Durga Apaduddharaka Stotram in Telugu-శ్రీ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం

YouTube Subscribe
Please share it
1/5 - (1 vote)

Durga Apaduddharaka Stotram in Telugu

దుర్గా అపాదుధారక స్తోత్రం చాలా శక్తివంత శ్లోకం. ఇది సిద్ధేశ్వర తంత్రం లోని ఉమామేశ్వర సంవాడంలో భాగం. శివుడు పార్వతి దేవికి ఈ స్తోత్రాన్ని ఉపదేశించెను. ఎవరైతే ఈ స్తోత్రాన్ని రోజుకు 3 సార్లు లేదా రోజుకు ఒక సారి లేదా ఒక చరణాన్ని రోజుకు ఒకసారి విశ్వాసం మరియు భక్తితో పఠిస్తే, అన్ని కష్టాల నుండి విముక్తి పొందుతారు, మరియు శాంతి, ఆనందం పొందుతారు అని పరమేశ్వరుడు పార్వతీ దేవి తో చెప్పాడట.

శ్రీ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం

నమస్తే శరణ్యే శివే సానుకమ్పే
నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే |
నమస్తే జగద్వంద్య పాదారవిందే
నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే || 1 ||

నమస్తే జగచ్చిన్త్య మానస్వరూపే
నమస్తే మహాయోగి విఙ్యానరూపే |
నమస్తే నమస్తే సదానంద రూపే
నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే || 2 ||

అనాథస్య దీనస్య తృష్ణాతురస్య
భయార్తస్య భీతస్య బద్ధస్య జన్తోః |
త్వమేకా గతిర్దేవి నిస్తారకర్త్రీ
నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే || 3 ||

అరణ్యే రణే దారుణే శత్రుమధ్యే
అనలే సాగరే ప్రాంతరే రాజ గేహే
త్వం ఏకా గతి ర్దేవి నిస్తార నౌకా
నమస్తే జగత్తారిణీ త్రాహి దుర్గే || 4 ||

అపారే మహదుస్తరేఽత్యన్త ఘోరే
విపత్ సాగరే మజ్జతాం దేహభాజామ్ |
త్వం ఏకా గతి ర్దేవీ నిస్తార హేతుర్
నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే || 5 ||

నమశ్చండికే చండ దుర్దండ లీలా
సముత్ ఖండి తాకండితా శేష శత్రో
త్వం ఏకా గతి ర్దేవి వినిస్తార బీజం
నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే || 6 ||

త్వమేకా సదారాధితా సత్యవాదిన్యనేకాఖిలా క్రోధనా క్రోధనిష్ఠా |
ఇడా పిఙ్గలా త్వం సుషుమ్నా చ నాడీ
నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే || 7||

నమో దేవి దుర్గే శివే భీమనాదే
సరస్వత్యరుంధత్యమెాఘ స్వరూపే
విభూతిః సతాం కాళరాత్రీః సతీ త్వం
నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే || 8 ||

శరణమసి సురాణాం సిద్ధవిద్యాధరాణాం
ముని మనుజ పశూనాం దస్యుభిస్త్రాసితానాం
నృపతి గృహ గతానాం వ్యాధిభిః పీడితానాం
త్వమసి శరణమేకా దేవి దుర్గే ప్రసీద || 9 ||

|| ఇతి సిద్ధేశ్వరతన్త్రే హరగౌరీసంవాదే ఆపదుద్ధారాష్టక స్తోత్రం సంపూర్ణం ||

Also read :శివ సువర్ణమాలా స్తుతి 

 

Please share it

Leave a Comment