Anthayu Neeve Lyrics in Telugu-అంతయు నీవే హరి పుండరీకాక్ష

YouTube Subscribe
Please share it

Anthayu Neeve Lyrics in Telugu

అంతయు నీవే ఒక ప్రసిద్ధ అన్నమయ్య కీర్తన. తెలుగు పిడిఎఫ్‌లో అంతయు నీవే సాహిత్యాన్ని ఇక్కడ పొందండి మరియు వేంకటేశ్వర స్వామి అనుగ్రహం కోసం దీనిని జపించండి.

అంతయు నీవే హరి పుండరీకాక్ష

అంతయు నీవే హరి పుండరీకాక్ష – చెంతనాకు నీవే శ్రీ రఘురామ… (2)
అంతయు నీవే హరి పుండరీకాక్ష

కులమును నీవే గోవిందుడా నా – కలిమియు నీవే కరుణానిధి
తలపును నీవే ధరణీధర నా – నెలవును నీవే నీరజనాభ

తనువును నీవే దామోదర నా – మనికియు నీవే మధుసూదన
వినికియు నీవే విఠ్ఠలుడా నా – వెనకముందు నీవే విష్ణు దేవుడా

పుట్టుగు నీవే పురుషోత్త మ – కొన నట్టనడుము నీవే నారాయణ
ఇట్టే శ్రీవేంకటేశ్వరుడా నాకు – నెట్టన గతి ఇంక నీవే నీవే

Also read : శ్రీ శరభేశాష్టకం 

 

Please share it

Leave a Comment