Karthika Snanam Vidhanam in Telugu-కార్తీక స్నాన విధి

YouTube Subscribe
Please share it
Rate this post

Karthika Snanam Vidhanam in Telugu

కార్తీక స్నానం విధానం అనగా కార్తీక మాసంలో స్నానం చేసేటప్పుడు పఠించాల్సిన మంత్రం మరియు అనుసరించాల్సిన విధానం. భక్తితో మీ విధిని నిర్వహించండి.

కార్తీక స్నాన విధి

ప్రార్థన 

సర్వపాపహరం పుణ్యం స్నానం కార్తీక సంభవం |
నిర్విఘ్నం కురు మే దేవ దామోదర నమోఽస్తు తే ||

సంకల్పం

దేశకాలౌ సంకీర్త్య :
గంగావాలుకాభి సప్తర్షిమండలపర్యంతం కృతవారాశేః పౌండరీకాశ్వమేధాది సమస్త క్రతు ఫలావాప్త్యర్థం, ఇహ జన్మని జన్మాంతరే చ బాల్య కౌమార యౌవన వార్ధకేషు, జాగ్రత్ స్వప్న సుషుప్త్యవస్థాసు జ్ఞానతోఽజ్ఞానతశ్చ కామతోఽకామతః స్వతః ప్రేరణయా సంభావితానాం సర్వేషాం పాపానామపనోదనార్థం ధర్మార్థకామమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం, క్షేమ స్థైర్య విజయాయురారోగ్య ఐశ్వర్యాదీనాం ఉత్తరోత్తరాభివృద్ధ్యర్థం శ్రీ శివకేశవానుగ్రహ సిద్ధ్యర్థం వర్షే వర్షే ప్రయుక్త కార్తీకమాసే ____ వాసర యుక్తానాం ____ తిథౌ శ్రీమాన్ (శ్రీమతః) ____ గోత్రాభిజాతః ____ నామధేయోఽహం పవిత్ర కార్తీక ప్రాతః స్నానం కరిష్యే ||

మంత్రం 

తులారాశిం గతే సూర్యే గంగా త్రైలోక్యపావనీ |
సర్వత్ర ద్రవరూపేణ సా సంపూర్ణా భవేత్తదా ||

గంగా ప్రార్థన 

అంబ త్వద్దర్శనాన్ముక్తిః న జానే స్నానజం ఫలమ్ |
స్వర్గారోహణ సోపానం మహాపుణ్య తరంగిణీం |
వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికామ్ ||
గంగే మాం పునీహి |
గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి |
ముచ్యతే సర్వ పాపాభ్యో విష్ణులోకం స గచ్ఛతి ||

Also read :శ్రీ రాజరాజేశ్వర్యష్టకం20 

 

Please share it

Leave a Comment