Madhurashtakam in Telugu-మధురాష్టకం

YouTube Subscribe
Please share it
Rate this post

Madhurashtakam in Telugu

మధురాష్టకం శ్రీకృష్ణుని స్తుతిస్తూ వల్లభాచార్య రచించిన ఎనిమిది చరణాల స్తోత్రం. ఇది భక్తిగీతంగా కూడా బాగా ప్రాచుర్యం పొందింది అంతేకాదు చాలా మంది గాయకులు ఈ పాటను అందించారు. ‘మధురం’ అంటే ‘తీపి’ అని అర్థం. మధురాష్టకంలో, వల్లభాచార్యుడు శ్రీకృష్ణుని ప్రతి అంశాన్ని మధురం (తీపి)గా వర్ణించాడు.  శ్రీకృష్ణుని అనుగ్రహం కోసం  మరింత భక్తి శ్రద్దలతో  జపించండి.

మధురాష్టకం

అధరం మధురం వదనం మధురం
నయనం మధురం హసితం మధురం |
హృదయం మధురం గమనం మధురం
మధురాధిపతేరఖిలం మధురం || 1 ||

వచనం మధురం చరితం మధురం
వసనం మధురం వలితం మధురం |
చలితం మధురం భ్రమితం మధురం
మధురాధిపతేరఖిలం మధురం || 2 ||

వేణుర్మధురో రేణుర్మధురః
పాణిర్మధురః పాదౌ మధురౌ |
నృత్యం మధురం సఖ్యం మధురం
మధురాధిపతేరఖిలం మధురం || 3 ||

గీతం మధురం పీతం మధురం
భుక్తం మధురం సుప్తం మధురం |
రూపం మధురం తిలకం మధురం
మధురాధిపతేరఖిలం మధురం || 4 ||

కరణం మధురం తరణం మధురం
హరణం మధురం స్మరణం మధురం |
వమితం మధురం శమితం మధురం
మధురాధిపతేరఖిలం మధురం || 5 ||

గుంజా మధురా మాలా మధురా
యమునా మధురా వీచీ మధురా |
సలిలం మధురం కమలం మధురం
మధురాధిపతేరఖిలం మధురం || 6 ||

గోపీ మధురా లీలా మధురా
యుక్తం మధురం ముక్తం మధురం |
దృష్టం మధురం శిష్టం మధురం
మధురాధిపతేరఖిలం మధురం || 7 ||

గోపా మధురా గావో మధురా
యష్టిర్మధురా సృష్టిర్మధురా |
దలితం మధురం ఫలితం మధురం
మధురాధిపతేరఖిలం మధురం || 8 ||

ఇతి శ్రీ మధురాష్టకం ||

అయ్యా మరన్ని మదుర స్త్రోత్రాలు :శ్రీ సుబ్రమణ్య స్వామి అష్టోత్తర శతనామావళి 

Please share it

Leave a Comment