Manase harathi song lyrics in telugu
మనసే హారతి షిరిడీ శ్రీపతి
అభయం కోరితి విజయం వేడితి
పాహిమాం దయ గనవోయి సాయిరాం
మనసే హారతి షిరిడీ శ్రీపతి
అభయం కోరితి విజయం వేడితి
పాహిమాం దయ గనవోయీ సాయిరాం
సాయిరాం షిరిడి సాయిరాం
సాయిరాం షిరిడి సాయిరాం
శాంతికి ప్రాకారం ప్రేమకు శ్రీకారం
కరుణా సాగరం సాయీ ఆలయం
సమంతకు సోపానం మమతకు ఆధారం
జీవన పావనం నీ గుడి ప్రాంగణం
గీతా బైబిలు ఖురాను సారము
సాయీ నీ సుమధుర నామము
మనసే హారతి షిరిడీ శ్రీపతి
అభయం కోరితి విజయం వేడితి
పాహిమాం దయ గనవోయి సాయిరాం
చెరగని చిరునవ్వు తరగని సుఖ శాంతి
జ్ఞాన విభూతి నిరతము కోరితి
అందరి గురుమూర్తి పొందగ అనుభూతి
నీ పద జ్యోతినై చేసెద సన్నిధి
సర్వము నీవుగా సాధన చేయగా
బాబా ఈయవోయి దీవెనా
మనసే హారతి షిరిడీ శ్రీపతి
అభయం కోరితి విజయం వేడితి
పాహిమాం దయ గనవోయి సాయిరాం
మనసే హారతి షిరిడీ శ్రీపతి
అభయం కోరితి విజయం వేడితి
పాహిమాం దయ గనవోయి సాయిరాం
సాయిరాం షిరిడి సాయిరాం.
Also read : శ్రీ సాయిబాబా ఏకాదశ సూత్రములు