Jaya Jaya Sri Hari Hrudaya Nivasini in Telugu
This is a special chant or mantra that people say to show love and respect to a very important god. When they say these words, it makes them feel peaceful and happy inside. It’s like a special song for the god that they love.
జయ జయ శ్రీహరి హృదయ నివాసిని
విష్ణు మనోహరి చంద్ర సహోదరి
శ్రీ మహలక్ష్మి హరిదేవేరి
క్షీరాబ్ధి కన్యా సౌభాగ్యదాయిని
శ్రీ అష్టలక్ష్మి పాలించవమ్మా
జయ జయ శ్రీహరి హృదయ నివాసిని
సురవర మునీంద్ర వందిత జనని
పంకజ వాసిని మంజుల భాషిణి
శ్రీ మహలక్ష్మి నమోస్తుతే
ఆదిలక్ష్మివై అలరే తల్లి
శ్రీ వరలక్ష్మి వైకుంఠవాసిని
శ్రీ శ్రీనివాసుని హృదయ నివాసిని
శ్రీ ఆదిలక్ష్మి వందనమమ్మా
జయ జయ శ్రీహరి హృదయ నివాసిని
సురవర మునీంద్ర వందిత జనని
పంకజ వాసిని మంజుల భాషిణి
శ్రీ మహలక్ష్మి నమోస్తుతే
ధాన్యలక్ష్మివై ధాత్రిని వెలసి
సిరులనుగాచే దయా తరంగిణి
బంగరు పంటల భాగ్యము నొసగే
శ్రీ సస్యలక్ష్మి కరుణించవమ్మా
జయ జయ శ్రీహరి హృదయ నివాసిని
సురవర మునీంద్ర వందిత జనని
పంకజ వాసిని మంజుల భాషిణి
శ్రీ మహలక్ష్మి నమోస్తుతే
ధైర్యలక్ష్మివై శోభిల్లు జనని
భయనివారిణి అభయప్రదాయిని
ధైత్యనివారిణి ధర్మపరాయణి
శ్రీ వీరలక్ష్మీ కృపచూపవమ్మా
జయ జయ శ్రీహరి హృదయ నివాసిని
సురవర మునీంద్ర వందిత జనని
పంకజ వాసిని మంజుల భాషిణి
శ్రీ మహలక్ష్మి నమోస్తుతే
సర్వ సౌభాగ్య సంపదలొసగే
శ్రీ గజలక్ష్మీ కమల నివాసిని
అమృతమయమగు నీ వీక్షణతో
మమ్మేలువమ్మా శ్రీ స్వర్గలక్ష్మీి
జయ జయ శ్రీహరి హృదయ నివాసిని
సురవర మునీంద్ర వందిత జనని
పంకజ వాసిని మంజుల భాషిణి
శ్రీ మహలక్ష్మి నమోస్తుతే
సంతానలక్ష్మిగా విలసిల్లు తల్లి
ఈ జగమంతా నీమయమమ్మా
సత్సంతాన సౌభాగ్యమొసగే
సంతానలక్ష్మి మము బ్రోవమమ్మా
జయ జయ శ్రీహరి హృదయ నివాసిని
సురవర మునీంద్ర వందిత జనని
పంకజ వాసిని మంజుల భాషిణి
శ్రీ మహలక్ష్మి నమోస్తుతే
విజయలక్ష్మిగా విశ్వమునేలే
విశ్వాంతరంగిణి శ్రీహరిరాణి
నీ కృప గలిగిన జన్మమే ధన్యం
శ్రీ విజయలక్ష్మి దయచూపుమమ్మా
జయ జయ శ్రీహరి హృదయ నివాసిని
సురవర మునీంద్ర వందిత జనని
పంకజ వాసిని మంజుల భాషిణి
శ్రీ మహలక్ష్మి నమోస్తుతే
వాణి సరస్వతి శ్రీ గీర్వాణి
విజ్ఞానదాయిని వీణాపాణి
సంగీత సాహిత్య సారము నీవే
విద్యాలక్ష్మి శరణం శరణం
జయ జయ శ్రీహరి హృదయ నివాసిని
సురవర మునీంద్ర వందిత జనని
పంకజ వాసిని మంజుల భాషిణి
శ్రీ మహలక్ష్మి నమోస్తుతే
సిరి సంపదలతో భక్తుల బ్రోచే
శ్రీ ధనలక్ష్మి ఐశ్వర్యధాయిని
మనసున నిన్నే నమ్మితిమమ్మా
శ్రీ కనకలక్ష్మి కరుణించవమ్మా
జయ జయ శ్రీహరి హృదయ నివాసిని
సురవర మునీంద్ర వందిత జనని
పంకజ వాసిని మంజుల భాషిణి
శ్రీ మహలక్ష్మి నమోస్తుతే
శుక్రవారమున తొలిసంధ్య వేళ
నిను కొలుచువారల బ్రోచెదవమ్మా
సకల సంపదలు సౌభాగ్యములను
ప్రసాదించుమా సౌభాగ్యలక్ష్మి
జయ జయ శ్రీహరి హృదయ నివాసిని
సురవర మునీంద్ర వందిత జనని
పంకజ వాసిని మంజుల భాషిణి
శ్రీ మహలక్ష్మి నమోస్తుతే
అష్టకష్టములు బాపే తల్లి
అష్టైశ్వర్యములొసగే తల్లి
అష్టరూపముల అలరే తల్లి
శ్రీ అష్టలక్ష్మీ మాం పాహి పాహి
జయ జయ శ్రీహరి హృదయ నివాసిని
సురవర మునీంద్ర వందిత జనని
పంకజ వాసిని మంజుల భాషిణి
శ్రీ మహలక్ష్మి నమోస్తుతే (2)
శ్రీ మహలక్ష్మి నమోస్తుతే
శ్రీ మహలక్ష్మి నమోస్తుతే
శ్రీ మహలక్ష్మి నమోస్తుతే
శ్రీ మహలక్ష్మి నమోస్తుతే
Also read :శ్రీ తుల్జా భవానీ స్తోత్రం