Ugadi Festival in Telugu – ఉగాది పండుగ విశిష్టత

YouTube Subscribe
Please share it
4.2/5 - (6 votes)

Ugadi Festival in Telugu

గాది పేరులోనే పచ్చదనం, వసంత చైతన్యం దాగున్నట్టు అనిపిస్తుంది. యుగానికి ఆది కాబట్టి యుగాది అంటాం. ఇదే కాలక్రమేణా ఉగాదిగా రూపాం తరం చెందింది. ఈ పండుగ కోలాహలం ప్రకృతిలో అడుగడుగునా కనిపిస్తుంది. కోయిల కుహకుహూ రాగాలతో, పక్షుల కిలాకిలా రావాలతో, ఎటు చూసినా పచ్చ దనపు చిగుళ్లతో, ఎన్నో రకాల పూల సందళ్లతో, ఘుమఘమలతో, మధురమైన పళ్ల రుచులతో సరికొత్త అనుభూతులతో, జీవన చైతన్యంలో ఈ పండుగ మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఈ రోజే బ్రహ్మ సృష్టికి శ్రీకారం చుట్టాడంటారు. అందువల్ల ఈ రోజుని చైత్ర శుద్ధ పాడ్యమి అని లేదా ఉగాదిగా పండితులు చెప్తారు.. కొత్త సంవత్సరానికి, కొత్త మాసానికి, సరికొత్త రోజుకి ఇది సుస్వాగతం పలుకుతుందన్న మాట.  ప్రతి ఉగాదితో ప్రారంభమయ్య కొత్తవత్సరాలకు ప్రభవ, విభవ వంటి అర పేర్లున్నాయి. ప్రభవనాను సంవత్సరం ఆరంభమై ఆంక్షయనామ సంవత్సరంలో ఒక ఆవృత్తం పూర్తవుతుంది. అంటే అరవై వసంతాలని అర్థం. ఈ three స్వభాను నామసంవత్సరం మొదలైంది. వసంత రుతువులో వచ్చే ఈ ఉగారికి ప్రకృతి అంతా పచ్చదనంతో పరవశించి పోతుంది.

ఉగాది పర్వదినాన ప్రతి ఇంటికీ తోరణాలు కట్టాలనీ, ధ్వజారోహణం చేయాలని, వేపాకు తినాలని, పంచాంగ శ్రవణం చేయాలని చెపుతారు ‘యుగము అనే పదాన్ని కాలానికి కాలమానంగా పరి గణించడమే కాకుండా, జంట అనే అర్థంలో కూడా వాడతారు. ఉత్తరాయణం, దక్షిణాయనం అనే రెండు ఆయనాలతో కూడినది యుగం, ఆ యుగాన్ని ప్రారంభించే రోజు కనుక దీనిని ఉగాది అంటున్నాం, సూర్యుడు చైత్ర శుద్ధ పాడ్యమి నాడు లంకానగరంలో ఉదయించాడని భాస్కరా చార్యుడు సిద్ధాంత శిరోమణిలో ప్రస్తావించాడు. చైత్రశుద్ధ పాడ్యమి నాటికి ద్వాపరయుగం పూర్తె కలియుగం ప్రారంభమైందని, కృష్ణావతారం ముగిసిన ఆరోజే భువిలో కలి ప్రవేశించిందని, అందువల్ల ఉగాదిని ఆరోజు జరుపుకోవడం ఆచారంగా మారిందని చెపుతారు. శ్రీరాముడు త్రేతా యుగంలో ఉగాదినాడే పట్టభిషిక్తుడయ్యాడు. విక్రమార్క శాలివాహన చక్రవర్తులు తమ రాజ్యాల్ని ఉగాది రోజే స్వీకరించారు.

 పొద్దున్నే లేచి తలస్నానం చేసి దేవుడికి పూజ చేసుకుని తినే ఉగాది పచ్చడి. ఇది తినకపోతే పండుగ చేసుకున్నట్టే కాదట. పైగా ఈ పచ్చడికి మనవారు ఎన్నో తాత్విక అర్థాలు కూడా చెపుతుంటారు. పచ్చడిలో చేదు, తీపి, పులుపులను జీవితంలోని సుఖదుఃఖాలకు అన్వయిస్తారు. జీవితం అంటే అన్ని రుచుల సమ్మేళనం లాంటిదన్న వేదాంతసారాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది.  ఈ ఉగాదిపచ్చడి ఆరోగ్యం కు చాలా మంచిది.. బెల్లం రక్తంలోని హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. కాబట్టి దీనివల్ల మనకు అదనంగా శక్తి చేకూరుతుంది. చెరకు ఆనడంవల్ల దంతాలు, చిగుళ్లు బాగా గట్టిపడతాయి. చెరకురసాన్ని కాండిస్ కి మందు కూడా తీసుకుంటారు.

ఈ పండుగను మనతో పాటు మహారాష్ట్ర కర్ణాటక వారు కూర చేసుకుంటారు. కన్నడిగులు, మనమూ దీన్ని ఉగాది అని పిలిస్తే మరారాలు కుడిపడవు అంటారు. వింధ్య పర్వతాలకు దక్షిణ భాగంలో నివసిస్తున్న  వారు దీన్ని చంద్రమానం ప్రకారం చేసుకుంటారు. అంటే శాలివాహన శకం ప్రకారమన్నమాటఉగాది రోజున లక్ష్మీదేవికి పూజలు చేయడమే కాకుండా ప్రత్యేక వంటకాలను నైవేద్యం పెడతారు. ఈ పండుగ హడావిడి వారం రోజుల నుంచే మొదలవుతుంది. ఇళ్లు దులుపుకుని, రంగులు వేసుకునేవాళ్లు వేసుకుంటారు. ఇంటి గుమ్మాలకు పచ్చటి మావిడి తోరణాలు కడతారు. మామిడాకులు శుభ చిహ్నంగా మనం భావిస్తాం. పండుగకు కొత్త బట్టల షాపింగ్ కూడా తప్పనిసరిగా చేస్తారు. పండుగ రోజు తెల్లవారుఝామునే లేని తలస్నానాలు చేసి, పూజ చేస్తారు. ఆయురారోగ్యాలు, సంపదలతో తమ ఇళ్లు తులతూగాలని దేవతకు మొక్కులు మొక్కుకుంటారు. ఏవైనా కొత్త పనులు చేపట్టాలనుకునే వారు కూడా ఉగాదినాడు వాటికి నాంది పలకడం కద్దు.

చాంద్రమాన ఉగాది చైత్రమాసమున ఆచరిస్తారు.  శిశిర ఋతువు అనగా అర్టం చలికాలం పోయి, చైత్రమాసం వసంత ఋతువు మొదలఅవుతుంది. ఇదే విధంగా మనుష్యుని శరీరంలోను కొన్ని మార్పులు కలుగు తాయి. శిశిరంలో చర్మం పగిలి ఉంటుంది. వసంత ఋతువులో శరీరం నవ చైతన్యాన్ని సంతరించుకొంటుంది. పాము కుబుసం విడిచి పెట్టినట్లుగా, పక్షులు ఈకలు రాల్చినట్లు , కొత్తగా చిగుళ్ళు సంతరించుకొన్నట్లు చెందుతుంది. ఈ కారణం చేతనే చాంద్రమాన ఉగాది చైత్రమాసముతో ప్రారం భించారు. ఈ పండుగ విధులలో ఆరోగ్య విజ్ఞానం కూడా దాగి ఉంది. ఉగాది పండుగ ఇలా జరుపుకోవాలి.

ఉగాది పండగ రోజు వేకువజామునే నిద్రలేవటం, తలంటు పోసుకోవటం. మామిడాకుల తోరణాలు కట్టడం, కొత్తబట్టలు కట్టుకోవటం, పిండి వంటలతో మృష్టాన్న భోజనాలు చేయడం సంప్రదాయం. కొత్త నిర్ణయాలు తీసుకొని ఆయా కార్యాలకు శుభారంభం చేయటం ఉగాది ప్రత్యేకత. పుణ్య కాలానుష్ఠానము, అభ్యంగన స్నానమాచరించిన తర్వాత సూర్యోదయం కోసం వేచివుండి, సూర్యుడు ఉదయించడంతోనే సూర్యునికి పుష్పాంజలి, అర్ఘ్యము, దీపం, ధూపం అర్పించి, ఆరోజు నుంచి ఆచరించవలసిన వ్యవహారములకు సంబంధించి నూతన సంకల్పం చేయాలి. వసంతకాలంలో కోకిలగానం వింటే కొన్నిరోగాలు సైతం నయమౌతాయని శాస్త్రాలలో చెప్పారు.

ఉగాదినాడు ప్రతి గృహమందు ధ్వజారోహణము చేయాలి. వేపాకు తప్పక ఉపయోగించాలి. షడ్రుచులతో చేసిన వేపపూత పచ్చడిని సేవించాలి. నూతన వస్త్రాలు ధరించటం, నిత్యకర్మలు పూర్తిచేసుకోవటం, పంచ భక్ష్య పరమాన్నాలతో దేవునికి నైవేద్యం చేసి, బంధు మిత్రులతో భుజించటం, తరువాత పంచాగ శ్రవణం చేయటం ముఖ్యం.

ధర్మకుంభదానం :-

దీనినే కలశపూజ అంటారు. దీనివల్ల రానున్న సంవత్సరకాలంలో అన్ని కోరికలూ తీరుతాయి.  దీనికోసం రాగితోగాని, పంచలోహాలతో గానీ, చివరికి మట్టికుండను గానీ, రంగులతో అలంకరించి, అందులో పంచపల్లవములు అనగా అయిదు రకాల గుళ్లు, మామిడి, అశోక, నేరేడు, మోదుగ, వేప కలిపిన నీటిని పోసి, సుగంధ చందనమును కలిపి, పుష్పాక్షతలు వేసి, ఆవాహనము చేసి, పుణ్యమంత్రాలతో పూజచేసి, నిలబెట్టి కలశానికి ఒక కొత్తవస్త్రాన్ని చుట్టి కలశంపై పసుపు కుంకుమ చందనం పసుపు దారాలతో అలం కరించిన కొబ్బరిబొండం నుంచి అట్టి పూజా కలశాన్ని గురువుకు గానీ, పురోహితునికి గానీ గుడిలో విష్ణుమూర్తి లేదా యజ్ఞపురుషునికి గానీ దానమిచ్చి వారిని నూతన వస్త్రాలు, దక్షిణలతో సత్కరించి వారి ఆశీస్సులు పొందాలి.

పంచాంగ శ్రవణం:-

తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం ఈ అయిదింటినీ కలిపి పంచాంగం అంటారు. తిథి వల్ల సంపద, వారం వల్ల ఆయుషు, నక్షత్రం వల్ల పాప పరిహారం, యోగం వల్ల వ్యాధి నివృత్తి, కరణం వల్ల కార్యానుకూలము కలుగుతాయి. కాలం తెలిసి కర్మం చేయు ఆస్తికులు భగవదనుగ్రహం పొందుతారు. పంచాంగ శ్రవణం వల్ల కలిగే పుణ్యం భూమి, బంగారం, ఏనుగులు, గోవులు, ఉత్తమ కన్యాదానములు చేస్తే కలిగినంత ఫలితంతో సమానం. సంవత్సరాధిపతులైన రాజు, మంత్రి, సేనాధి పతి, సస్యాధిపతీ, ధాన్యాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి, రసాధిపతి, నీరసాధిపతి అనే నవనాయకుల యొక్క గ్రహ ఫలితాలను శాస్తోక్తంగా వినడం వల్ల గ్రహదోషాలు నివారణ అయి వినేవారికి ఆరోగ్యము. ఆయుషు వృద్ధి చేసి సంపద, శుభఫలితాలు కలుగుతాయి. నవగ్రహాలను ధ్యానించుట వల్ల కలిగే శుభ ఫలితాల వంటివే రానున్న సంవత్సరంలోని ఏయే ఆధిపత్యాలు, ఏయే గ్రహాలకు లభిస్తున్నాయో దానిని వివరించడం వల్ల ఆ గ్రహాల యొక్క తేజస్సు మన యందు కలుగును. శాస్త్రవిధిగా, పంచాంగ శ్రవణం చేసిన వానికి, వినిపించిన వారికి సూర్యుని వల్ల శౌర్యం, తేజస్సు, చంద్రుని వల్ల భాగ్యం, వైభవం, కుజుని వల్ల సర్వ మంగళములు, బుధుని వల్ల బుద్ధివికాసం, శుక్రుని వల్ల సుఖం, శని వల్ల దుఃఖరాహిత్యం, రాహువు చేత ప్రాబల్యం, కేతువు వల్ల తన వర్గంలో ప్రాముఖ్యత కలుగుతాయి.

భవిష్యత్ కాలమాన పరిస్థితులు, ఎదురయే శుభాలు, కష్టనష్టాలు, మంచి చెడులు వివరిస్తారు. వర్షాలు ఎంత పడతాయి. పంటలు ఏ మేర పండుతాయి. తుఫానులు, పంటనష్టాలు ఏ రీతిలో ఉంటాయి వంటివి చెపుతారు. వీటితో పాటు వ్యక్తుల జాతక ఫలాలను కూడా చెపుతారు. ఉగాది రోజు చంద్ర దర్శనం తప్పకుండా చేసుకోవాలంటారు. ఆరోజు ప్రత్యేక కవి సమ్మేళనాలను కూడా నిర్వహిస్తారు. అంతే కాదు కొత్త కవులకు ఉగాది కవిసమ్మేళనాలు తొలి వేదికని పేరు కూడా ఉంది. ఉగాది రోజే ఈ సృష్టి ప్రారంభమైందన్న పురాణాల వివరణ సంగతి ఎలా ఉన్నా ఈ పర్వదినాన్ని నవచైతన్యానికి ప్రతీకగా, కాలగమనంలో మరో నూతన అధ్యాయానికి నాందిగా పరిగణిస్తాం మనం.

అద్భుతమైన కాలగమనాన్ని ప్రకృతి ఎప్పటికప్పుడు మానవ చేతనకు స్ఫురణకు తెస్తూనే ఉంటుంది. ప్రకృతి అందించే ఈ సందేశాల అందమైన రూపాన్ని అందించే వర్ణాయ మానమైన తరుణం ఉగాది. శిశిరంలో మోడులుగా మారిన చెట్లన్నీ వసంతం రాకతో పులకరించి కొత్త చిగుళ్లుతో, పూలతో, మొగ్గలతో, పిందెలతో పరిసరాలన్నింటినీ పరిమళభరితమైన కాంతులతో అలరింపచేసే ఈ ఘట్టం

సృష్టిగమనంలో ఎప్పటికప్పుడు నూతన అధ్యయానికి నాందీవాచక మవుతుంది. గతించిన కాలంతోనే అదృశ్యమైన అనుభవాలు, కాలగతిలో కలిసిపోయిన ఆప్తులు, కష్టాల కడలిగా గడిచిన నిన్నటి రోజు.. లాంటి విషాదమయమయిన మరచిపోదగిన మరిచిపోవలసిన సంగతులకు తెరవేస్తూ ఉగాది వస్తుంది.

ఉగాది అనేది యుగాది (యుగానికి మొదలు) అనే సంస్కృత భావనకు తెలుగు రూపం. యుగం అనేది భారతీయ పౌరాణికాల్లో కాలపరిమితిని సూచించే ఒక కొలత. అనంతకాల గమనంలో ఒక పర్వం ముగిసి, మరో పర్వం ఆరంభ మైందని సూచించేలా ప్రకృతి కొత్తతరం శాలుదిద్దుకోవడం ఈ పర్వదినం ప్రత్యేకత. శిశువు జననాన్ని ఆరంభసూచికగా పరిగణించే మానవజాతి, పరిసర ప్రకృతిలో వస్తున్న కొత్త మార్పులను కొత్తశకం ఆరంభానికి ప్రతీకగా పరిగణిస్తూ ఈ పండుగ జరుపు కొంటుంది.

ఆదిలో బ్రహ్మదేవుడు ఈరోజే సకలచరాచర సృష్టికి శ్రీకారం చుట్టినట్టు బ్రహ్మండ పురాణం చెబుతుంది. రామాయణం ప్రకారం రావణవధ అనంతరం శ్రీరామచంద్రుడు ఈనాడే సీతాసమేతుడై అయోధ్యకు బయల్దేరాడు. భాగవతంలో కూడా కాలతంత్రాన్ని వివరించే సందర్భంలో యుగాల అంతం గురించి, నవయుగాల ఆరంభం గురించి తెలిపే క్రమంలో ఉగాది ప్రస్తావన ఉంది. పురాణ ప్రమాణాలు ఇలా ఉండగా తెలుగువారు మాత్రం కొత్త సంవత్సరం ప్రారంభం కావడాన్నే ఉగాదిగా ఆచరించడం ఆనవాయితీగా మారింది. ‘ఋతునాం కుసుమాకరః” అన్నాడు కవి కులగురువు కాళిదాసు. వసంతకాలంలో ప్రకృతిలో నూతనోత్తేజం, చైతన్యం మొదలై ప్రకృతి పచ్చగా చివురించడం మొదలుకావడాన్ని శుభసూచకంగా పరిగణిస్తూ చైత్ర శుద్ధ పాడ్యమినాడు ఈ ఉగాదిని పర్వదినంగా పాటించడం మొదలైంది. చాంద్ర మానం ప్రకారం నిర్ణయించినదే కాబట్టి పాడ్యమి నుంచి చంద్రుని కళలు వృద్ధి చెందడం మొదలవుతుంది. కాబట్టి చైత్రశుద్ధ పాడ్యమినాడే ఉగాది జరుపుకోవాలని వరాహమిహిరుడు చెప్పారు. చైత్రశుద్ధ పాడ్యమినాడే భూమద్యరేఖకు సూర్యోదయం జరుగుతున్న దృష్ట్య ఆరోజూ ఉగాది అని భాస్కరాచార్యులు నిర్ణయించారు. మొత్తం మీద ఒక్కొక్క ప్రాంతం వారు ఒక్కొక్క గ్రహాన్ని ఆధారం చేసుకొని కాలానికి లెక్కలు కట్టారు. “చాంద్రమానం”, “సౌరమానం”, “బార్హస్పత్యమానం” వంటి లెక్కలు ఇలాగే అందు బాటులోకి వచ్చాయి. కాని వేదవిహిత కర్మలకు చాంద్రమానాన్నే అనుసరిం చడం ఆనవాయితీ. ఆ లెక్కన చైత్రశుద్ధ పాడ్యమినాడే ఉగాదిని ఆచరించడం ఉత్తమం.

ఉగాదినాడు వేకువనే లేచి మంగళస్నానం ఆచరించి, ఇష్టదైవారాధన చేసి, కొత్త దుస్తులు ధరించి పెద్దల ఆశీర్వాదాన్ని పొందడం కొత్త సంవత్సరం ఆరంభంలో చేయవలసిన పని. నేతిగిన్నెతో చేసిన వేపచిగుళ్లు తిని బంధువులతో, ఆప్తులతో కలిసి పంచాంగ శ్రవణం చేయడం ద్వారా అశుభాలు తొలగించుకోవచ్చు అనేది ఒక విశ్వాసం. “భవిష్యపురాణం”లో మునులు నాటి చక్రవర్తి ధర్మరాజుకి ఇదే హితబోధ చేసినట్టు తెలుస్తోంది.

ఏదైమైనా పాత అనే భావనకు నిన్నటితోనే ముగించి, ఈ ఉదయాన్ని కొత్త ఆరంభంగా పాటించడం ద్వారా పాత తప్పుల్ని, పొరపాట్లను పరిహరించుకుంటూ కొత్త జీవన పధంలో కాలు పెట్టే అవకాశాన్ని ప్రతీ ఒక్కరూ వినియోగించుకోగలగాలి. రేపటి పై కొత్త ఆశల్ని కలిగించి, భవితపై కొత్త కాంక్షలను కల్పించే ఈ శుభసమయాన్ని పండగగా జరుపుకోవడం ద్వారా సరికొత్త నిర్ణయాలు తీసుకునే సావకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి.

ఈ మార్పులను సూచించేలా ఇంటిని శుభ్రపరిచి, లేతమామిడితోరణాలతో మామిడి పిందెలతో గుమ్మాలను అలంకరించుకోవడం, ముంగిళ్లను కళకళలాడేలా చూడడం కొత్త మార్పులను సూచించగలదు. ఆశాజీవి అయిన మానవుడు తను కోరుకున్నది నేడు కాకపోయినా, రేపైనా జరుగుతోందని, నేటి పరిస్థితి రేపటికైనా మెరుగవుతుందని భావిస్తాడు. అందుకే మెరుగైన మరో ఏడాదికి స్వాగతం చెబుతూ, పాత సంవత్సరానికి వీడ్కోలు ఇస్తూ ఈ పండుగను జరుపుకోవాలి. షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి

జీవితంలోని కష్టసుఖాలు, చీకటి వెలుగులను ఒకేలా స్వీకరిస్తూ దృఢచిత్తంతో ముందుకు సాగాలనే చిన్న సందేశం ఈ పండుగనాడు అందరికీ అందుతుంది. జీవనగమనంలో ఎదురయ్యే వివిధ ఉద్వేగాలు, ఉద్రేకాలు, సంతోషాలు, ఆనందాలు, దుఃఖాలు, కష్టాలు, కన్నీళ్లు, ఇబ్బంది కలిగించే పరిణామాలు… చిరకాలం గుర్తుండే మధురమైన అనుభవాలు… వీటన్నిటినీ స్ఫురణకు తెచ్చేలా ఉగాదినాడు సకల రుచుల సమ్మేళనమైన పచ్చిపచ్చడి తినడం ఆచారంగా వస్తోంది.

ఇక ఉగాది పండుగ రోజున ప్రత్యేకమైన పిండి వంటలను కూడా వండుతారు. పులిహోర, బొబ్బట్లు తప్పనిసరిగా వండుతారు. కర్ణాటక వారు కూడా ఇవే వండు కొంటారు. దేవాలయాల్లో పూజలు తప్పనిసరిగా చేస్తారు. ప్రత్యేకంగా మల్లెల దండ లను దేవతలకు సమర్పిస్తారు. ఉగాది ప్రకృతితో అణువణువునా ముడిపడిన పండుగ. కొత్త చిగుళ్లుకు నాంది పలికే పండుగ.

ఆరు రుచుల అమృతం:-

చైత్రమాసంలో శరీరం నవచైతన్యాన్ని సంతరించుకుంటుంది. ఉగాది పర్వదినాన చేసే ఉగాది పచ్చడి సమతుల్య ఆహారానికి ప్రతీకగా ఆయుర్వేదం అభివర్ణిస్తోంది. ఉగాది పచ్చడిలో ఇమిడి ఉన్న ఆరోగ్యాంశాలు..

ఉగాది అనగానే గుర్తుకువచ్చేది ఉగాది పచ్చడి. జీవితంలోని ఆనంద, విషాదా లకు చిహ్నంగా పేర్కొనే ఉగాది పచ్చడికి వైద్యపరంగా కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీనిలోని షడ్రుచులన్నీ ఆరోగ్యదాయినులని ఆయుర్వేదం చెబుతున్నది, వేపపూవు, బెల్లం, చింతపండు, నెయ్యి, మిరియాలు, లవణ రుచులతో కూడిన ఉగాది పచ్చడి సమతులాహారానికి ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు. షడ్రుచులంటే..?

మన నాలుక గ్రహించ గలిగే ఆరు రుచులను షడ్రుచులంటారు. అవి మధురం (తీపి), ఆమ్లం (పులుపు), లవణం (ఉప్పు), కటు (కారం), తిక్తం (చేదు), కషాయం (వగరు), ఆరోగ్యపరంగా ఒక్కొక్క రుచికి రకరకాల అనారోగ్యాలను హరించే గుణాలున్నాయి. తీపి వాత, పిత్తహరిణిగా పని చేస్తుంది. తీపి, శరీరానికి అవసరమైన బలాన్ని అందించి, పోషిస్తుంది. తల్లిపాలను వృద్ధిపరుస్తుంది. దప్పిక, మూర్ఛలను తగ్గిస్తుంది. మంటల నుంచి శరీరానికి ఉపశమనం కలిగిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇంతగా ఉపయోగపడే తీపి రుచి తినడానికి ప్రియంగా కూడా ఉంటుంది. పులుపు

వాతాన్ని పోగొట్టి ఆకలిని పెంచుతుంది. గుండెకు సైతం మేలుచేసే పులుపు పంచేంద్రియాలను పరిపుష్టం చేస్తుంది. శుక్రాన్ని తగ్గిస్తుంది. రుచి కోల్పోయిన నాలుకను ఉత్తేజితం చెందిస్తుంది.

ఉప్పు:-

ఆహారానికి రుచినందించే ఉప్పు వాతహరిణిగా ఉపయోగపడుతుంది. మలబద్దకాన్ని నివారించి ఆకలిని పెంపొదిస్తుంది. కఫాన్ని, కంటి ఎరుపుదనాన్ని తగ్గిస్తుంది. శుక్రనాశకంగా పనిచేస్తుంది. కారం

ద్రవరూప మలాన్ని గట్టిపడేలా చేస్తుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. పేగుల్లోని పురుగులను చంపి ఆకలిని పెంచుతుంది. రుచిని పుట్టిస్తుంది. దురదలను

కఫహరం, పిత్తహరం, క్రిమిహరం, జ్వరహరం, విషానికి విరుగుడుగా కూడా పనిచేస్తుంది. తల్లిపాలలోని దోషాలను తగ్గిస్తుంది. దప్పికను, దురదలను, మంటలను పోగొడుతుంది. చర్మవ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

వగరు:-

శ్లేష్మ, రక్త, పిత్తాల బాధలను తగ్గిస్తుంది. గాయాలను మాన్పుతుంది. అధిక స్రావాలను ఆపుతుంది. ఎక్కువగా తీసుకుంటే మాత్రం శుక్రకణాలను నష్టపరుస్తుంది. ఉగాది పచ్చడిలో

వేపపూవు ఈ పచ్చడిలోని ప్రధాన ద్రవ్యం. దీనికి అనుబంధంగా బెల్లం తదితర రుచులను కలుపుతారు. అవి అందించే ఆరోగ్యం ఏంటో చూద్దాం. బెల్లం (తీపి)

జిడ్డు లక్షణం కలిగిన బెల్లం వాతాన్ని తగ్గించి శరీరానికి బలాన్నిస్తుంది. వీర్యవృద్ధి కలిగిస్తుంది. కొత్త చింతపండు

పులుపు:

తేలికగా ఉండే చింతపండు కూడా వాతాన్ని తగ్గిస్తుంది. విరేచన కారకం. వాపును పక్వం చేస్తుంది.

చేదు:-

కఫహరం, విషహరం. మలమూత్రాలలో ఇబ్బందులను తొలగిస్తుంది. మిరియాలు (కారం)

ఉప్పు:-

కఫవాత హరం. ఆకలిని పెంచుతుంది. శుక్రకణ నాశిని. వేపపూవు (చేదు)

కఫ పిత్తాలను తగ్గిస్తుంది. ఆకలిని పెంచుతుంది. దగ్గు, వ్రణాలు, జ్వరానికి చాలా మంచిది. చర్మవ్యాధులను తగ్గిస్తుంది. పచ్చిమామిడి ముక్కలు (వగరు)

కషాయరసం కలిగినది. విరేచనాలను తగ్గిస్తుంది. బహుమూత్రత్వాన్ని నిరోధిస్తుంది. గుండెకు మేలు చేస్తుంది. ఆరోగ్యపరంగా ఇన్ని రకాలుగా ప్రయోజన కారి అయిన ఉగాది పచ్చడి మన సంప్రదాయం అందించిన ప్రకృతి ఔషధంగా చెప్పవచ్చు. ఈ పచ్చడిని ఇష్టంగా ఆరగించి, నూతన సంవత్సరంతో పాటు నూతనోత్తేజాన్ని, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆహ్వానిద్దాం.

Also read : వైకుంఠ ఏకాదశి

Please share it

3 thoughts on “Ugadi Festival in Telugu – ఉగాది పండుగ విశిష్టత”

Leave a Comment