Karkataka Rasi – కర్కాటక రాశి
పునర్వసు 4 వ పాదం
పుష్యమి 1, 2, 3 ,4 పాదాలు
ఆశ్లేష 1 ,2 ,3, 4 పాదాలలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు.
ఎండ్రకాయ లేక పీత అనబడు జల చరము ఈ రాశికి చిహ్నము గా శాస్త్రములలో చెప్పబడినది. ఈ రాశి రాశి చక్రంలో నాలుగవది. కర్కాటక రాశి వారికి రాస్యాదిపతి చంద్రుడు. చంద్రుడు మనఃకారకుడు కావున వీరి మనస్తత్వము చాలా సున్నితంగా మంచి పనులు చెయ్యాలి అనేటువంటి తపన వీరికి ఉంటుంది. వీరు మంచి వినయవిధేయతలు కలిగి ఉండటం వల్ల చాలామంది స్నేహితులు ఉంటారు. వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు ఎక్కువగా వస్తాయి. కర్కాటక మనగా ఎండ్రకాయ, మరి ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది.ఇది నీళ్లలో అట్టడుగున ఉంటూ నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది. ఈ టి మీద ఏమాత్రం అలజడి కలిగిన నీటి లోపలికి వెళ్లి పోతుంది. మనకు ఎండ్రకాయ ఆకారము చాలా భయంకరంగా కనబడుతుంది. అయినా ధైర్యం లేని తత్వాన్ని కలిగి ఉంటుంది.అనగా దీనిని అనుసరించి ఈ కర్కాటక రాశి వారు గొడవలు అంటే అస్సలు ఇష్టపడరు. అలాగే ఇంటి వ్యవహారాలలో శ్రద్ధ వహిస్తారు. ఇవి వీరి ప్రత్యేక గుణం గా మనం చెప్పుకోవచ్చు.
కర్కాటక రాశి, రాశి చక్రంలో నాలుగవది అలాగే చరరాశి. అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారిపోతుంటాయి. ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి మార్చుకుంటారు. టకటక నిర్ణయాలు తీసుకుంటారు ఆలోచనలు చకచకా మారిపోతుంటాయి. వీళ్లు ఎక్కువగా ఆందోళన గా కనిపిస్తారు.వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు. ఒక్కొక్కసారి అతి విశ్లేషణ వలన ఆ సమస్యను జఠలం చేసుకుంటారు.ఒకవేళ సమస్య పెద్దదైతే ముడుచుకుపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు.వీరి ఆలోచన కు కార్యాచరణ కు మధ్య ఉన్న అంతరాన్ని గుర్తించి పని చేస్తారు.ఈ రాశికి అధిపతి చంద్రుడు కావున వీరికి మానసిక సంఘర్షణలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మానసిక వేదన కూడా ఉంటుంది. వీళ్ళకి తరచి తరచి ఆలోచించి గుణం ఉంటుంది. అందువలన వీరు ముత్యాన్ని ధరిస్తే చాలా మంచిది. ఇలా ధరిస్తే మానసిక సంఘర్షణలు తగ్గుతాయి.
ఈ రాశి వారు అందరి గౌరవింపబడే వారుగా ఉంటారు. ఆధ్యాత్మిక మతవిశ్వాసాలు ఉంటాయి. సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. సాధు జీవితం గడుపుతారు ధనం దానంతట అదే వీరి వద్దకు చేరుతుంది వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది. ప్రశాంతత వాత్సల్యం వీరి ముఖంలో కనిపిస్తూ ఉంటుంది.
ఈ రాశిలో జన్మించిన వారి మనస్సు పరిపరి విధములుగా ఉంటుంది. కొంత కాలము ఉత్సాహము, ఆశ, సంతోషము వెల్లివిరుస్తుంది. మరికొంత కాలము విషాదము, నిరాశ ,దిగులు కలుగుతుంటుంది.
ఈ రాశి వారిని నమ్మించి మోసగించు ట చాలా సులభం. అయితే వీళ్లు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను ఇట్టే పసిగడతారు.
ఈ కర్కాటక రాశి వారికి చురుకుతనం ఎక్కువ, అయితే దీని యందు కూడా ఒక స్థిరమైన అభిప్రాయము వీళ్ళకి ఉండదు. ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావం కు తగ్గట్టుగా ప్రవర్తిస్తారు. వీరికి జ్ఞాపకశక్తి అధికముగా ఉంటుంది. చిన్నతనమున జరిగినటువంటి సంఘటన లో కలిసి తిరిగిన ఎటువంటి మనుషులను స్పష్టంగా గుర్తుంచుకుంటారు. అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనినీ సొంతంగా చేసుకోలేరు. అయితే వేరొకరి ప్రోత్సాహం ఉంటే ఎంతటి ఘన కార్యమైనా చేయగలరు.
వీరికి నచ్చిన వారి కోసం వాళ్ల సంపదను ధనాన్ని వస్తు సంపదను తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు. వీరికి నష్టము కలిగినను అనారోగ్యము కలిగినను ఏమాత్రం లెక్క పెట్టక సహాయం చేయుదురు. ఇతరుల బాధ్యతలను నెత్తిన పెట్టుకుని స్వభావము వీరికి కలదు.
మీరు ఎక్కువగా ప్రయాణం చేయు వృత్తుల యందు స్థిరపడతారు. అనగా వాహనములపై నను నౌకలు విమానములు రైలు బండ్లు పైన తిరుగు వృత్తులలో వీరు రాణిస్తారు. టూరింగ్ ఏజెంట్లు టూరిస్టు సంఘ నిర్వాహకులు ఔషధము ఏజెంట్లు ప్రచారము చేయువారు గా వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. నీటిపై ఎగుమతి దిగుమతుల వ్యాపారాలు ధాన్యము వస్త్రములు తినుబండారాలు, పానీయములు వ్యాపారములు వీరికి బాగా కలిసి వస్తాయి.
కర్కాటక రాశి వారికి ఉద్యోగము కన్నా వ్యాపారము, బాగా కలిసి వస్తుంది. కర్కాటక రాశి వారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం ఉండలేరు. వేరే స్థలంలో ఎంత సౌకర్యములు ఉన్నప్పటికీ తమ సొంత ఇంటికి ఎప్పుడు ఎప్పుడు వెళదామా అని అనుకుంటుంటారు.
ఈ కర్కాటక రాశి వారి జీవిత భాగస్వామి గడుసరి అని చెప్పవచ్చు. ఇల్లు తీర్చిదిద్ది గల నేర్పరి, అదేవిధంగా ఆదాయ, వ్యయాల యందు జాగ్రత్త పడుతుంది. ఈ రాశి వారికి గృహ సౌఖ్యము వాహన సౌఖ్యము కలుగును.
కర్కాటక రాశి వారు ముత్యాన్ని ధరించాలి. దీనిని ధరించడం వల్ల అష్టైశ్వర్యాలు, సకల సంపదలు కలుగుతాయి. ఈ కర్కాటక రాశి వారికి చిన్నతనమున జలుబు, దగ్గు ఊపిరితిత్తులకు సంబంధించి న బాధలు కలగవచ్చు. వివాహానంతరం స్థూల శరీరము రావచ్చును. అలసట, ఆయాసము దాహము, శ్వాసకోస వ్యాధులు కలిగే అవకాశం ఉంది.
వార్ధక్యమున మధుమేహము, రక్తపోటు, ఉదరము, జీర్ణకోశము నకు సంబంధించినటువంటి వ్యాధులు, లివర్ వ్యాధులు, కూడా కలిగే అవకాశం ఉంది. కావున ఈ రాశి వారు తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇక కర్కాటక రాశి వారు ధరించాల్సిన రుద్రాక్షలు. పునర్వసు నక్షత్రం లో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష ధరించాలి. పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి. ఆశ్లేష నక్షత్రం లో జన్మించిన వారు చతుర్ముఖి రుద్రాక్ష ధరించాలి.
ఇక కర్కాటక రాశి వారు ధరించవలసిన రత్నాలు. పునర్వసు నక్షత్రం లో జన్మించిన వారు కనక పుష్యరాగం ధరించాలి. చూపుడు వేలుకు బంగారంలో చేయించిన కనకపుష్య రాగాన్ని ఒక గురువారం నాడు శివాలయంలో శివుడికి అభిషేకం చేయించి ధరించాలి అలాగే శనగలు దానం ఇవ్వాలి.
పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు ఇంద్రనీలం ధరించాలి. వెండిలో మధ్య వేలుకు ధరించాలి శివాలయంలో శివుడికి అభిషేకం చేసిన తర్వాత ధరించాలి. అలాగే నల్ల నువ్వులను దానం ఇవ్వాలి.
ఆశ్లేష నక్షత్రం లో జన్మించిన వరు జాతిపచ్చను ధరించండి. ఒక బుధవారం నాడు చిటికెన వేలుకు బంగారంలో జాతిపచ్చను ధరించాలి. ఉదయించే సమయంలో విష్ణు అష్టోత్తర పూజ చేయాలి. అలాగే పెసలు దానం చేయాలి.
Almost all my chacteristics sir.. sir na love success avutudo ledo cheppadi sir..
Avvadu bcoz cancer people are selfish