షత్రము మిధున రాశిలో మూడు పాదములు, కర్కాటక రాశిలో ఒక పాదము ఉండడంతో ఈ నక్షత్రానికి రాజ్యాధిపత్యం బుధుడు మరియు చంద్రులకు ఇవ్వబడినది. జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరించి గురుడు జీవ కారకుడిగా సంతాన కారకుడిగా చెప్పబడ్డాడు. పునర్వసు లోని పునర్ అంటే మరల మరోసారి అని వసు అంటే నివసించేది అని అర్థం వస్తుంది.
ఈ నక్షత్రంలో పుట్టిన వారికి నక్షత్ర దోషాలు లేవు అనగా చిన్నప్పుడు శాంతులు చేయించ అవసరము లేదు. అలాగే ఈ నక్షత్రం వారికి బాలారిష్ట దోషాలు కూడా లేవు.
మొదటి పాదములో జన్మించిన వారు : ఈ పాదానికి అధిపతి కుజుడు. శాంతి స్వభావము గలవారు, సుఖము భోగములు కలవారు, అందరికీ ప్రేమ పాత్రులు అవుతారు.
రెండవపాదంలో జన్మించిన వారు : ఈ పాదానికి అధిపతి శుక్రుడు. వీరికి ఎక్కువగా అలంకార ప్రియత్వం ఉంటుంది. విలాస జీవితాన్ని ఎక్కువగా ఇష్టపడతారు వీరికి బద్ధకం అనవసరపు ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి . ఆభరణములు నందు ఆసక్తి పొగడ్తల పై ఎక్కువ ఆసక్తి ఉంటుంది.
మూడవ పాదంలో జన్మించిన వారు: ఈ పాదానికి అధిపతి బుధుడు వీరు బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఉంటారు. కామవాంఛ ఎక్కువగా ఉంటుంది. లోప గుణం ఉంటుంది తాము అన్ని విధాలా అధికులమని గర్వం ఉంటుంది. అధిక తెలివితేటలు కలిగి ఉంటారు వీరికి సుందరమైన రూపం ఉంటుంది.
నాలుగో పాదములో జన్మించిన వారు” ఈ పాదానికి అధిపతి చంద్రుడు. వీరు అధిక ధనము కలవారుగా ను చక్కగా మాట్లాడే నేర్పు కలిగి ఉంటారు. వీరికి స్నేహితులు ఎక్కువగా ఉంటారు. అయితే వీరు తరచుగా నిర్ణయాలు మార్చుకుంటూ ఉంటారు. భోగభాగ్యములు అనుభవిస్తారు.
ఈ నక్షత్రం వారికి ఎక్కువగా సంచారం చేయడం అంటే ఇష్టం ఉంటుంది. శ్రీరామచంద్రుని నక్షత్రం పునర్వసు నక్షత్రం ఈయన 14 సంవత్సరాలు అరణ్యాల చుట్టూ సీతాన్వేషణలో ను సదా సంచారమే చేశారు. సాధారణంగా పునర్వసు నక్షత్రం వారు ఆయుధం వుండి కూడా సాధించుకో లేని అసమర్థులుగా ఒక్కొక్కసారి మిగిలిపోతుంటారు. వీరికి తమను తాము ప్రదర్శించుకునే నేర్పు ఉండదు.
పునర్వసు నక్షత్రానికి అధిపతి గురుడు కావడం వలన ఈ నక్షత్రం వారు విలువైన సలహాలను సూచనలను ఇతరులకు చేస్తుంటారు. తాము ఇష్టపడే వారి యొక్క సమస్యలను తమ నెత్తిమీద వేసుకొని బాధపడుతుంటారు. వీరు ఏ విషయంలోనూ పోటీని తట్టుకోలేరు. అవతల వారిని దెబ్బ తీయాలనే ఉద్దేశంతో అవసరానికి మించి ఎక్కువగా ప్రతిస్పందిస్తూ ఉంటారు. వీరిని వశం చేసుకోవడం చాలా సులభం ఎందుకనగా ఎవరైనా మీ సలహాలు వలన నా జీవితం బాగుందని చెప్తే చాలు వీరు వారికి వశమై పోతారు. ఈ పునర్వసు నక్షత్రం నాయక తత్వ నక్షత్రం కావడంతో వీరు చాలా చురుకుగా, చలాకీగా ఉంటూ చక్కటి ఆసక్తి, స్ఫూర్తి, ఆచరణ వంటి మంచి లక్షణాలు ఉంటాయి. ఏ పనికైనా సై అంటూ ముందుకు దూసుకెళ్లే మనస్తత్వం ఉంటుంది. అయితే వీరిలో ఉన్న దుందుడుకు స్వభావం తొందరపాటు తనం వల్ల, తీసుకునే నిర్ణయాలు మూలంగా ఎంత తొందరగా సంబంధాలు పెంచుకుంటారో, అంత తొందరగా ఇబ్బంది పడుతూ ఉంటారు.
మరి శాస్త్రం నిర్వచనం ప్రకారం పునర్వసు నక్షత్రం లో జన్మించిన వారు అనేకమంది మిత్రులను కలిగి ఉంటారు. అలాగే ఈ నక్షత్రంలో జన్మించిన వారు భోజనప్రియులు అని చెప్పవచ్చు. అదేవిధంగా సత్యాన్ని మాట్లాడుతారు మంచి గుణాన్ని కలిగి ఉంటారు. అలాగే ఉత్సాహవంతులు త్యాగబుద్ధి కలవారు హాస్యప్రియులు బుద్ధిమంతులై ఉంటారని శాస్త్రము చెప్పబడినది.
ఈ నక్షత్రం వారు ఊహ జగత్తులో విహరిస్తూ ఉంటారు. వీరి మనస్సులో అనేక ఆలోచనలు ఉంటాయి కానీ బయటపడరు. అనగా వీరికున్న ఇష్టాలను ఆశలు బయట పెట్టరు. ఈ విధంగా తన మనసులోని మాట బయట పడనీయక పోవటం వల్ల వీరి ఉద్యోగం విషయంలోనూ ఇంటాబయటా ఇబ్బందులు పడుతుంటారు. తాను ప్రేమించిన వారితో కూడా తాను ప్రేమించిన విషయం చెప్పకపోవడం వల్ల, కోరుకున్న అమ్మాయిని వివాహం చేసుకునే అదృష్టం దూరం చేసుకుంటారు. వీరు ఒక్కసారి అద్భుతమైన నిర్ణయాలు క్షణాల్లో తీసుకుంటారు. అనగా జీవితంలో తమ పెళ్లి విషయం గాని వ్యాపారాల విషయం గాని, పెట్టుబడుల విషయంలో గాని, తమ జీవితాన్ని మార్చే విషయాల్లో ,క్షణాల్లో నిర్ణయాలు తీసుకుంటారు.
అనేక శాస్త్రాలను గురించి తెలుసుకోవాలని విజ్ఞానాన్ని తెలుసుకోవాలని అలాగే విజ్ఞానాన్ని పంచాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. అలాగే ఔషధాలు తయారు చేయడం గాని ఔషధాలకు సంబంధించిన అన్వేషణ చేయడం గానీ, అనేక రకాల శాస్త్ర పరిశోధన చేయాలని గాని, అంతరిక్ష పరిశోధన చేయాలని గానీ, ఇలాంటి వాటి మీద ఆసక్తి అధికంగా ఉంటుంది. ధనము బాగా సంపాదించాలని ఆస్తులను బాగా కూడ పెట్టుకోవాలని ఆలోచన కూడా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ నక్షత్ర జాతకులు కొందరు వంశపారంపర్యంగా ధనవంతులు గానూ ఆస్తిపరులు గా కూడా ఉంటారు. వీరికి తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తులు లభిస్తాయి అనగా పిత్రార్జితం వీరికి ప్రాప్తిస్తుంది.
ఈ నక్షత్రం వారు భోజనప్రియులు అని చెప్పవచ్చును. బాగా రుచికరమైనటువంటి ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారు. వీరికి స్వతస్సిద్ధంగా ఇతరులకు మోసం చేయడం, అన్యాయం చేయడం లాంటి లక్షణాలు వీరిలో తక్కువగా ఉంటాయి. ఎవరితోనయినా సరదాగా నవ్వుతూ హాస్యంగా మాట్లాడుతుంటారు. వీరిలో ఎక్కువగా త్యాగబుద్ధి ఉంటుంది. వీరిలో మంచి వాక్పటిమ ఉంటుంది అంతే కాదు బుద్ధి మంత్రులు మరియు ఉత్సాహవంతులు. ఈ నక్షత్ర జాతకులు లో కొందరు ఏకసంతాగ్రాహిలు గా పుడతారు. అనగా ఏదైనా విషయం ఒకసారి విన్నా చదివినా దానిని అలాగే గుర్తించుకొని మరలా చెప్తారు. అందువలన లెక్కలు మరియు సైన్స్ సంబంధ శాస్త్రాలలో నైపుణ్యం ఉంటుంది. మంచి నిష్ణాతులు మరియు పండితులు అవుతారు అని చెప్పవచ్చు. వీరికి గణితం అంటే చాలా ఇష్టపడతారు అలాగే కంప్యూటర్ సంబంధిత విద్య కూడా వీరికి బాగా అబ్బుతుంది. అలాగే వీరికి సేవాగణం అధికంగా ఉంటుంది.
ఈ నక్షత్రం వారు పట్టణాలలో నివసించుటకు ఎక్కువగా ఇష్టపడతారు. వీరికి గ్రామాలలో కన్నా పట్టణాలలో నివసించడం వల్ల రాణింపు ఉంటుంది. ఈ నక్షత్రం వారి శరీరము వాత తత్వానికి సంబంధించిన ఐ ఉండటం వలన వాత సంబంధమైన రోగాలతో బాధ పడతారు. వీరికి సాధారణంగా మానసిక సంబంధమైన వ్యాధులు ఉంటాయి.
ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలలో ఆకర్షణీయమైన రూపము సాత్విక గుణములు కలిగి ఉంటారు. ఈ వీరికి ఓర్పు సహనం వీళ్లకు ఉన్నటువంటి సహజ గుణాలు. అంతేకాదు చురుకైన బుద్ధి ధార్మిక గుణం కలిగి ఉంటారు. వీరు వైవాహిక జీవితంలోని సంపూర్ణ ఆనందం అనుభవిస్తారు. ఈ నక్షత్రం స్త్రీలకు అధిక తెలివితేటలు ఉంటాయి. తమ వైవాహిక జీవితాన్ని చెక్క దిద్దుకుంటారు. వీరికి తెలివి తేటలు అధికంగా ఉన్నప్పటికీ ప్రదర్శించడానికి ఇష్టపడరు. ఏ పని అయినా సరే చాలా ఓపికగా చేస్తారు. తమ మనసులోని విషయాలను బయటపెట్టరు. తల్లిదండ్రుల దగ్గర మొహమాట పడతారు. వీరికి ఆలోచనా శక్తి ఎక్కువగా ఉంటుంది. ఏ విషయంలోనైనా నిర్ణయం తీసుకునే ముందు ఏకాంతంగా కూర్చుని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు.
పునర్వసు నక్షత్రంలో పుట్టిన వారికి గురు మహాదశ ప్రారంభమవుతుంది. ఈ దశ మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఆ తర్వాత వరుసగా శని దశ 19 సంవత్సరాలు, బుధ దశ 17 సంవత్సరాలు, శుక్రదశ 20 సంవత్సరాలు, రవి దశ 6 సంవత్సరాలు వస్తాయి. శని బుధ, శుక్ర ,మహాదశలు బాగా యోగిస్తాయి. సాధారణంగా పునర్వసు నక్షత్రం వారికి 18, 24, 29, 33, 35, 47, 59, 62 సంవత్సరములు యోగప్రదమైన కాలం అని చెప్పవచ్చు.
పునర్వసు నక్షత్రం లో జన్మించిన అబ్బాయికి పునర్వసు నక్షత్రంలో జన్మించిన అమ్మాయితో వివాహం అంత అనుకూలంగా ఉండదు.
భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర,పుష్యమి, ఆశ్రేష, ఉత్తర, చిత్తా, స్వాతి, విశాఖ 1 2 3 పాదాలు, పూర్వాషాడ, శ్రవణం, పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రం లో జన్మించిన అమ్మాయిలను పునర్వసు నక్షత్రంలో జన్మించిన అబ్బాయిలు నిరభ్యంతరంగా వివాహం చేసుకోవచ్చు.
అశ్విని, కృత్తిక, మృగశిర, ఆర్ద్ర, పుష్యమి, ఆశ్లేష, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి,విశాఖ 1 2 3 పాదాలు, ఉత్తరాషాడ, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రంలో జన్మించిన అబ్బాయిలను పునర్వసు నక్షత్రంలో జన్మించిన అమ్మాయిలు నిఅభ్యంతరంగా వివాహం చేసుకోవచ్చు.
ఈ నక్షత్రంలో ఎవరైనా చనిపోతే తీసుకోవలసిన జాగ్రత్తలు: ఇక పునర్వసు నక్షత్రం లో ఎవరైనా మరణించినా ఆ ఇంటిని 6 నెలలపాటు విడవాలి.
వీరికికలసి వచ్చిన అదృష్టం సంఖ్యలు: 7,2,9,3
వీరికి కలసి వచ్చిన అదృష్ట వారములు: సోమ, గురు, శని.
పునర్వసు నక్షత్రం వారు ఆరాధించ వలసినటవంటి దేవతలు: శివుడు కనకదుర్గ శ్రీరాముడు
ఈ నక్షత్రంలో జన్మించినటువంటి ప్రముఖులు: గోమాత కామదేనువు ఈ నక్షత్రంలో జన్మించినది. శ్రీరామచంద్రుడు, రమణ మహర్షి, చంద్రబాబునాయుడు, చిదంబరం, కూడా ఈ నక్షత్రంలో జన్మించారు.
ఈ నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ధరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. గురు గ్రహమునకు ప్రీతికరమైన రోజు గురువారం నాడు గాని, శివుడికి ప్రీతికరమైన రోజు సోమవారం నాడు గాని, గురుపర్ణమి మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో బ్రహ్మీ ముహూర్తంలో ఈ రుద్రాక్షను ధరించాలి. రుద్రాభిషేకం అర్చన జరిపించిన తరువాత మహా శివ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ ఈ రుద్రాక్షను ధరించాలి.అలాగే కనక పుష్యరాగాన్ని ధరించాలి. అలాగే గంధమాల ను మెడలో ధరిస్తే చాలా మంచిది.
పునర్వసు నక్షత్రం వారు వెదురు లేదా గన్నేరు చెట్టును పెంచడం మరియు పూజించడం ద్వారా ఊపిరితిత్తుల కి సంబందించిన వ్యాధులు క్షయ, ఉబ్బసం శ్వాసకోస బాధల నుండి, మరియు రొమ్ము క్యాన్సర్ నుండి ఉపశమనం పొందుతారు.పెద్ద పెద్ద సమస్యలు వచ్చినా , చక్కటి చాకచక్యంతో మెలిగి బయటపడడానికి ఉపయోగపడుతుంది. ఇలా చెట్లను పెంచటం వలన మంచి యోగదాయాకంగా ఉంటుంది.
పంచముఖి రుద్రాక్ష ఇక్కడ కొనండి
Also read : గణేశ అష్టోత్తర శత నామావళి
Gurv garu namaskarm nade kuda punarvasu nakshatram naku chala ebbndul unya guruvu gaaru entha money sampadinchina undatm ldhu piyga malli appu chydm avthunde naku adyena solutions chpdi gruvu garu
Naku marege profile s vasthuny malli retunu pothuny gurv garu ela enduku jarugutundi chpdi gurv garu . marege epdu avthunde guruvu gaaru
Nanau acting felld lo pothdm anukuntuna naku a feeld sutable avthunda
Plz naku kochm chpdi gruvu garu .
Enthaga me viedo chusnu andulo anii correct na life ela undo e video lo meru alge chparu plz help gurv garu
వంశీ గారు మీ ఇంట్లో గణపతి హోమం జరిపించండి. అన్ని సర్దుకుంటాయి.
Na date of birth
09-02-1998
Time of birth
01:40 am
Palace of birth
MEDAk plz. Gurvu garu help me
Date of birth 09-02-1998
Time of birth. 01:40am
Palce of birth MEDAk
Gurv garu namaskarm gurvu garu naku chala ebbndul unya guruvu gaaru
Entha Money sampadinchina undatm ldhu piyga malli appu chydm avthunde naku adyena solutions chpdi gruvu garu please
Marrge profile s vachya mallli return vellipothru
Naku marege epdu avthunde guruvu gaaru kochm chusi chpndi
Nanu future lo piyki ravle ante em chyle chpndi
వెంకటేశ్వర స్వామికి కళ్యాణోత్సవం చేయించండి. విజయవాడలో కనకదుర్గమ్మ గుడిలో, చండీ హోమం జరుగుతుంది. వీలైతే ఆ హోమంలో పాల్గొనండి. అపరాజిత స్తోత్రాన్ని పారాయణం చేయండి
Namaskram guruvu garu nak antu na life intha kastanga untundani telidu eppudu edo oka health problem andulo unna amma chelli nee nene chuskovali chinnapati nundi kastapadi penchina amma ki anandamina jeevitham ivvalenemo ane bayam asal na jeevitham ela untundo nen kastapadi chadivina job anedi na jatakam lo undo ledo ani bayam dayachesi nak job voche avakasham unda na future ela untundo cheppandi guruvu garu.. na vivaralu
Peru : sowjanya
Date of birth : 22 – 05 – 1996
Time of birth : udayam 5am – 6.45am madyalo na jeevitham lo nen anukunnadi sadinchagalana dayachesi cheppandi guruvu garu..
Swamy na kathaka pampandi
Swamy na jathakam pampandi date of birth 24/8/2003
Own House issue too much ga bank appu chala ebbandi karan ga marindi enni pojalu remidies chesina palitham vundatledu bank vattidi yekkuvagavundi name :G.srinivasarao , 5-8-1967 ,2:00 AM
swami,
Name :- Hymavathi
Date of Birth -16/05/1983
Place of birth – Chittoor , Ap
Issues :- got divorced with first marriage and one child also , trying for second marriage , but not fixing it is coming near and not fixing
గురువు గారు నాది పునర్వసి నక్షత్రం నాకు ఆక్సిడెంట్స్ జరుగుతున్నాయి దీనికి ఏమైనా పరిహారం చెప్పండి guruvu garu.
P Balaji
25-02-1972
8.30 PM
Puravasu 4 padamu
Karnataka rasi
I have joined in job on 21st August. Please tell me this will be for long run without any problems