4 mukhi rudraksha benefits in telugu
నాలుగు ముఖాలుగల రుద్రాక్షను చతుర్ముఖి అంటారు. చతుర్ము ఖి బ్రహ్మస్వరూపము, వేదాలను తన నాలుగు ముఖాలద్వారా పారాయణ చేసిన తొలిపురుషుడు, వేదవిదుడు బ్రహ్మ.ఇతడు సృష్టికర్త. చాతుర్వర్ణముల మానవులని తన దేహము నుండి సృష్టించాడు.
ఈ రుద్రాక్షను కొనాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి చతర్ముకి రుద్రాక్ష
ఇతడు జ్ఞానప్రదాత. దీనిని బ్రహ్మజ్ఞానము అంటారు. ధర్మ, అర్ధ, కామ, మోక్షములు అనేవి నాలుగు పురుషార్ధములు. వీటిని అనుగ్రహించేవాడు శివుడు. ఈ ధర్మ, అర్ధ, కామ, మోక్షాలనేవి చతుర్వేదాలనుండి వ్యక్తమయ్యాయి. ఈ చతుర్వేదముల ఏకైక వేదస్వరూపం శబ్దబ్రహ్మ. అతడే పరబ్రహ్మ అయిన రుద్రుడు. పరబ్రహ్మ అయిన రుద్రునిచే ఉపదేశించబడు బ్రహ్మ చతుర్ముఖాలచే పారాయణం చేయబడి అవి చతుర్వేదాలయ్యాయి. ఇందుచేత పరబ్రహ్మ రుద్రుని ప్రతిరూపమే చతుర్ము- బ్రహ్మ శిర స్వరూపుడైన ఆచతుర్ముఖ బ్రహ్మస్వరూపమే చతుర్ముఖి రుద్రాక్ష
చతుర్ముఖం తు రుద్రాక్షం చతుర్వక్షః స్వరూపకమ్
యధారణాచయద్వక్షః ప్రియతే తస్య నిత్యదా బ్రహ్మస్వరూపమైన చతుర్ముఖి
చతుర్ముఖాలుగల రుద్రాక్ష నాలుగు ముఖాలుగల బ్రహ్మ స్వరూపకము, దీనిని ధరించిన వారి పట్ల బ్రహ్మదేవుడు సంతుష్టుడై నిత్యజ్ఞానమును అనుగ్రహిస్తాడు’ అని కాలాగ్ని రుద్రుడు, భుసుండ మహర్షికి స్వయంగా చెప్పాడు. రుద్రాక్షకి అధిదేవత బుధుడు.బుధుడు బుద్ధి ప్రదాత. కనుక బుధగ్రహ దోషమున్నవారు యీ చతుర్ముఖి రుద్రాక్షను ధరించిన మానసిక స్వస్థత చేకూరుతుంది. బుద్ధి వికసిస్తుంది.
- దీనిని ధరించిన విద్యార్ధులకు జ్ఞాపకశక్తి యినుమడిస్తుంది.
- పండితులు, శాస్త్రజ్ఞులు, పరిశోధకులు, ఆచార్యులు దీనిని ధరిస్తే విశేష ప్రజ్ఞ కన్పరచగలరు.
- ఆరోగ్యము, అపారజ్ఞానము, సంఘగౌరవము, తర్క వితర్కములందు విజయము తధ్యము.
- నరహత్యాదోషము నశించి, ధర్మార్ధ కామ మోక్షములు సిద్ధించును. వశీకరణము లభిస్తుంది
చతుర్ముఖి రుద్రాక్ష రకములు:-
ఈ చతుర్ముఖి రుద్రాక్ష కూడా నాలుగు వర్ణములలో లభిస్తుంది.
- శ్వేతవర్ణ చతుర్ముఖి – ఆధ్యాత్మికులకు ధర్మ, అర్ధ, మోక్ష ప్రదాయిని
- రక్తవర్ణ చతుర్ముఖి – నరహత్యా పాతక నివారిణి
- పీతవర్ణ చతుర్ముఖి – దర్శనమాత్రానే నాలుగు పురుషార్ధాలు సిద్ధిస్తాయి.
- శ్యామ వర్ణ చతుర్ముఖి – సమస్త జ్ఞాన సంపదలు సిద్ధిస్తాయి
ధారణా మంత్రములు :-
- ఈ చతుర్ముఖి రుద్రాక్షను దీని అధిదేవత బుధుని ప్రీత్యర్ధం బుధవారం ఉదయం గం. 6 ల నుండి గం.7 ల లోపు ధరించవలెను.
- గురుపూర్ణిమ, దత్తజయంతి పర్వదినములలో బ్రహ్మముహూర్తకాలంలో ధరించుట శ్రేష్టము.
- రుద్రాభిషేక, అర్చనలు జరిపిన అనంతరం శివ పంచాక్షరీ మంత్రాన్ని స్మరిస్తూ ధరించాలి.
- బుధ గ్రహ దోషమున్నవారు బుధగ్రహ శాంతిపూజ, దానము జరిపి ధరించిన విశేష ఫలితం.
ఓం వ్రాం క్రాం తాం హాం ఈం – మూల మంత్రము
ఓం హ్రీం నమః
ఓం బ్రహ్మదేవాయ నమః
ఓం హ్రీం చతుర్ వక్రాశ్యాయనమః
చతుర్వక్షః స్వయంబ్రహ్మ, నరహత్యాం, దహతి క్షణాత్.
నాలుగు ముఖాల యీ స్వయంబ్రహ్మ నరహత్యాపాపాన్ని క్షణాల్లో దహిస్తాడు. సాక్షాత్తూ చతుర్వేదపురుషుడి స్వరూపంగా యీ చతుర్ముఖి అవతరించింది గనుకనే
చతుర్ముఖః స్వయంబ్రహ్మ నరహత్యాం వ్యపోహతి
చతుర్ముఖ రుద్రాక్ష స్వయంగా బ్రహ్మస్వరూపము కనుకనే యిది నరహత్యా పాతక దోషాన్ని కూడా నివారణ చేస్తుంది’ అని ఆ శివుడే తన పుత్రుడైన స్కందునికి స్వయంగా చెప్పాడు. కనుక యీ చతుర్ముఖి రుద్రాక్షను ధరించిన వారు బుధగ్రహ దోష నివారణ, నరహత్యాపాతక నివారణ పొంది బ్రహ్మజ్ఞాన స్వరూపులై భాసిస్తారు. దుఃఖాలకు అతీతులై సర్వసుఖాలు పొందుతారు.
ఈ సందర్భంగా…
దుఃఖాన్ని జయించడానికి ఆ ముక్కంటి చెప్పిన మూడు చిట్కాలు
అనే శివమహాత్మ్య గాధను తెలుసుకుందాం –
పూర్వం భృంగీశుడనే మునీశ్వరుడు పరమేశ్వరుని గురించి గొప్ప తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు.
“భృంగీశా! నీవు ఎందుకోసం ఇంత ఘోర తపస్సు చేశావు?” అని ఈశ్వరుడు అడిగాడు.
“పరమేశ్వరా! నేను అనేక రకాలయిన దుఃఖాలను అనుభవించి విసిగి, వేసారి, జీవితం మీద విరక్తి పొందాను. నన్ను కరుణించి దుఃఖరాహిత్యానికి నీవు నాకేదయినా ఉపాయం చెప్పు!” అని వేడుకున్నాడు.
అప్పుడు పరమేశ్వరుడు దుఃఖార్తుడయిన ఆ భృంగీశునికి దుఃఖ నివారణోపా యాన్ని ముచ్చటగా మూడే ముక్కల్లో చెప్పాడు.
“మునీంద్రా! నీవు మహాభోక్తా, మహాకర్తా, మహాత్యాగీ కావాలి!” అన్నాడు. మరి అప్పుడు ఈ భృంగీశుడు ముక్కంటి చెప్పిన ఆ మూడు ముక్కలను ఆచరించాడో లేదో, దుఃఖపీడనుంచి విముక్తుడయి సుఖశాంతులను పొందాడో లేదో తెలియదు.
కానీ, ఈ లోపల యుగాలు మారాయి. అయినా, మానవుణ్ణి పట్టి పీడించే ఈ దుఃఖబాధ తీరలేదు. కృతయుగం పోయింది. త్రేతాయుగం వచ్చింది. సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రునికి కూడా ఈ దుఃఖబాధ తప్పలేదు. దుఃఖభరితుడయి, జీవితం మీద విరక్తుడయ్యాడు. తమ కులగురువు అయిన శ్రీ వశిష్ఠ మునీంద్రుల శరణుజొచ్చాడు.
“గురుదేవా! నన్నీ దుఃఖం బారినుంచి రక్షించు!” అని వేడుకున్నాడు. అప్పుడాయన శ్రీరామచంద్రులవారికి ఆ భృంగీశుని వృత్తాంతం చెప్పాడు. మునుపు ఆ ముక్కంటి చెప్పిన ఆ మూడు ముక్కల ముచ్చటే చెప్పాడు.
శ్లో॥ సర్వాః శఠ్కాః పరిత్యజ ధైర్యమాలమ్బ్య శాశ్వతమ్
మహాభోక్తా మహాకర్తా మహాత్యాగీ భవనాఘ అన్నాడు.
“నాయనా రామచంద్రా! మునుపు ముక్కంటి ఆ భృంగీశునకు బోధించినట్లు నీవు కూడా మహాభోక్తా, మహాకర్తా, మహాత్యాగీ రావాలి! సమస్త సంశయాలను, సమస్త చింతలనూ పరిత్యజించి పరమశివుడు చెప్పిన ఈ మూడు వ్రతాలను ఆచరించి దుఃఖరహితుడవై శాశ్వత సుఖశాంతులను పొందు!” అని హితబోధ చేశాడు. ఇంతకీ ఈ మూడు ముక్కలకు అర్థం ఏమిటి? వీటి మూలం ఏమిటీ అని మనకు సందేహం కలుగుతుంది.
ఈ మూడు ముక్కల మూలంలోకీ, అంతరార్థంలోకి వెళ్ళి పరికిస్తే ఆ మూలసారంలో ఎంతో పరమార్ధతత్త్వం నిండి నిబిడీకృతమై ఉంది. ఈ మూడింటినీ వ్రతత్రయంగా అభివర్ణించారు శ్రీవసిష్ఠ మునీంద్రులు. ఈ మూడు వ్రతాలను నిత్యం ఆచరిస్తే నిన్ను ఎలాంటి దుఃఖమూ దరిజేరదని రామునికి హామీ ఇచ్చారు. ఈ వ్రతత్రయదీక్ష నీకు ‘శ్రీరామరక్ష’ అవుతుంది. బ్రహ్మానందం నీకు కొంగు బంగారమవుతుంది అని చెప్పారు. ఈ మూడు పట్టాలను నీవు చేపట్టితే సుఖశాంతులు చెట్టాపట్టాలు వేసుకొని నీ ఇంటి ముంగిట కాపురముం టాయని కూడా చెప్పారు. ఈ మూడు వ్రతాలకూ మూల మంత్రం ఒకటి ఉంది. నిజంగా చెప్పాలంటే కలిగి ఉండటం. ‘ఆత్మభావన’ను పొందాలంటే ముందు ‘దేహభావన సదా ‘ఆత్మభావన పోవాలి.
త్రినేత్రుడు భృంగీశునకు చెప్పినా, వశిష్ఠుడు రామునికి చెప్పినా, అష్టావక్రుడు జనకమహారాజుకు చెప్పినా, శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి చెప్పినా, మునీంద్రులు చెప్పినా, యతీంద్రులు చెప్పినా, కులగురువులు చెప్పినా, మతగురువులు చెప్పినా, యోగులు చెప్పినా, విరాగులు చెప్పినా, ఎవ్వరు చెప్పినా, ఏమి చెప్పినా – మూలసారం ఒకటే! నీవు ‘నీవు’ కావు. నీవు ఆత్మస్వరూపుడివి. నీవు పరబ్రహ్మ స్వరూపుడివి. చిద్రూపుడివి. అష్టావక్ర మునీశ్వరుడైతే
శ్లో.. నత్వం దేహో నతేదేహో భోక్తాకరావాభవాన్
చిద్రూపో సి సరాసాక్షీ నిరపేక్షః సుఖంచర..
నీవు పైకి కనిపించే ఈ దేహానివి కావు. ఈ దేహం నీది కాదు. నీకీ దేహంతో ఎలాంటి సంబంధం లేదు. నీవు చిద్రూపుడివి. నీవు కర్తవూ కాదు. భోక్తవూ కాదు. కేవలం సాక్షివి మాత్రమే! జరుగుతున్న దాన్నంతా నిరాపేక్షతో ఒక సాక్షిగా చూస్తుండు సుఖంగా ఉండు అన్నాడు.
చేష్టమానం శరీరం స్వం పశ్యత్యన్య శరీరవత్’ అని కూడా అన్నారు. నీ శరీరాన్ని అన్యులు శరీరమన్న భావనతో చూడు. నీ శరీరం, నీ ఇంద్రియాలూ, నీ మనస్సూ నీవి కావు. నీ ఇంద్రియాల చేష్టలనూ, నీ మనస్సు పోయే పోకళ్లనూ ఒక ‘సాక్షి’గా గమనిస్తూ ఉండాలి.
నిరంతరం ఇది ఒక సాధనగా జరగాలి. ఇలా చేస్తే క్రమంగా నీకు దేహభావం పోయి, ఆత్మభావం కలుగుతుంది.
ఈ ఆత్మభావన సదా కలగాలంటే ఏం చెయ్యాలో శ్రీకృష్ణ భగవానుడు గీతలో కొన్ని చిట్కాలు కూడా చెప్పాడు.
శ్లో .. నైన కించిత్కరోమితి యుక్త మన్యేత తత్త్వవిత్
పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిమ్రన్ అశ్నన్ గచ్చన్ స్వప్నన్ శ్వసన్
శ్లో|..లపన్ విసృజన్ గృహ్లాన్ ఉన్మిష న్నిమిషనపి
ఇంద్రియాణీంద్రియార్దేషు వర్తన ఇతి ధారయన్
ఆత్మతత్వం తెలిసిన యోగయుక్తుడు చూస్తున్నా, వింటున్నా, తాకుతున్నా, వాసన చూస్తున్నా, తింటున్నా, నడుస్తున్నా, నిద్రిస్తున్నా, శ్వాస వదులుతున్నా, మాట్లాడుతున్నా, విసర్జిస్తున్నా, గ్రహిస్తున్నా, కనులు తెరుస్తున్నా, మూస్తున్నా, ఇంద్రియాలే అవన్నీ చేస్తున్నాయి. కాని నేనేమీ చేయడం లేదనే భావిస్తాడు.
‘ఆత్మభావన కలిగినవాడు సాక్షిగా ఉంటాడు. చిత్తవృత్తులను వీక్షిస్తూ నిర్వికారుడై ఉంటాడు. మహాభోక్తా, మహాకర్తా, మహాత్యాగీ కావాలంటే ఈ విధమైన మానసిక స్థితి కలిగి ఉండాలి, సాక్షీభూతుడై ఉండాలి.
వశిష్ఠులవారు ఈ మూడు ప్రవృత్తుల లక్షణాలను ఈ విధంగా విపులీకరించారు. ‘మహాభోక్తా’
శ్లో . నాదత్తే హ్యిదదానశ్చ నాచరత్యా చరన్నది
భుజనో2 పి నయోభుజ్మే మహోభోక్తా స ఉచ్యతే..
ఆత్మలోనే ప్రతిష్ఠితులై, ఆత్మ సుఖానుభూతితో లీనమై ఉండేవారు తమ ఇంద్రియాలతో అన్నింటినీ గ్రహిస్తూనే, గ్రహించనివారుగా ఉంటారు. నిష్క్రియాబుద్ధితో వ్యవహరిస్తారు. కనుక తమ కాళ్లు చేతులతో క్రియలు ఆచరిస్తున్నా ఏమీ ఆచరింపని వారే అవుతారు. మహాభోక్తలు నిత్యం ఆత్మ సంతుష్టులై ఉంటారు. కనుక వారు భుజిస్తున్నా, భుజించనివారుగానే ఉంటారు. తాము భుజించే ఆహారం రుచిని పట్టించుకోరు. గంజినీళ్ళు త్రాగినా, మృష్టాన్నాలు భుజించినా ఒకే విధమైన తృప్తితో,
మహాకర్తా’ లక్షణాలు
శ్లో॥ సర్వత్ర విగత స్నేహో యఃసాక్షివదవస్థితః
నిరచ్చం వర్తతే కార్యే మహాకర్తా స ఉచ్యతే..
ఎన్ని కార్యాలు చేపట్టినా, మరెన్ని కర్మలు చేసినా వాటి మీద ఆసక్తిగానీ నేను వాటిని చేస్తున్నాననే భావం కానీ, వాటి మీద కోరికగానీ లేకుండా ప్రవర్తిస్తారు. కేవలం నిష్కామిగా, సాక్షీభూతుడుగా ఉంటాడు. అంటీముట్టనట్లు తామరాకు మీది నీటి బొట్టులా ఉంటాడు.
‘మహాత్యాగీ’ అన్నవాడు ఎలా ఉంటాడు, ఎలా ఉన్నవాడు ‘మహాత్యాగి’ అనబడు తాడో శ్రీవశిష్టులవారు శ్రీరామచంద్రునికీ విధంగా విశదీకరించారు.
శ్లో॥ సర్వేచ్ఛాః సకలాః శంకాః సర్వేహాః సర్వనిశ్చయాః
ధియా యేన పరిత్యక్తా మహాత్యాగీ స ఉచ్యతే..
ఎవడైతే అన్ని కోరికలనూ, సమస్తశంకలనూ, సమస్త చేష్టలనూ, సమస్త నిశ్చయా లనూ బుద్ధితో విడిచి పెట్టి కూటస్థ భావంతో ఉంటాడో అటువంటివాడు ‘మహాత్యాగీ’ అనబడుతాడు. మహాత్యాగీ కర్తృత్వాభిమానం (నేనే చేస్తున్నాననే భావం) భోక్తృత్వాభిమానం (నేనే అనుభవిస్తున్నాననే భావం) లేకుండా, నిర్లిప్తుడై, నిశ్చలానందంతో ఉంటాడు.
చెప్పినదంతా బాగు బాగు! మరి సమస్తచేష్టలనూ, అన్ని కోరికలనూ విడిచిపెట్టి సర్వసంగపరిత్యాగులమై చేతులు ముడుచుకొని కూర్చుంటే మా ఆలుబిడ్డల మాటేమిటి? మా ఉద్యోగ సద్యోగాలు, వ్యాపార సాపారాలు ఏమైపోతాయి? మాఆస్తి పాస్తులూ, మా ధనార్జనా ఏమి కానూ? ఇలా మనకు సవాలక్ష సందేహాలుకలుగుతాయి.
మనకొచ్చే ఈ ధర్మసందేహాలనూ, ఊగిసలాటనూ, మన యాంత్రిక జీవన శైలినీ ముందే ఊహించి వశిష్ఠులవారు భావితరాలవారి బాగుకోసం శ్రీరామచంద్రునికి చెప్పినట్లు ఇలా చెప్పారు. “రాజకుమారా రామచంద్రా! నీవు యోగివి కావాలంటే విరాగివి కానవసరం లేదు. నీవు హాయిగా భుజించు, త్రాగు, ఆనందంగా ఉండు. సర్వసుఖాలనూ అనుభవించు. కానీ ఎప్పుడూ ‘ఆత్మదృష్టి’ని అలవరచుకొని ‘మహాభోక్త’గా సుఖంగా ఉండు!
దుఃఖరాహిత్యానికి ఈ మూడు వ్రతాలతోపాటు ఆయన మరికొన్ని చిట్కాలు కూడా చెప్పాడు. నేను బాహ్యానికీ వ్యవహారాలు నడిపిస్తున్నా నడిపించనివాడిని, గృహస్థుడినైనా సన్యాసిని, వికారాలను విడిచినవాడిని, రాగం లేనివాణ్ణి, నిర్మలుణ్ణి, చిద్రూపుడ్లో అని నిరంతరం భావిస్తుంటే జీవుణ్ణి దుఃఖం దరిజేరదు. సుఖశాంతులు తొలగవంటూ ‘ఆత్మబోధ’ చేశారు. ఈ హితబోధ సర్వయుగాలకూ, సర్వకాలాలకూ,సర్వజాతుల వారికీ, సర్వకులాల వారికీ, సర్వమతాలవారికీ… సర్వమానవులకూ ఆచరణీయం సర్వేజనా సుఖినోభవంతు.
ఫలశ్రుతి:
చతుర్ముఖి రుద్రాక్ష ధరించినవారు సర్వదుఃఖాల నుండి విముక్తులై ఆ ముక్కంటి అనుగ్రహాన్ని పొందుతారు.
Also read : ఏకముఖి రుద్రాక్ష
4 thoughts on “4 mukhi rudraksha benefits in telugu – చతుర్ముఖి రుద్రాక్ష”