Dhanvantari Maha Mantra in Telugu
వైద్యో నారాయణో హరిః’- అంటే వైద్యుడు మహా విష్ణు స్వరూపుడని అర్థం. ఆ మహావిష్ణువే దేవ వైద్యుడు ధన్వంతరిగా అవతారం దాల్చి, ఆయుర్వేదాన్ని మానవాళికి అందించాడని పురాణాలు..
ఆకస్మిక, దీర్ఘకాలిక వ్యాధుల నివారణకూ, వ్యాధుల వ్యాప్తి కారణంగా కలిగే భయాలన్నీ పోవడానికీ ‘‘వ్యాధి తొలగిపోవాలి. నేను సంపూర్ణ ఆరోగ్య వంతుణ్ణి కావాలి’’ అని మనసులో గాఢంగా సంకల్పించుకొని, ధన్వంతరిని నిత్యం ప్రార్థించాలి.
‘వైద్యో నారాయణో హరిః’- అంటే వైద్యుడు మహా విష్ణు స్వరూపుడని అర్థం. ఆ మహావిష్ణువే దేవ వైద్యుడు ధన్వంతరిగా అవతారం దాల్చి, ఆయుర్వేదాన్ని మానవాళికి అందించాడని పురాణాలు చెబుతున్నాయి. క్షీర సాగర మథనం సాగుతున్నప్పుడు చేతిలో అమృత కలశంతో ధన్వంతరి ఉద్భవించాడు. దేవ వైద్యుడిగా ప్రసిద్ధి చెందాడు. మంచి హస్తవాసి ఉన్న వైద్యుడిని అపర ధన్వంతరిగా అభివర్ణించడం అందరికీ తెలిసినదే.
ధన్వంతరి మంత్రం
- ఓం నమో భగవతే
- మహా సుదర్శనాయ వాసుదేవాయ ధన్వంతరయే
- అమృతకలశ హస్తాయ
- సర్వ భయ వినాశాయ
- సర్వ రోగ నివారణాయ
- త్రైలోక్య పతయే త్రైలోక్య నిధయే
- శ్రీ మహావిష్ణు స్వరూప
- శ్రీ ధన్వంతరీ స్వరూప
- శ్రీ శ్రీ శ్రీ ఔషధ చక్ర నారాయణాయ స్వాహా
‘‘సుదర్శన వాసుదేవ ధన్వంతరిగా ప్రసిద్ధుడైన దేవదేవునికి నమస్సులు. చేతిలో అమృత కలశాన్ని ధరించినవాడూ, అన్ని భయాలనూ పోగొట్టి, సర్వ రోగాలనూ నివారించేవాడూ, ముల్లోకాలకూ పతి, ముల్లోకాలకూ శ్రేయస్సు చేకూర్చేవాడూ, మహా విష్ణువుకు మారురూపమూ అయిన ధన్వంతరి కృప అందరినీ ఆరోగ్యవంతుల్ని చేస్తుంది. ఆ ఆయుర్వేద పురుషుడికి నమస్సులు’’ అని భావం.
‘‘సుదర్శన వాసుదేవ ధన్వంతరిగా ప్రసిద్ధుడైన దేవదేవునికి నమస్సులు. చేతిలో అమృత కలశాన్ని ధరించినవాడూ, అన్ని భయాలనూ పోగొట్టి, సర్వ రోగాలనూ నివారించేవాడూ, ముల్లోకాలకూ పతి, ముల్లోకాలకూ శ్రేయస్సు చేకూర్చేవాడూ, మహా విష్ణువుకు మారు రూపమూ అయిన ధన్వంతరి కృప అందరినీ ఆరోగ్యవంతుల్ని చేస్తుంది. ఆ ఆయుర్వేద పురుషుడికి నమస్సులు’’ అని భావం.
Also read :శ్రీ దుర్గాష్టోత్తరశతనామావళిః