2 mukhi rudraksha benefits in telugu
ఇది రెండు ముఖాలు గల రుద్రాక్ష, ఈ రుద్రాక్ష్ అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీక. దీనిని “గౌరీశంకర రుద్రాక్ష” అని కూడా అంటారు.
రోహిణి, హస్త, శ్రవణం నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్షను ధరించాలి.
ఈ రుద్రాక్ష ను కొనాలంటే ఇక్కడ నొక్కండి. ద్విముఖి రుద్రాక్ష
రోహిణి, హస్త, శ్రవణం నక్షత్రం వారు ధరించవలసిన మాల ముత్యాలమాల
ద్వివక్షంతు మునిశ్రేష్ఠం చార్ధనారీశ్వరాత్మకమ్ ధారణా దర్ధనారీశం ప్రియతేతస్య నిత్యశః
‘ఓ మునిశ్రేష్ఠుడా… రెండు ముఖాలుగా గల యీ రుద్రాక్ష అర్ధనారీశ్వర ఆత్మస్వరూపానికి ప్రతిరూపము. దీనిని ధరించిన ధారకులు ఆ అర్ధనారీశ్వరునికి ప్రియులై నిత్య సంతోషాన్ని పొందుతారు’ అని సాక్షాత్తూ శివుడే భుసుండమహర్షికి యీ ద్విముఖ రుద్రాక్ష గురించి చెప్పాడు.
- దీనిని దేవీ ప్రతిరూపంగా భావిస్తారు.
- ఇది పరబ్రహ్మ తొలిసాకార (అర్ధనారీశ్వర) రూప ప్రతిరూపం కనుక ‘బ్రహ్మ’ రుద్రాక్షగా భావిస్తారు.
- ఈ రుద్రాక్షకు గ్రహాధిపతి చంద్రుడు కాన చంద్రగ్రహ దోషజాతకులు ధరిస్తే శుభం కలుగుతుంది.
- ఇది మనిషిలోని కుండలినీ శక్తిని ఉద్దీపం చేస్తుంది.
- ఇది ధరించిన విధి నిర్వహణలో ఏకాగ్రత కుదురుతుంది.
- ఇది ధరించిన వారి జీవితంలో వడిదుడుకులు తొలగి మనశ్శాంతి లభిస్తుంది.
- ఆధ్యాత్మిక శక్తి లభిస్తుంది.
- గర్భిణులు దీనిని కుడిచేతికి ధారణ చేస్తే సుఖప్రసవమవుతుంది.
- వ్యాపారాభివృద్ధి, వశీకరణ శక్తి, సర్వపాపహరణం, అద్భుతమైన రాణింపు, వ్యవహారజయం, సర్వాభీష్టసిద్ధి చేకూరుతుంది
ధారణా మంత్రము, వివిధ రకాలు
ద్విముఖి రుద్రాక్షలలో కూడా నాలుగు రకాలు లభిస్తాయి.
- శ్వేతవర్ణ ద్విముఖి … అకాల మృత్యుహరణం
- రక్తవర్గ ద్విముఖి … సర్వపాపహరణం
- పీతవర్ణ ద్విముఖి … సర్వకామార్ధసిద్ధి
- శ్యామవర్ణ ద్విముఖి … ఐశ్వర్యప్రాప్తి … సర్వోపద్రవనా శని
ద్విముఖి రుద్రాక్షను గురుపూర్ణిమ లేదా దత్తజయంతినాడు బ్రహ్మీముహూర్త సమయమునందు ధరించుట శ్రేష్ఠము. అంతే గాకుండా కార్తీక మాసములో గురువారము లేదా శుక్రవారము నాడు సూర్యోదయ కాలము అనగా ఉదయం 6 నుండి 7 గంటలు మధ్యకాలంలో మాలాధారణ చేయుట శుభము.
- ధారణకి ముందు ద్విముఖి రుద్రాక్షకి రుద్రాభిషేకం పూజాకార్యక్రమం నిర్వర్తించవలెను.
ధారణకు ముందు శివపంచాక్షరీ మహామంత్రము ‘ఓం నమఃశివాయ‘ నూట ఎనిమిది సార్లు స్మరించవలెను.
దీని ధారణ మంత్రములు
ఓం క్రీం హ్రీం క్రైం బ్రీం ఓం మూల మంత్రము …..
ఓం శ్రీ గౌరీ శంకరాయ నమః
ఓం శంభవే నమః *
ఓం కం ద్వి వక్రాశ్యా *
ద్వివ .దేవ దే వ్యాస్యా ద్వివిధం నాశయేదఘమ్ దే
(ద్విముఖి దేవి, దేవతల రూపాలతో సర్వపాపాలనూ నాశనం చేస్తుంది. )
ఇంతటి మహిమాన్విత శక్తిగల యీ ద్విముఖిని మతిస్థిమితం లేని వారిచేత పౌర్ణమినాడు ధరింపజేస్తే తప్పక స్వస్థత చేకూరుతుంది. దీనిని ధరించినవారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది.
అంతేకాదు. ‘ద్వివక్రో దేవ దేవేశ గోవధం నాశయత్ ధ్రువమ్’ అని శివుడే స్వయంగా తెలిపినందున ద్విముఖి రుద్రాక్ష ధారణ సర్వశుభకరం. సర్వపాపహరణం.
Also read : ఏకముఖి రుద్రాక్ష