Venkateswara Vajra Kavacham in Telugu
శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచం మార్కండేయ మహర్షి స్వరపరచిన స్తోత్రం. ఇది మార్కండేయ పురాణంలో వుంది. ‘వేంకటేశ్వర వజ్ర కవచం జపించడం వల్ల భక్తుడు అకాల మరణం, మృత్యుభయం, మరియు ఇతర అన్ని రకాల సమస్యలు, దురదృష్టాలు మొదలైన వాటి నుండి రక్షించే వజ్ర కవచంలా పనిచేస్తుందని చెబుతారు.
శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచం
మార్కండేయ ఉవాచ
నారాయణం పరబ్రహ్మ సర్వకారణకారణమ్ |
ప్రపద్యే వేంకటేశాఖ్యం తదేవ కవచం మమ || 1 ||
సహస్రశీర్షా పురుషో వేంకటేశశ్శిరో వతు |
ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణాన్ రక్షతు మే హరిః || 2 ||
ఆకాశరాట్సుతానాథ ఆత్మానం మే సదావతు |
దేవదేవోత్తమో పాయాద్దేహం మే వేంకటేశ్వరః || 3 ||
సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజానిరీశ్వరః |
పాలయేన్మాం సదా కర్మసాఫల్యం నః ప్రయచ్ఛతు || 4 ||
య ఏతద్వజ్రకవచమభేద్యం వేంకటేశితుః |
సాయం ప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః || 5 ||
ఇతి మార్కండేయ కృత శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచం స్తోత్రం సంపూర్ణం |
Also read :సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం