Sheetala Ashtakam in Telugu
శ్రీ శీతలాష్టక స్తోత్రం వివరణ :-
శ్రీ శీతలాష్టక స్తోత్రం స్కాంద పురాణంలో ప్రస్తావించబడిన పవిత్రమైన శ్లోకం. దీనిని శివుడు చెప్పాడు . ఈ స్తోత్రం ద్వారా దేవి శీతలామాతను స్తుతించటం వలన , వివిధ వ్యాధులు, జ్వరం, చిరకాలిక అనారోగ్య భాదలు తొలిగిపోతాయి.
శ్రీ శీతలాష్టకం
అస్య శ్రీశీతలాస్తోత్రస్య మహాదేవ ఋషిః అనుష్టుప్ ఛందః శీతలా దేవతా లక్ష్మీర్బీజం భవానీ శక్తిః సర్వవిస్ఫోటకనివృత్యర్థే జపే వినియోగః ||
ఈశ్వర ఉవాచ
వన్దేఽహం శీతలాం దేవీం రాసభస్థాం దిగంబరాం |
మార్జనీకలశోపేతాం శూర్పాలంకృతమస్తకామ్ || 1 ||
వన్దేఽహం శీతలాం దేవీం సర్వరోగభయాపహాం |
యామాసాద్య నివర్తేత విస్ఫోటకభయం మహత్ || 2 ||
శీతలే శీతలే చేతి యో బ్రూయాద్దాహపీడితః |
విస్ఫోటకభయం ఘోరం క్షిప్రం తస్య ప్రణశ్యతి || 3 ||
యస్త్వాముదకమధ్యే తు ధ్యాత్వా సంపూజయేన్నరః |
విస్ఫోటకభయం ఘోరం గృహే తస్య న జాయతే || 4 ||
శీతలే జ్వరదగ్ధస్య పూతిగంధయుతస్య చ |
ప్రనష్టచక్షుషః పుంసః త్వామాహుర్జీవనౌషధమ్ || 5 ||
శీతలే తనుజాన్రోగాన్ నృణాం హరసి దుస్త్యజాన్ |
విస్ఫోటకవిదీర్ణానాం త్వమేకాఽమృతవర్షిణీ || 6 ||
గలగండగ్రహా రోగా యే చాన్యే దారుణా నృణాం |
త్వదనుధ్యానమాత్రేణ శీతలే యాంతి సంక్షయమ్ || 7 ||
న మన్త్రో నౌషధం తస్య పాపరోగస్య విద్యతే |
త్వామేకాం శీతలే ధాత్రీం నాన్యాం పశ్యామి దేవతామ్ || 8 ||
మృణాలతన్తుసదృశీం నాభిహృన్మధ్యసంస్థితాం |
యస్త్వాం సంచింతయేద్దేవి తస్య మృత్యుర్న జాయతే || 9 ||
అష్టకం శీతలాదేవ్యా యో నరః ప్రపఠేత్సదా |
విస్ఫోటకభయం ఘోరం గృహే తస్య న జాయతే || 10 ||
శ్రోతవ్యం పఠితవ్యం చ శ్రద్ధాభక్తిసమన్వితైః |
ఉపసర్గవినాశాయ పరం స్వస్త్యయనం మహత్ || 11 ||
శీతలే త్వం జగన్మాతా శీతలే త్వం జగత్పితా |
శీతలే త్వం జగద్ధాత్రీ శీతలాయై నమో నమః ||12 ||
రాసభో గర్దభశ్చైవ ఖరో వైశాఖనందనః |
శీతలావాహనశ్చైవ దూర్వాకందనికృంతనః || 13 ||
ఏతాని ఖరనామాని శీతలాగ్రే తు యః పఠేత్ |
తస్య గేహే శిశూనాం చ శీతలా రుఙ్న జాయతే || 14 ||
శీతలాష్టకమేవేదం న దేయం యస్యకస్యచిత్ |
దాతవ్యం చ సదా తస్మై శ్రద్ధాభక్తియుతాయ వై || 15 ||
ఇతి శ్రీ స్కాందపురాణే శీతలాష్టకం ||
శీతలాష్టక స్తోత్రం పారాయణం వల్ల కలిగే ప్రయోజనాలు :-
✅ చర్మ వ్యాధులు, ముఖ్యంగా చిన్న పిల్లల్లో వచ్చే చర్మవ్యాధుల నివారణ
✅ విష జ్వరాలు, గొంతు సమస్యలు, దుర్గంధ వ్యాధులు, అంటువ్యాధుల నివారణ
✅ ఇంట్లో ఆరోగ్యం మరియు శాంతిని తీసుకురావడం
✅ శీతలామాత కృప వల్ల కుటుంబమంతా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండటం.
Also read : ఏకముఖి రుద్రాక్ష