Ardhanareeswara Stotram in Telugu
అర్ధనారీశ్వరుడు అనగా శివుడు మరియు పార్వతి ఇద్దరూ కలిసి ఉన్న రూపము. కుడి సగం శివుడిది, ఎడమ సగం శక్తి అనగా పార్వతి దేవిది. విశ్వంలో శివ మరియు శక్తి విడదీయరానివని అర్ధనరిశ్వర రూపం వర్ణిస్తుంది. అర్ధనారిశ్వర ఈ స్తోత్రంను శ్రీ ఆది శంకరాచార్యులు రచించారు. భక్తితో అర్ధనారీశ్వర స్తోత్రం జపించే వ్యక్తికి దీర్ఘాయువు ఉంటుందని, గొప్ప గౌరవం లభిస్తుందని, అదృష్టం ఉంటుంది.
అర్ధనారీశ్వర స్తోత్రం
చాంపేయ గౌరార్ధ శరీరకాయై, కర్పూర గౌరార్ధ శరీరకాయ |
ధమ్మిల్లకాయయై చ జటాధరాయ, నమఃశివాయై చ నమఃశివాయ || 1||
కస్తూరికా కుంకుమచర్చితాయై, చితారజఃపుఞ్జ విచర్చితాయా
కృతస్మరాయై వికృత స్మరాయ, నమఃశివాయై చ నమఃశివాయ || 2 ||
ఝణత్క్వణత్కంకణ నూపురాయై పాదాబ్జరాజత్ఫణినూపురాయ
హేమాంగదాయై భుజగాన్గదాయై, నమఃశివాయై చ నమఃశివాయ || 3 ||
విశాలనీలోత్పల లోచనాయై వికాసిపంకేరుహలోచనాయ
సమేక్షణాయై విషమేక్షణాయై, నమఃశివాయై చ నమఃశివాయ || 4 ||
మందారమాలా కలితాలకాయై కపాలమాలంకిత కన్దరాయై
దివ్యాంబరాయై చ దిగంబరాయ , నమఃశివాయై చ నమఃశివాయ || 5||
ఆంబొదరశ్యామల కుంతలాయై తటిత్ప్రభాతామ్రజటాధరాయ
నిరీశ్వరాయ నిఖి లేశ్వరాయ, నమఃశివాయై చ నమఃశివాయ || 6 ||
ప్రపంచసృష్ట్యున్ముఖలాస్యకాయై సమస్తసంహారక తాండవాయా
జగత్జన న్యై జగదేక పిత్రే, నమఃశివాయై చ నమఃశివాయ || 7 ||
ప్రదీప్తరత్నొ జ్వల కుండలాయై, స్పురన్మ హా పన్నగ భూషణాయ
శివాన్వి తాయై చ శివాన్వి తాయ, నమఃశివాయై చ నమఃశివాయ || 8 ||
ఫలస్తుతి
ఏతత్పఠేదష్టక మిష్టధంయో భక్త్యాసమాన్యో భువిధీర్ఘజీవీ
ప్రాప్నో తి సౌభాగ్య మనన్త కాలం భూయాత్సదా తస్య సమస్త సిద్ధిః || 9||
ఇతి శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచితం అర్ధనారీశ్వర స్తోత్రం సంపూర్ణం ||
భక్తితో అర్ధనారీశ్వర స్తోత్రం జపించే వారు సుదీర్ఘమైన, గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతారు అనునది ఫలస్తుతి సారంశాము.
Also read : శ్రీ రంగనాథాష్టకం
1 thought on “Ardhanareeswara Stotram in Telugu | అర్ధనారీశ్వర స్తోత్రం”