దేవి ఖడ్గమాలా స్తోత్రం – Devi khadgamala stotram
సకల పాపాలు తొలగించి, సకల దుఃఖాలు తొలగించి నిత్యం మనల్ని రక్షించే, అపూర్వ స్తోత్రం శ్రీ దేవీ ఖడ్గమాలా స్తోత్రం. ఈ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో విన్న పఠించిన, సకల దోషాలు తొలగుతాయి, సంపదలు కలుగుతాయి. ఏ పనిలో అయినా విజయం లభిస్తుంది.
ఖడ్గమాలా స్తోత్రం పూర్తిగా శ్రీ చక్రం యొక్క వర్ణన. శ్రీ చక్రం లో మొత్తం తొమ్మిది ఆవరణలు ఉన్నాయి. ఆ తొమ్మిది ఆవరణలో ఉండే దేవతల స్తోత్రమే ఖడ్గమాల స్తోత్రం.
ఖడ్గమాల స్తోత్రం చదివినట్లయితే శ్రీచక్రాన్ని ఉపాసించినటువంటి ఫలితం ఉంటుంది. వీటిని చదవాలంటే అక్షర దోషం లేకుండా నేర్చుకొని చదివితే మంచిది. అలాగే చదివేటప్పుడు ఉచ్చారణ దోషాలు లేకుండా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల సర్వ శక్తులు పీడా హరణం జరుగుతుంది. అంతేకాదు మన మనోభీష్టాలు కూడా నెరవేరుతాయి.
దేవి ఖడ్గమాల ను చదవటానికి కడు భక్తి ఉండాలి. ఎవరైనా స్త్రీలుగాని పురుషులుగాని ఖడ్గమాల పారాయణ చేయడానికి అర్హులే. అయితే నియమాల విషయానికి వస్తే స్నానం చేయకుండా ఖడ్గమాల ను ఎట్టి పరిస్థితుల్లోనూ చదవకూడదు.బయట ఉన్న ఆడవాళ్ళు నాలుగురోజులపాటు పారాయణ చేయకూడదు. మైల ఉన్న కాలంలో మాటవరసకి కూడా ఖడ్గమాల పారాయణ చేయకూడదు.
ఖడ్గమాల స్తోత్రం చాలా శక్తివంతమైనది దీనిని పారాయణ చేసే సమయంలో ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా చూసుకోండి. ఖడ్గమాల పారాయణ చేయు వారు మాంసాహారం తినకూడదు. అయితే కోరికలు లేని వారికి నియమాలు ఉండవు. ఎవరైతే కోరికలతో ఖడ్గమాల పారాయణ చేస్తారో వారు నియమాలు పాటించాలి.ముఖ్యవిషయం ఏమంటే అసుచిగా ఉన్నప్పుడు పారాయణం చేయకూడదు.
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః
ఓం నమః త్రిపురసుందరి
హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, నేత్రదేవి, అస్త్రదేవి, కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్నే, భేరుండే, వహ్నివాసిని, మహావజేశ్వరి, శివదూతి, త్వరితే, కులసుందరి, నిత్యే, నీల పతాకే, విజయే, సర్వమంగళే, జ్వాలామాలిని, విచిత్రే, శ్రీవిద్యే,
దక్షిణామూర్తిమయి. నారాయణమయి, బ్రహ్మమయి, సనకమయి, సనందనమయి, సనాతనమయి, సనత్కుమారమయి, సనత్సుజాతమయి, వశిష్టమయి,శక్తిమయి,పరాశరమయి, కృష్ణద్వైపాయనమయి, పైలమయి, వైశంపాయనమయి,జైమినిమయి, సుమంతుమయి, శ్రీశుకమయి, గౌడపాదమయి, గోవిందమయి, శ్రీవిద్యా శంకరమయి, పద్మపాదమయి, హస్తామలకమయి , త్రోటకమయి, సురేశ్వరమయి, విద్యారణ్యమయి , పరమేష్టిగురు శ్రీ____ మయి, పరమగురు శ్రీ___మయి, స్వగురు శ్రీ___మయి
త్రైలోక్యమోహన చక్రస్వామిని, ప్రకటయోగిని,
అణిమా సిద్ధే, లఘిమా సిద్ధే, మహిమా సిద్ధ, ఈశిత్వ సిద్ధే, వశిత్వ సిద్ధే, ప్రాకామ్య సిద్ధే,
భుక్తి సిద్ధ ఇచ్ఛా సిద్ధే, ప్రాప్తి సిద్ధే, సర్వకామ సిద్ధే ;
బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి , మాహేంద్రి, చాముండే, మహాలక్ష్మీ : సర్వసంక్షోభిణి, సర్వవిద్రావిణి, సర్వాకర్షిణి, సర్వవశంకరి, సర్వోన్మాదిని, సర్వమహాంకుశే, సర్వఖేచరి, సర్వబీజే, సర్వయోనే, సర్వత్రిఖండే – త్రిపురే
సర్వాశాపరిపూరక చక్రస్వామిని, గుప్తయోగిని కామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి, శబ్దాకర్షిణి, స్పర్శాకర్షిణి, రూపాకర్షిణి,రసాకర్షిణీ, గంధాకర్షిణి, చిత్తాకర్షిణి, ధైర్యాకర్షిణి, స్మృత్యాకర్షిణి, నామాకర్షిణి,బీజాకర్షిణి, ఆత్మాకర్షిణి, అమృతాకర్షిణి, శరీరాకర్షిణి త్రిపురేశి సర్వసంక్షోభణచక్ర స్వామిని, గుప్తతర యోగిని, అనంగకుసుమే, అనంగమేఖలే, అనంగమదనే, అనంగమదనాతురే, అనంగరేఖే,అనంగవేగిని, అనంగాంకుశే, అనంగమాలిని – త్రిపుర సుందరి
సర్వసౌభాగ్యదాయక చక్రస్వామిని, సంప్రదాయ యోగిని,సర్వ సంక్షోభిణి, సర్వ విద్రావిణి, సర్వా కర్షిణి, సర్వాహ్లాదిని, సర్వ సమ్మోహిని, సర్వస్తంభిని, సర్వ జృంభిణి, సర్వవశంకరి, సర్వ రంజని, సర్వోన్మాదిని, సర్వార్థ సాధిని,సర్వసంపత్తిపూరిణి, సర్వ మంత్రమయీ సర్వ ద్వంద్వక్షయంక త్రిపుర వాసిని, సర్వార్థసాధక చక్రస్వామిని, కుల యోగిని
సర్వసిద్ధిప్రదే, సర్వ సంపత్సటే, సర్వ ప్రియంకరి, సర్వ మంగళ కారిణి, సర్వ కామప్రదే,
సర్వ దుఃఖ విమోచని, సర్వ మృత్యు ప్రశమని, సర్వ విఘ్న నివారిణి, సర్వాంగ సుందరి,
సర్వ సౌభాగ్య దాయిని – త్రిపురా శ్రీ
సర్వరక్షాకర చక్రస్వామిని, నిగర్భయోగిని –
సర్వజే, సర్వశక్తే, సర్వైశ్వర్యప్రదాయిని, సర్వజ్ఞానమయి, సర్వవ్యాధి వినాశిని, సర్వాధార
స్వరూపే, సర్వపాపహలే , సర్వానందమయి, సర్వరక్షాస్వరూపిణి, సర్వ ఈప్సితార్ధప్రదే –
త్రిపుర మాలిని
సర్వ రోగ హర చక్రస్వామిని, రహస్య యోగిని –
వశిని, కామేశ్వరి, మోదిని, విమలే, అరుణే, జయిని, సర్వేశ్వరి,
కౌళిని – త్రిపురాసిద్దే
సర్వసిద్ధి ప్రద చక్రస్వామిని, అతిరహస్యయోగిని –
బాణినీ, చాపినీ, పాశినీ, అంకుశిని, మహాకామేశ్వరి, మహావజేశ్వరి, మహాభగమాలిని –
త్రిపురాంబికే
సర్వానందమయచక్రస్వామిని, పరాపరరహస్యయోగిని – మహా మహా కామేశ్వరి మహా శ్రీ
చక్ర నగర సామ్రాజ్జి మహ రాజు రాజేశ్వరి ప్రతాప భారతి పరబ్రహ్మ స్వరూపిణి నమస్తే
నమస్తే నమస్తే నమః – సౌః క్లీం ఐం శ్రీం హ్రీం ఐం
ఇవి కూడా చదవండి:- హనుమాన్ బాడబానల స్త్రోత్రం
2 thoughts on “Devi khadgamala stotram – దేవి ఖడ్గమాలా స్తోత్రం”