Ardhanareeswara Stotram in Telugu | అర్ధనారీశ్వర స్తోత్రం

YouTube Subscribe
Please share it

Ardhanareeswara Stotram in Telugu

అర్ధనారీశ్వర స్తోత్రం ముఖ్య ప్రయోజనాలు:-

భార్యాభర్తల మధ్య ఎలాంటి మనస్పర్ధలు, గొడవలు ఉన్నా అవి తొలగిపోయి, వారి మధ్య అన్యోన్యత, ప్రేమ పెరుగుతాయి. శివపార్వతుల వలె వారు ఒకరిలో ఒకరు కలిసి ఉంటారు. వివాహం ఆలస్యం అవుతున్న అబ్బాయిలకు లేదా అమ్మాయిలకు, ఈ స్తోత్ర పారాయణం వలన వివాహ ఆటంకాలు తొలగిపోయి, త్వరగా మంచి భాగస్వామి లభిస్తారని నమ్మకం. కుటుంబంలో తరచూ కలహాలు, అశాంతి ఉన్నవారు ఈ స్తోత్రాన్ని పఠిస్తే, ఇంట్లో శాంతి, సంతోషం నెలకొంటాయి. సంతానం కోసం ఎదురుచూసే దంపతులు ఈ స్తోత్రాన్ని పఠించడం వలన వారికి సంతాన భాగ్యం కలుగుతుందని విశ్వసిస్తారు.తెలిసీ తెలియక చేసిన పాపాల నుండి విముక్తి లభిస్తుంది. దీనిని పఠించడం ద్వారా మానసిక ఒత్తిడి తగ్గి, ప్రశాంతత లభిస్తుంది. అష్టైశ్వర్యాలు: శివ మరియు శక్తి ఇద్దరి అనుగ్రహం ఒకేసారి లభించడం వలన, సాధకునికి ఆరోగ్యం, సంపద మరియు కీర్తి (అష్టైశ్వర్యాలు) కలుగుతాయి. అంతిమంగా, ఈ స్తోత్రం భౌతిక సుఖాలనే కాకుండా, ఆధ్యాత్మిక పురోగతి కల్గుతుంది.

అర్ధనారీశ్వర స్తోత్రం

చాంపేయ గౌరార్ధ శరీరకాయై, కర్పూర గౌరార్ధ శరీరకాయ |
ధమ్మిల్లకాయయై చ జటాధరాయ, నమఃశివాయై చ నమఃశివాయ || 1||

కస్తూరికా కుంకుమచర్చితాయై, చితారజఃపుఞ్జ విచర్చితాయా
కృతస్మరాయై వికృత స్మరాయ, నమఃశివాయై చ నమఃశివాయ || 2 ||

ఝణత్క్వణత్కంకణ నూపురాయై పాదాబ్జరాజత్ఫణినూపురాయ
హేమాంగదాయై భుజగాన్గదాయై, నమఃశివాయై చ నమఃశివాయ || 3 ||

విశాలనీలోత్పల లోచనాయై వికాసిపంకేరుహలోచనాయ
సమేక్షణాయై విషమేక్షణాయై, నమఃశివాయై చ నమఃశివాయ || 4 ||

మందారమాలా కలితాలకాయై కపాలమాలంకిత కన్దరాయై
దివ్యాంబరాయై చ దిగంబరాయ , నమఃశివాయై చ నమఃశివాయ || 5||

ఆంబొదరశ్యామల కుంతలాయై తటిత్ప్రభాతామ్రజటాధరాయ
నిరీశ్వరాయ నిఖి లేశ్వరాయ, నమఃశివాయై చ నమఃశివాయ || 6 ||

ప్రపంచసృష్ట్యున్ముఖలాస్యకాయై సమస్తసంహారక తాండవాయా
జగత్జన న్యై జగదేక పిత్రే, నమఃశివాయై చ నమఃశివాయ || 7 ||

ప్రదీప్తరత్నొ జ్వల కుండలాయై, స్పురన్మ హా పన్నగ భూషణాయ
శివాన్వి తాయై చ శివాన్వి తాయ, నమఃశివాయై చ నమఃశివాయ || 8 ||

ఫలస్తుతి

ఏతత్పఠేదష్టక మిష్టధంయో భక్త్యాసమాన్యో భువిధీర్ఘజీవీ
ప్రాప్నో తి సౌభాగ్య మనన్త కాలం భూయాత్సదా తస్య సమస్త సిద్ధిః || 9||

ఇతి శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచితం అర్ధనారీశ్వర స్తోత్రం సంపూర్ణం ||

భక్తితో అర్ధనారీశ్వర స్తోత్రం జపించే వారు సుదీర్ఘమైన, గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతారు అనునది ఫలస్తుతి సారంశాము.

 Also readశ్రీ రంగనాథాష్టకం 

Please share it

Leave a Comment