Karthika Somavara Vratham | కార్తీక సోమవారం వ్రత కథ

YouTube Subscribe
Please share it
1/5 - (1 vote)

   కార్తీక సోమవార వ్రత కథ | Karthika Somavara Vratham

         ఈ కార్తీక మాసంలో శివునికి ఇష్టమైనటువంటి కార్తీక సోమవార వ్రతం ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటారు. ఈ కార్తీకం లో వచ్చే ఏ సోమవారం ఈ రోజైనా సరే స్నానం జపాదులను ఆచరించేవారు అశ్వమేధ యాగాలు ఫలాన్ని పొందుతారు.కార్తీక సోమవారం నాడు ప్రత్యేకముగా సోమవార వ్రతాన్ని ఆచరిస్తారు. సోమవార వ్రత మహత్యం వశిష్టుడు జనకునికి ఇలా వివరిస్తాడు.ఈ వ్రతాన్ని ఏ జాతి వారైనా స్త్రీ, పురుషులు, ఎవరైనా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ఆ రోజంతా ఉపవాసం ఉండి నదీ స్నానం చేసి శక్తికొలది దాన ధర్మాలు చేసి శివుడికి బిల్వ పత్రాలతో పూజ చేసి సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత అల్పాహారం తీసుకోవాలి. ఈ విధంగా నిష్ఠగా ఉంటూ ఆ రాత్రి జాగారం చేసి జాగరణ సమయంలో శివ పురాణ పఠనం చేయాలి మరునాడు ఉదయము  నది స్నానం చేసి, నువ్వులు దానము చేసి పేదలకు అన్నదానము చేయాలి, అలా చేయలేనివారు ముగ్గురు బ్రాహ్మణులకు భోజనం పెట్టి ఆ తర్వాత గృహస్తు భోజనము చేయాలి. ఈ వ్రతం కేవలం అతిశయోక్తి మాత్రమే ఆధారపడి ఉంటుంది.

Karthika Somavara Vratham
Karthika Somavara Vratham

                  యమునా నది తీరంలో పరమపావనమైన ఒక దివ్య దేశం ఉన్నది. ఈ దేశాన్ని చిత్రవర్మ అనే రాజు పరిపాలన చేసేవాడు. స్కాందపురాణంలో ఇది కృతయుగానికి సంబంధించిన కథ గా చెప్పబడుచున్నది . చిత్రవర్మ రాజుకి మొత్తం ఎనిమిది మంది పుత్రులు, ఆ తర్వాత చివరగా ఒక పుత్రిక కలిగింది. ఇంత మంది పుత్రులు తరవాత అమ్మాయి పుట్టింది కాబట్టి చిత్రవర్మకు ఈమె మంటే అధిక వాత్సల్యం. అందువల్ల ఈ రాజు జ్యోతిష్య శాస్త్ర వేత్తలు ను పిలిపించి జాతకం మొత్తం చూపించి భవిష్యత్తు ఎలా ఉంటుంది ? అని అంటే అడిగాడు. జ్యోతిష్యులు చక్కగా ఈమె ఒక జాతకాన్ని పరిశీలించిన పిమ్మట ఈమె అన్ని సౌభాగ్యాలతో ను భాసిల్లుతుంది కాబట్టి ఈమెకు సీమంతిని అని పేరు పెట్టండి అని తీర్మానించారు. ఆ తర్వాత వాళ్ళు ఆమె  జాతక ఫలాలు ఈ విధంగా చెప్పారు, ఈమె గొప్ప  స్త్రీ అవుతుందని, సరస్వతీ వలె అన్ని కళలు లోనూ రాణిస్తుంది అని రతీదేవి వంటి సౌందర్యము, దమయంతి వంటి పాతివ్రత్య శోభ, ఉంటుంది అని, అరుంధతి వంటి తేజస్సు ఉంటుందని ఇలా అనేక రకముల వివరించారు. ఈమె యొక్క ఆయుష్షు గొప్పది సౌభాగ్యము గొప్పది అని చెప్పారు. ఐతే ఇక్కడ వచ్చిన చిక్కేమిటంటే అందరు పండితుల ఇదే అభిప్రాయం చెబితే ఒక్కరు మాత్రం వీళ్ళందరూ చెప్పారు కానీ నాకు మాత్రం జాతకంలో ఒక దోషం కనబడుతున్నది అని అన్నాడు. అదేమంటే వివాహమైన కొద్ది కాలానికే ఈమె భర్తను కోల్పోవలసి రావచ్చును అని సూచన చేశాడు రాజు కి. ఈ మాట వినగానే రాజు హతాశుడయ్యాడు. ఇది చాలా దుర్భరమైన ఎటువంటి మాట అందుకే మనసులోనే పెట్టుకున్నాడు. కాలము  గడుస్తోంది పాప పెరుగుతూ ఉంది. పెరిగేకొద్ది చదువులో ప్రావీణ్యం సంపాదించింది. శాస్త్ర గ్రంథాలలో ప్రావీణ్యం సంపాదించింది. ఒకరోజు హఠాత్తుగా ఈమె చెలికత్తెలలో ఒక ఆమె మాట్లాడుతూ ఇలా చెప్పింది. చిన్నప్పుడు మీ నాన్నగారు నీ జాతకం జ్యోతిష్యులకు చూపించినప్పుడు ఒక వార్త విన్నాము నీకు తెలుసా అని అడిగారు. నాకు తెలియదు అని చెప్పింది. అమ్మాయికి ఈ విషయం తెలియని ఇవ్వలేదు ఆమె తండ్రి. స్త్రీ చాపల్యం చేత ఆ చెలికత్తె చెప్పేసింది.” నీకు వివాహమైన కొద్ది కాలానికే భర్త దూరం అవుతాడట” అని ఈ మాటలు విన్న తర్వాత ఆమె చాలా బాధపడింది ఎందుకంటే వివాహ వయసు వస్తున్నది ఆమెకి. ఇప్పుడు ఏమి చేయాలా?  అని పరిపరివిధముల ఆమె ఆలోచిస్తూ ఉండగా ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. గురువులను ఆశ్రయించాలని ఇది చాలా ముఖ్యమైన విషయం కనుక ఏ సమస్య వచ్చినా భయపడకుండా ఎలా పరిష్కరించుకోవాలో తెలుసుకోవాలి ఎందుకంటే శాస్త్రములో సమస్యలతోపాటు పరిష్కార మార్గాలు చాలా ఉంటయి. వెంటనే ఈమె వాళ్ళ యొక్క గురువు ఐనటువంటి యజ్ఞవల్క్య మహాముని భార్య ను ఆశ్రయించింది. ఋషి పత్ని మైత్రేయి సామాన్యురాలు కాదు. ఉపనిషత్తుల లో ఈమె గురించి చెప్పబడుతున్నది ఈమె గొప్ప బ్రహ్మ జ్ఞాన సంపన్నురాలు. 

              అప్పుడు మైత్రేయి తల్లి !ఏమిటి నీ కోరిక? అనగా అప్పుడు ఆమె పాదములకు నమస్కరించి ఇలా అడిగింది తల్లి ఏ సత్కర్మ వల్ల చక్కని సౌభాగ్యం వర్ధిల్లుతుందో దీర్ఘ సుమంగళిత్వం లభిస్తుందో ఆ విధమైన సత్కర్మ ను చెప్పుము. ఎందుకనగా బహు శాస్త్రములు తెలిసిన దానవు అలాగే గురువు ద్వారా వచ్చిన ఉపాయాన్ని ఆచరించన వారు ధన్యులవుతారు కనుక నిన్ను శరణు వేడుతున్నాను కరుణించి దీర్ఘ సుమంగళీ అగునట్లుఅనుగ్రహం కావలెను. అప్పుడు మైత్రేయి కొంచెం సేపు ఆలోచించి శాస్త్రము లన్ని మననం చేసుకుని ఒక సరైన ఉపాయాన్ని సూచించింది. ఓ రాజకన్య విను, శ్రీ గౌరీ ని, శంకరుని నీలకంఠయుక్తముగా ఆరాధింపుము. ఎలాగంటే నీలకంఠుడు అని పరమేశ్వరునితో ఉన్న గౌరీ దేవిని ఆరాధించాలి. ఆరాధించడం వల్ల ఆపదలు భయాలు తొలగిపోతాయి. శుభ్రమైన వస్త్రాలు ధరించి ప్రాతఃకాల పూజ చేసి అటుపై పగలంతా నియమబద్ధంగా శివ స్మరణం చేసుకుంటూ ఇంద్రియాలను  నిగ్రహించికోవాలి, అలాగే వాక్కుని నిగ్రహించుకోవలి. కోపం పనికిరాదు అనవసరపు మాటలు మాట్లాడకూడదు. నిందా వాక్యములు చెయ్యకూడదు ఇవన్నీ కూడా నియమములు, శివ సంబంధమైన శాస్త్రములు ఏమి ఏమి చెప్పారో తెలుసుకుని కపటము లేని హృదయంలో ఆరాధన చేయాలి.ఆరాధన చేసేటప్పుడు శివ అష్టోత్తర శతనామావళి అలాగే గౌరీ అష్టోత్తర శతనామావళి కూడా చేయాలి. శివపార్వతులను ఇద్దరిని కలిపి ఆరాధించాలి.పూజ అనంతరం పవిత్ర జీవనం గడిపే వారికి భోజనం పెట్టి ముత్తైదువులకు పసుపు కుంకుమ అందించి, వస్త్రములు ఇచ్చి ఆరాధించాలి. ఇలా చేసే సమయంలో ఏవైనా ఆపదలు రావచ్చు ఏవైనా సమస్యలు రావచ్చు అయినప్పటికీ చలించ కూడదు. ప్రారబ్ద కర్మ తప్పించుకోవాలని చేసే వ్రతముల లో పరీక్షలు అధికంగా ఉంటాయి. అయినా వాటిని తట్టుకుని ఆచరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఇలా చేయటం వల్ల శివ పార్వతుల అనుగ్రహం వల్ల ఆ పదలు అనే సముద్రాన్ని సులభంగా దాటి పోతావు. నీకు ఇష్టం లేనిది నీ జీవితములో జరగనే జరగదు. ఇది శివ పూజ మహత్యం ఇలా శివ పూజ మహత్యం వల్ల ఏలాంటి సంఘటన నుంచైనా బయట పడతారు. అని చెప్పిన తనకు ఉపదేశం చేసినటువంటి గురు స్వరూపిణీ ఐన మైత్రేయికి, నమస్కరించి వ్రతం ఆచరించడం మొదలుపెట్టింది. అప్పటికీ వివాహం కూడా నిశ్చయం కాలేదు. కన్యగా ఉన్నప్పుడే గురువుల ద్వారా గ్రహించి వ్రతాచరణ చేయడం మొదలుపెట్టింది. నిత్యము సోమవార వ్రతం చేస్తున్నది.

                      ఇంతలో తండ్రి చక్కని ఒక సంబంధాన్ని తీసుకువచ్చాడు అది ఎటువంటి సంబంధం అంటే నలచక్రవర్తి వంశానికి చెందిన టువంటి యువకుడు. ఇంతకన్నా భాగ్యం ఏమున్నది అందుకే ఇది కృతయుగం నాటి కథ అని చెప్పవచ్చు. నల చక్రవర్తి అప్పటి రాజు నల చక్రవర్తి యొక్క భార్య పేరు దమయంతి, ఆ పుణ్య దంపతుల పుత్రుడు ఇంద్రసేన మహారాజు. ఆ ఇంద్రసేనుడు తనయుడు చంద్రాంగుడు. ఈయనే ఇప్పుడు వరుడిగా వచ్చాడు. అనగా నల చక్రవర్తి మనవడు. పైగా అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి వాడు ఈ సంబంధం బాగా నచ్చింది వివాహం నిశ్చయమైంది,  వివాహం కూడా జరిగింది. వివాహం జరిగిన కొద్ది రోజులకే అల్లుడికి యమున లో విహరించాలని కోరిక కలిగింది, అందుకు తగ్గట్లుగానే మామగారు ఏర్పాటు చేశారు. అల్లుడు యమునానదీ తీరంలో తన పరివారంతో సహా విహరిస్తున్న సమయంలో యమునా నది పొంగు ఉధృతమై పడవ కొట్టుకుపోయింది. వార్త వెంటనే రాజు గారికి తెలిసింది. మామగారు యమునా నది తీరానికి వచ్చి ఎంతో విలపించారు. ఈ సంఘటనకు పుర ప్రజలందరూ బాధపడ్డారు. అందరి మృతదేహాలు వచ్చాయి కానీ చంద్రాం గుడి మృతదేహం రాలేదు. అంటే మృతదేహం కూడా కొట్టుకు పోయింది అని భావించారు. అందరూ ఎంతగానో బాధ పడ్డారు. కూతురికి ఎలా చెప్పాలి ? అని బాధ పడ్డాడు రాజు మృతదేహం దొరకలేదు కాబట్టి చనిపోయాడు అని నిర్ధారణ చేయలేము. మరణించాడు అనటానికి సంపూర్ణ ఆధారాలు కనిపిస్తున్నాయి. ఈ మాట రాజు చెప్పలేక చెప్పినప్పటికీ గురువాక్యము మీద సంపూర్ణ విశ్వాసముతో శివరాధన కొనసాగిస్తూ భక్తిశ్రద్ధలతో ఉన్నది. వార్త తెలిసిన మహారాజు చాలా దుఃఖంలో ఉండిపోయాడు. ఆమె చేత రాచ కార్యములు కూడా విస్మరించాడు. ఇదే అదునుగా అతని దాయాదులు అతన్ని బంధించి చెరసాల పాలు చేశారు. రాజ్యాన్ని కైవసం చేసుకున్నారు. మాత్రం చెక్కుచెదరకుండా శివారాధన చేస్తోంది. అలా మూడు సంవత్సరములు గడిచిపోయాయి.

                యమునా నదిలో మునిగి పోయిన చంద్ర అంగదుడు చిత్రంగా ఆ నది యొక్క లోతుల్లోకి వెళ్ళి పోతూ ఉండగా కొందరు నాగ కన్యలు చూసి పట్టుకున్నారు. వాళ్లకి ఇతడి దివ్యమైన తేజస్సు చూసి ఏమనిపించిందో కానీ నాగలోకానికి తీసుకువెళ్లి ఉచితమైన ఉపచారములు చేసి, విశ్రాంతి ఇవ్వగా అక్కడికి నాగ రాజ్యాన్ని పాలించే తక్షకుడు వచ్చాడు. అతడు వచ్చి  అతిని చరిత్ర అంతా తెలుసుకుని, నువ్వు ఈ విధంగా క్షేమంగా అక్కడికి రావడం అన్నది అది నీ యొక్క సౌభాగ్యం అందులో సందేహం లేదు. నీవు బయట పడ్డావు అంటే నీకు దైవానుగ్రహం ఉంది. నువ్వు ఏ దేవతను ఆరాధిస్తారు అని చెప్పు అని అడిగాడు. అప్పుడు తన ఇష్ట దైవాన్ని తలచుకుని చంద్రగదుడు ఇలా చెప్పాడు. “ప్రపంచానికి దేవతలు కూడా ఎవరైతే దేవుడో ఎవడు ఈశ్వరుడు ఈశ్వరుడు ఆ సర్వేశ్వరుడు ఆ సాంబశివుడు నాకు ఇష్టమైన దైవము”  అని చెప్పాడు. అందుకు తక్షకుడు సంతోషించి  భక్తులను పూజించడం శివుడిని పూజించడం తో సమానం ‌. మా ఆతిథ్యం స్వీకరించి ఇక్కడే ఉండి పొమ్మని చెప్పాడు. చంద్ర అంగదుడు ఎన్ని ఉన్నప్పటికీ నాకు ఇద దశమి నా దేశానికి వెళ్లే ఏర్పాటు చేయమని ప్రార్థించాడు. అప్పుడు తక్షకుడు అన్ని ఏర్పాట్లు చేసి తన పరివారము మరియు ఒక గుర్రాన్ని ఇచ్చాడు. అది ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకు వెళ్ళగలదు. అన్న స్వీకరించి తన దేశానికి బయలుదేరాడు‌. తిరిగి వచ్చిన భర్తను చూసి ఆనందించిింది అది కూడా ఎలాగే అంటే ఆ రోజు సోమవారం వ్రతం చేసి శివుని యొక్క పార్థివ లింగాన్ని యమునా నదిలో కలపడానికి వెళుతుండగా గుర్రం మీద వస్తూ కనపడ్డాడు అ భర్త. శివపూజ మహిమ వల్ల తిరిగి తన భర్తను పొందింది.  తండ్రి ని బంధించిన శత్రువుులను ఓడించి తిరిగి తండ్రికి చెరసాల నుండి విముక్తి కలిగించాడు‌ విజయాన్ని కైవసం చేసుకున్నాడు.  సోమవారం వ్రతాన్ని నిష్టగా ఆచరించి ఎంతోమంది కష్టాలనుండి దూరమయ్యారు. కాబట్టి మీరు సోమవార వ్రతాన్ని ఆచరించి ధన్యుులు కండి.

ఇవి కూడా చదవండి : కార్తిక మాసం పూజా విదానం 

Please share it

Leave a Comment