Paluke Bangaramayena lyrics in Telugu
పలుకే బంగారమాయెన రాముడిపై ఒక ప్రసిద్ధ కీర్తన. దినిని శ్రీరామునికి భక్తుడైన భక్త రామదాసుచే స్వరపరచబడింది. తెలుగు భక్తిరస చిత్రం రామదాసు (2006)లోని పలుకే బంగారమాయెనా పాట చాలా ప్రజాదరణ పొందింది.
పలుకే బంగారమాయెనా
పల్లవి
పలుకే బంగారమాయెనా కోదండ పాణి ||
అనుపల్లవి
పలుకే బంగారమయె పిలిచిన పలుకవేమి
కలలో నీ నామస్మరణ మరవ చక్కని తండ్రి
|| పలుకే ||
చరణములు
ఇరవూగ ఇసుకలోన పొరలీన ఉడుత భక్తికి
కరుణించి బ్రోచితివని నెరనమ్మితిని తండ్రి
|| పలుకే ||
రాతినాతిగ జేసి భూతలమున
ప్రఖ్యాతి జెందితివని ప్రీతితో నమ్మితి తండ్రి
|| పలుకే ||
ఎంత వేడిన గాని సుంతైన దయ రాదు
పంతము సేయ నేనెంతటి వాడను తండ్రి
|| పలుకే ||
శరణాగతత్రాణ బిరుదాంకితుడవు గాదా
కరుణించు భద్రాచల వర రామదాస పోష
|| పలుకే ||
Also read :సరస్వతీ సహస్రనామ స్తోత్రం