Ksheerabdi Kanyakaku in Telugu
శ్రీ తాళ్లపాక అన్నమాచార్య స్వరపరిచిన అత్యంత ప్రసిద్ధ కీర్తనఇది. ‘నీరాజనం’ అంటే ఆర్తి లేదా హారతి వెలిగించిన కర్పూరం లేదా నూనెలో ముంచిన వత్తులతో పూజించడం.
క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
క్షీరాబ్ధి కన్యకకు శ్రీమహాలక్ష్మికిని
నీరజాలయమునకు నీరాజనం |
జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు
నెలకొన్న కప్పురపు నీరాజనం |
అలివేణి తురుమునకు హస్తకమలంబులకు
నిలువుమాణిక్యముల నీరాజనం ||
చరణ కిసలయములకు సకియరంభోరులకు
నిరతమగు ముత్తేల నీరాజనం |
అరిది జఘనంబునకు అతివనిజనాభికిని
నిరతి నానావర్ణ నీరాజనం ||
పగటు శ్రీవేంకటేశు పట్టపురాణియై
నెగడు సతికళలకును నీరాజనం |
జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల
నిగుడు నిజ శోభనపు నీరాజనం ||
క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని… నీరజాలయమునకు నీరాజనం
నీరాజనం… నీరాజనం
క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని… నీరజాలయమునకు నీరాజనం
నీరాజనం… నీరాజనం
జలజాక్షి మోమునకు… జక్కవ కుచంబులకు (2)
నెలకొన్న కప్పురపు నీరాజనం…
అలివేణి తురుమునకు… హస్తకమలంబులకు (2)
నిలువుమాణిక్యముల నీరాజనం…
నిలువుమాణిక్యముల నీరాజనం… నీరాజనం
క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని… నీరజాలయమునకు నీరాజనం
నీరాజనం… నీరాజనం
చరణ కిసలయములకు… సకియరంభోరులకు (2)
నిరతమగు ముత్తేల నీరాజనం…
అరిది జఘనంబునకు… అతివనిజనాభికిని (2)
నిరతి నానావర్ణ నీరాజనం…
నిరతి నానావర్ణ నీరాజనం… నీరాజనం
క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని… నీరజాలయమునకు నీరాజనం
నీరాజనం… నీరాజనం
పగటు శ్రీవేంకటేశు… పట్టపురాణియై (2)
నెగడు సతికళలకును నీరాజనం…
జగతి నలమేల్మంగ… చక్కదనములకెల్ల (2)
నిగుడు నిజశోభనపు నీరాజనం…
నిగుడు నిజశోభనపు నీరాజనం… నీరాజనం
క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని… నీరజాలయమునకు నీరాజనం
నీరాజనం… నీరాజనం (3)
నీరాజనం… నీరాజనం
Also read : సంతాన గణపతి స్తోత్రం