Simha Rasi / Leo zodiac sign in telugu

YouTube Subscribe
Please share it
4.2/5 - (5 votes)

Simha Rasi Telugu – సింహ రాశి ఫలితాలు

మఖ 1 ,2 ,3 ,4 పాదాలు

పూర్వ పాల్గొని 1, 2, 3 ,4 పాదాలు

ఉత్తర పాల్గొని 1వ, పాదం

Simha Rasi

సింహ రాశి, రాశి చక్రంలో ఐదవది. ఈ రాశికి అధిపతి సూర్యుడు. సింహం జంతు సామ్రాజ్యానికి రాజు. అరణ్య పర్వత శిఖర ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నము గా శాస్త్రములలో కీర్తించబడింది. అందువలన ఈ రాశివారు పర్వత ప్రాంతము నందు తిరుగుటకు ఎక్కువగా ఇష్టపడుతారు. ఈ సింహ రాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు.ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు. మరి రాజు ఎలా ఉంటాడు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడు. ఈ అంశ జన్మించినవారు రాజకీయనాయకులుగా ఎదిగే అవకాశం కలదు. ఏ రంగంలోనైనా వీరు నాయకులు గానే ఉంటారు. అందువలన వీరికి సహజసిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి. ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు. అలాంటి ఆలోచనలు వీళ్ళలో ఉంటాయి. ఎవరితోనైనా సరే వీళ్ళు కలిసిపోతారు. ఎక్కువ ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు.

సింహరాశి వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బ తీస్తే అస్సలు తట్టుకోలేరు.ఏ విషయంలోనైనా సరే వాళ్ళ స్వయం నిర్ణయాధికారాన్ని వాళ్ళు కోరుకుంటారు. సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు. వీళ్ళకి ఏ పని అప్పగించిన చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా చేసుకుంటారు. వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది. ఈ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు.

ఈ సింహ రాశి వారికి స్వాభిమానము, పట్టుదల, ఆదర్శం, అందరినీ మించవల నన్న కుతూహలము ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు ఏ నాడు ఓటమిని అంగీకరించరు. అలాగే ఈ విషయంలో నైనను నిరాశ చెందరు. ఎప్పుడు విజయపథంలో నడుచుటకు ఇష్టపడుదురు. అయితే సింహ రాశి వారికి ఆవేశము అధికముగా ఉంటుంది ఇది వీరికి అనర్థదాయకం గా చెప్పవచ్చు. దీనివలన అనేక చిక్కులు కొని తెచ్చుకుంటారు. ఇతురుల బాధ్యతలను తమ నెత్తిన పెట్టుకొని చిరకాలము బాధపడుతుంటారు. కావున వీరు అభిమానము దురభిమానము కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీరిపై ఉన్నది.

సింహ రాశి వారికి శారీరక బలము తో పాటుగా మనోబలము కూడా ఎక్కువగా ఉంటుంది. అందువలన వీరికి కోపము ఎక్కువగా వస్తుంటుంది. తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా నప్పుతుంది.

వీరి యొక్క చిత్రమైన గుణం ఏమంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటివారిలో వెతుకుతుంటారు. అందువలన ఎదుటివారిని తప్పులు పట్టుట, న్యాయము పేరుతో రోషం పడుట, గిల్లికజ్జాలు పెట్టుకుంటుంటారు. అయితే ఎవరు ఏ తప్పు చేసినా మీరు వారిని క్షమిస్తారు. ముఖ్యంగా ఈ సింహ రాశి వారికి గుట్టు గుంభన, చాటుమాటు తనము, నమ్మించి మోసం చేయుట, లాంటి గుణములు ఉన్నవారు అన్న అసలు పడదు.

ఈ సింహ రాశి వారికి మానవత్వం పై మంచితనము పై వీరికి అంతులేని అభిమానం ఉంటుంది. అప్పుడే పరిచయమైన కొత్త వారిని సైతం ఇట్టే నమ్మేస్తారు. జాలి గురు దృశ్యం కనిపించినచో వీరు ఇతరుల కష్టాలు పాలు కాకుండా వారి బాధ్యతను తన భుజాలపై వేసుకొని సహాయము చేస్తారు. దీనిని అదునుగా చేసుకొని కొంతమంది వీరిని మోసము చేస్తారు.

అయితే సింహ రాశి వారి స్వభావం మేమంటే మోసము చేయుట, నమ్మించి నట్టేట ముంచుట, కపట ప్రేమ చూపుట, వీరి స్వభావం కాదు. అందరూ వీరి మాటలకు లోబడి ఉండవలెనని, వీరు అందరి కన్నా తెలివైన వారమని వీరి గట్టి నమ్మకము.

అయితే ఈ సింహ రాశి వారికి డబ్బు ఆస్తిపాస్తులు అధికారము వీరి దృష్టిలో ఏమంత విలువైనవి కావు. కానీ వీళ్ళకి కీర్తి దాహము, ప్రచార కాంక్ష, అను రెండు విషయములకు మాత్రము లొంగిపోతారు. అతి డంభికత్వము, ఇతరులతో తమని పొగడిన చుకోవాలని ఎటువంటి కోరిక, మరియు వీరిని వీరు స్లాగించుకొనుట, అను లక్షణములు నిగ్రహించుకున్నచో వీర అంతటి వారు ఉండరు.

ఒక ఆదర్శవంతమైన స్త్రీని వివాహమాడి ఆమెను ప్రేమ దేవత ఆరాధించ వలననే ఆదర్శం వీరి కుండను. అయితే వీరికి ఆశాభంగము కలగవచ్చు. త్వరపడి ఆ దేశమున ఎవరినో ఒకరిని వివాహము చేసుకొని వీర్ ఆశించిన ప్రేమ తత్వము లభించినప్పుడు జీవిత సౌధము కూలిపోయినట్లు వీరు బాధపడు అవకాశము కలదు. సింహ రాశి వారికి స్త్రీ జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది. వీరి ఆవేశము చే ఆకర్షింపబడిన కొందరు స్త్రీలు తో సులభముగా ప్రణయ కలాపము ఏర్పాటు అవకాశం కలదు.

ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది‌. ఈ రాశిలో పుట్టిన స్త్రీలు తమ సంతానం క్రమశిక్షణలో పెట్టుట, వారిని చదువులో తీర్చిదిద్దుట వీరికి వెన్నతో పెట్టిన విద్య.

సింహరాశి వారికి వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు వీరికి అనుకూలము అవుతుంది. బాధలలో ఉన్నవారిని రక్షించు వృత్తులలో, శాఖలలో, వీరు రాణిస్తారు. ‌ ఔషధములు, రసాయనద్రవ్యములు, వస్తు ప్రదర్శనశాలల నిర్వహణ, టూరింగ్ ఏజెంట్లుగా పని చేయుట వీరికి సరిపడిన వృత్తులు అని చెప్పవచ్చు. అంతేకాదు వాగ్దాటి, ఉపన్యాసము, సాహిత్యము, శాస్త్ర బోధన కు, సాంకేతిక విద్య, క్రమశిక్షణకు సంబంధించిన వృత్తులలో వీళ్లు రాణిస్తారు. మొత్తం మీద సింహ రాశి వారు ఉద్యోగముల కన్నా వ్యాపారాల యందు బాగా రాణిస్తారు.

ఈ రాశి వారు ధరించాల్సిన రత్నాలు. మఖా నక్షత్రం వారు వైఢూర్యాన్ని ధరించండి. ఒక శనివారం నాడు మధ్యవేలుకు వెండిలో పొదిగిన వైఢూర్యాన్ని ఒక గణపతి దేవాలయం లో, గణపతి అష్టోత్తరం చేయించుకుని ధరించాలి. అలాగే ఉలవలు దానం ఇవ్వాలి.

పూర్వపాల్గొని నక్షత్రం లో జన్మించిన వారు వజ్రాన్ని ధరించాలి. ఒక శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మికి కుంకుమార్చన చేయించి, అలసందలు దానము చేసి, ఉంగరపు వేలుకు బంగారంలో పొదిగిన వజ్రాన్ని ధరించాలి.

ఉత్తర పాల్గొని నక్షత్రం లో జన్మించిన వారు కెంపును ధరించాలి. ఒక ఆదివారం నాడు శివాలయంలో శివుడికి అభిషేకం చేయించి, గోధుమలు దానమిచ్చి, బంగారంలో పొదిగిన కెంపును ఉంగరపు వేలుకు ధరించాలి.

ఈ సింహ రాశి లో జన్మించిన వారు ధరించాల్సిన రుద్రాక్షలు. మఖా నక్షత్రం వారు నవముఖి రుద్రాక్ష ను ధరించాలి. పూర్వ పాల్గొని నక్షత్రం వారు షణ్ముఖి రుద్రాక్షను ధరించాలి. ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి లేదా ద్వాదశ ముఖి రుద్రాక్ష ధరించవచ్చు.

 

 

 

Please share it

2 thoughts on “Simha Rasi / Leo zodiac sign in telugu”

  1. Ye pani chesina preyojanam undatamledu. Kharchu yekkuva aadayam takkuva undi. Assalu chetilo dabbu aagatamledu. Naku sampadana mida makku yekkuva. Kani yenta prayatninchina appulu, loan lu kattadanike saripotundi jivitam.

    స్పందించు

Leave a Comment