Kanti Sukravaramu Keerthana in Telugu-కంటి శుక్రవారము గడియలేడింట

YouTube Subscribe
Please share it
Rate this post

Kanti Sukravaramu Keerthana in Telugu

కంటి శుక్రవారము అనేది వెంకటేశ్వర స్వామిపై అన్నమయ్య రచించిన ప్రసిద్ధ కీర్తన (భక్తి గీతం). 

కంటి శుక్రవారము గడియలేడింట

కంటి శుక్రవారము గడియలేడింట |
అంటి అలమేల్మంగ అండనుండే స్వామిని ||

సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణముగట్టి
కమ్మని కదంబము కప్పు పన్నీరు |
చెమ్మతోన వేష్టువలు రొమ్ముతల మొలజుట్టి
తుమ్మెద మై ఛాయతోన నెమ్మదినుండే స్వామిని ||

పచ్చకప్పురమె నూరి పసిడి గిన్నెలనించి
తెచ్చి శిరసాదిగ దిగనలది |
అచ్చెరపడి చూడ అందరి కన్నులకింపై
నిచ్చమల్లెపూవువలె నిటుతానుండే స్వామిని ||

తట్టుపునుగే కూరిచి చట్టలు చేరిచినిప్పు
పట్టి కరగించి వెండి పళ్యాలనించి |
దట్టముగ మేనునిండ పట్టించి దిద్ది
బిట్టు వేడుక మురియు చుండే బిత్తరి స్వామిని ||

Also read :శ్రీ వేంకటేశ అష్టకం 

 

Please share it

Leave a Comment