Muddugare Yashoda Lyrics in Telugu
“ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు” అన్నమయ్య వేంకటేశ్వర కీర్తన. ఇందులో అన్నమాచార్య శ్రీకృష్ణ లీలలను నవరత్నాలు లేదా ప్రతి తొమ్మిది రత్నాలతో పోల్చారు.
ముద్దుగారే యశోద ముంగిటి
ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు
తిద్దరాని మహిమల దేవకీ సుతుడు
అంత నింత గొల్లెతల అరచేతి మాణికము
పంతమాడే కంసుని పాలి వజ్రము
కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ బూస
చెంతల మాలో నున్న చిన్ని కృష్ణుడు
రతికేళి రుక్మిణికి రంగు మోవి పగడము
మితి గోవర్ధనపు గోమేధికము
సతమై శంఖ చక్రాల సందుల వైడూర్యము
గతియై మమ్ము గాచేటి కమలాక్షుడు
కాళింగుని తలలపై గప్పిన పుష్యరాగము
యేలేటి శ్రీ వేంకటాద్రి యింద్రనీలము
పాల జలనిధి లోన బాయని దివ్య రత్నము
బాలునివలె దిరిగీ బద్మ నాభుడు
Also read : శ్రీ అష్టలక్ష్మీ అష్టోత్రం