Brahma Kadigina Padamu Lyrics in Telugu-బ్రహ్మ కడిగిన పాదము

YouTube Subscribe
Please share it

Brahma Kadigina Padamu Lyrics in Telugu

బ్రహ్మ కడిగిన పదము అనేది వెంకటేశ్వర స్వామిపై అన్నమయ్య రచించిన ప్రసిద్ధ కీర్తన (భక్తి గీతం). తెలుగు పిడిఎఫ్‌లో బ్రహ్మ కడిగిన పదము సాహిత్యాన్ని ఇక్కడ పొందండి.

బ్రహ్మ కడిగిన పాదము

బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము తానెని పాదము |

చెలగి వసుధ కొలిచిన నీ పాదము
బలి తల మోపిన పాదము |
తలకగ గగనము తన్నిన పాదము
బలరిపు గాచిన పాదము ||

కామిని పాపము కడిగిన పాదము
పాము తల నిడిన పాదము |
ప్రేమతో శ్రీసతి పిసికెడి పాదము
పామిడి తురగపు పాదము ||

పరమ యోగులకు పరి పరి విధముల
వర మొసగెడి నీ పాదము |
తిరు వేంకటగిరి తిరమని చూపిన
పరమ పదము నీ పాదము ||

Also read :సుదర్శన అష్టకం 

Please share it

Leave a Comment