Hanuman chalisa in telugu
The Hanuman Chalisa Telugu Lyrics (PDF) is a Hindu devotional song dedicated to Hanuman, a Hindu deity. The chalisa was written by Tulsidas in the 16th century. a Hindu deity who symbolizes strength and power. The poem is composed in Awadhi, a dialect of Hindi language. Tulsidas, the author of the Ramcharitmanas, the most popular work in Awadhi literature, wrote it in 1665.
The composition consists of 40 stanzas each with 20 or 21 syllables arranged into four lines. The first two lines rhyme and so do the third and fourth line. It has been sung as a hymn by people from various walks of life from time to time during prayers or other occasions.
హనుమాన్ చాలీసాను తులసీదాసు అవధీ భాషలో రచించాడని నమ్మబడుతున్నది. హనుమాన్ చాలీసాలో 40 శ్లోకములు ద్విపదలు గా ఈయన రచించాడు. కేవలం హనుమంతుని స్మరించటం వలన బుద్ధి బలం యశస్సు ధైర్యం నిర్భయత్వం రోగము లేకపోవుట వాక్సుద్ధి సాధ్యం కాని పనులు కూడా సునాయాసంగా సాధ్య పడుట, శత్రు నాశనము అఖండ ఐశ్వర్యం కలుగునని తులసీదాసు ఒక ద్విపదలో చెప్పాడు.
రామచరిత మానసము అనే గ్రంధము వ్రాసిన శ్రీ తులసి దాసుకు హనుమంతుని దర్శనం జరిగిన పిమ్మట ఆ ఆనందములో హనుమాన్ చాలీసా వ్రాసారని ప్రతీతి.
హనుమాన్ చాలీసా పఠించిన వారికి సర్వ కార్య సిద్ధి కలుగునని ప్రతీతి.
ముఖ్యంగా ఏలినాటి శని, అష్టమ శని గాని అర్ధాష్టమ శని గాని, శని మహర్దశ జరుగుతున్నప్పుడు, ఈ హనుమాన్ చాలీసాను రోజు 11 సార్లు పారాయణం చేసినట్లేతే, శని వలన కలుగు అనారోగ్యాలు తగ్గుముఖం పడతాయి. ఇలా పారాయణ చేయడం వల్ల ఏ అనారోగ్యమైన, చిటికెలో మాయం అవుతుంది. వెన్ను నొప్పి గా ఉన్నా, నడుము నొప్పి ఉన్నా కాళ్ళ నొప్పులు, పాదాల నొప్పులు ఉన్నా, ఒళ్ళు నొప్పులు తరుచుగా వస్తున్నా, బద్ధకం ఎక్కువగా ఉన్నా, అతినిద్ర వస్తూ ఉన్నా, ఏ పని చేయాలన్నా కూడా చెయ్యాలి అని అనిపించక పోవడం, వాయిదాలు వెయ్యటం, ఇలాంటి అలసత్వవాలు తొలగిపోవాలి అన్నా, మతిమరుపు తగ్గాలంటే, జుట్టు ఎక్కువగా రాలుతునప్పుడు, ఈ హనుమాన్ చాలీసా దివ్యంగా పనిచేస్తుంది. జ్వరాలకు అయితే ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది అని చెప్పుకోవచ్చు.
చిన్నపిల్లల అయితే అక్కడ ఇక్కడ తిరగడం స్కూల్ కి వెళ్లడం, ఎక్కడపడితే అక్కడ ఆడుకోవటం వలన తరచుగా అనారోగ్యాలు కలుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు తల్లిదండ్రులు హనుమాన్ చాలీసా చక్కగా 11 సార్లు పారాయణ చేసి, విభూతి బొట్లు నుదిటిన పెట్టినట్లయితే, ఎటువంటి అంటు వ్యాధులు కానీ జ్వరాలు కానీ, జలుబు దగ్గు లాంటి వ్యాధులు బాధించవు.ముఖ్యంగా రెండు మూడు సంవత్సరాల చంటి పిల్లలు నిద్రలో ఉలిక్కి పడటం, పళ్ళు కొరకడం, లేదా తీవ్రమైన నటువంటి పీడకలలు వచ్చి అవస్థ పడటం, లాంటివి జరిగినప్పుడు పిల్లలకు కనుక విభూతి మంత్రించి, హనుమాన్ చాలీసా 11 సార్లు పారాయణం చేసి, విభూతి బొట్టు పెట్టడం వల్ల దోషాలు అన్ని తొలగి ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాదు దేహాన్ని వజ్రతుల్యంగా తయారు చేస్తుంది.
మృగశిర నక్షత్రం ఆంజనేయ స్వామి వారికి అత్యంత ఇష్టమైనటువంటి నక్షత్రము. మృగశిరా నక్షత్రం ఉన్న రోజున స్వామి వారు సీతమ్మ వారిని దర్శనం చేసుకున్నారు. అందువలన ఈ రోజున 108 సార్లు పారాయణ చేయటం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయి. తమలపాకులకు ప్రతికూలతను అనుకూలంగా మార్చే శక్తి ఉంటుంది. ఎందుకంటే వేడి సమయాలలో చల్లగానూ, చల్లటి సమయాలలో వేడిగా ఉంటాయి. ఆంజనేయ స్వామి వారికీ ఆకు పూజ అంటే చాలా ఇష్టము. రోజూ 108 తమలపాకులతో ఆంజనేయ స్వామి వారిని పూజ చేసి రోజు ఈ హనుమాన్ చాలీసాను 11 సార్లు పారాయణ చేసినట్లయితే, వ్యాధిని గుర్తించలేకపోవడం, గుర్తిస్తే కానీ మందు తేలికపోవడం లాంటి, సందర్భాలలో, మనం తీసుకున్నటువంటి ఔషధాలు చక్కగా పనిచేసి, సత్ఫలితాలను ఇస్తాయి. ఇలాంటి స్తోత్రాలు వలన దైవికంగా బలపడటానికి మరియు, సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదిస్తుంది.ఇలా హనుమాన్ చాలీసాను రోజూ పారాయణ చేయడం వల్ల శ్రీరాముడి రక్ష మనకు లభిస్తుంది.
హనుమాన్ చాలీసా
ముందుగా రాముడి నీ స్మరించుకుందాం
శ్లోకం : శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.
దోహా
శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి ।
వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి ॥
అర్థం – శ్రీ గురుదేవుల పాదపద్మముల ధూళితో అద్దము వంటి నా మనస్సును శుభ్రపరుచుకుని, చతుర్విధ ఫలములను ఇచ్చు పవిత్రమైన శ్రీరఘువర (రామచంద్ర) కీర్తిని నేను తలచెదను.
బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార ।
బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార ॥
అర్థం – బుద్ధిహీన శరీరమును తెలుసుకొని, ఓ పవనకుమారా (ఆంజనేయా) నిన్ను నేను స్మరించుచున్నాను. నాకు బలము, బుద్ధి, విద్యను ప్రసాదించి నా కష్టాలను, వికారాలను తొలగించుము తండ్రీ
ధ్యానం
గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసమ్ ।
రామాయణ మహామాలా రత్నం వందే-(అ)నిలాత్మజమ్ ॥
యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ ।
భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్ ॥
చౌపాఈ
జయ హనుమాన జ్ఞాన గుణ సాగర ।
జయ కపీశ తిహు లోక ఉజాగర ॥ 1 ॥
అర్థం – ఓ హనుమంతా, జ్ఞానము మరియు మంచి గుణముల సముద్రమువంటి నీకు, వానరజాతికి ప్రభువైన నీకు, మూడులోకాలను ప్రకాశింపజేసే నీకు జయము జయము.
రామదూత అతులిత బలధామా ।
అంజని పుత్ర పవనసుత నామా ॥ 2 ॥
అర్థం – శ్రీరామునకు దూతవు, అమితమైన బలము కలవాడవు, అంజనీదేవి పుత్రుడిగా, పవనసుత అను నామము కలవాడవు నీవు
మహావీర విక్రమ బజరంగీ ।
కుమతి నివార సుమతి కే సంగీ ॥3 ॥
అర్థం – నీవు మహావీరుడవు, పరాక్రమముతో కూడిన వజ్రము వంటి దేహము కలవాడవు, చెడు మతి గల వారిని నివారించి మంచి మతి కలవారితో కలిసి ఉండువాడవు,
కంచన వరణ విరాజ సువేశా ।
కానన కుండల కుంచిత కేశా ॥ 4 ॥
అర్థం – బంగారురంగు గల దేహముతో, మంచి వస్త్రములు కట్టుకుని, మంచి చెవి దుద్దులు పెట్టుకుని, ఉంగరాల జుట్టు కలవాడవు నీవు
హాథవజ్ర ఔ ధ్వజా విరాజై ।
కాంథే మూంజ జనేవూ సాజై ॥ 5॥
అర్థం – ఒక చేతిలో వజ్రాయుధము (గద), మరొక చేతిలో విజయానికి ప్రతీక అయిన ధ్వజము (జెండా) పట్టుకుని, భుజము మీదుగా జనేయును (యజ్ఞోపవీతం) ధరించినవాడవు.
శంకర సువన కేసరీ నందన ।
తేజ ప్రతాప మహాజగ వందన ॥ 6 ॥
అర్థం – శంకరుని అవతారముగా, కేసరీ పుత్రుడవైన నీ తేజస్సును ప్రతాపమును చూసి జగములు వందనము చేసినవి.
విద్యావాన గుణీ అతి చాతుర ।
రామ కాజ కరివే కో ఆతుర ॥ 7 ॥
అర్థం – విద్యావంతుడవు, మంచి గుణములు కలవాడవు, బుద్ధిచాతుర్యము కలవాడవు అయిన నీవు శ్రీ రామచంద్ర కార్యము చేయుటకు ఉత్సాహముతో ఉన్నవాడవు.
ప్రభు చరిత్ర సునివే కో రసియా ।
రామలఖన సీతా మన బసియా ॥ 8॥
అర్థం – శ్రీరామచంద్ర ప్రభువు యొక్క చరిత్రను వినుటలో తన్మయత్వము పొంది, శ్రీ సీతా, రామ, లక్ష్మణులను నీ మనస్సులో ఉంచుకున్నవాడవు.
సూక్ష్మ రూపధరి సియహి దిఖావా ।
వికట రూపధరి లంక జలావా ॥ 9 ॥
అర్థం – సూక్ష్మరూపము ధరించి సీతమ్మకు కనిపించినవాడవు, భయానకరూపము ధరించి లంకను కాల్చినవాడవు.
భీమ రూపధరి అసుర సంహారే ।
రామచంద్ర కే కాజ సంవారే ॥ 10 ॥
అర్థం – మహాబలరూపమును ధరించి రాక్షసులను సంహరించినవాడవు, శ్రీరామచంద్రుని పనులను నెరవేర్చినవాడవు.
లాయ సంజీవన లఖన జియాయే ।
శ్రీ రఘువీర హరషి ఉరలాయే ॥ 11 ॥
అర్థం – సంజీవిని తీసుకువచ్చి లక్ష్మణుని బ్రతికించిన నీ వల్ల శ్రీరఘువీరుడు (రాముడు) చాలా ఆనందించాడు.
రఘుపతి కీన్హీ బహుత బడాయీ ।
తుమ మమ ప్రియ భరత సమ భాయీ ॥ 12 ॥
అర్థం – అంత ఆనందంలో ఉన్న శ్రీరాముడు నిన్ను మెచ్చుకుని, తన తమ్ముడైన భరతుని వలె నీవు తనకు ఇష్టమైనవాడవు అని పలికెను.
సహస్ర వదన తుమ్హరో యశగావై ।
అస కహి శ్రీపతి కంఠ లగావై ॥ 13 ॥
అర్థం – వేనోళ్ల నిన్ను కీర్తించిన శ్రీరాముడు ఆనందంతో నిన్ను కౌగిలించుకున్నాడు.
సనకాదిక బ్రహ్మాది మునీశా ।
నారద శారద సహిత అహీశా ॥ 14 ॥
యమ కుబేర దిగపాల జహాం తే ।
కవి కోవిద కహి సకే కహాం తే ॥ 15 ॥
అర్థం – సనకాది ఋషులు, బ్రహ్మాది దేవతలు, నారదుడు, విద్యావిశారదులు, ఆదిశేషుడు, యమ కుబేరాది దిక్పాలురు, కవులు, కోవిదులు వంటి ఎవరైనా నీ కీర్తిని ఏమని చెప్పగలరు?
తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా ।
రామ మిలాయ రాజపద దీన్హా ॥ 16 ॥
అర్థం – నీవు సుగ్రీవునికి చేసిన గొప్ప ఉపకారము ఏమిటంటే రాముని తో పరిచయం చేయించి రాజపదవిని కలిగించావు.
తుమ్హరో మంత్ర విభీషణ మానా ।
లంకేశ్వర భయే సబ జగ జానా ॥ 17 ॥
అర్థం – నీ ఆలోచనను విభీషణుడు అంగీకరించి లంకకు రాజు అయిన విషయము జగములో అందరికి తెలుసు.
యుగ సహస్ర యోజన పర భానూ ।
లీల్యో తాహి మధుర ఫల జానూ ॥ 16 ॥
అర్థం – యుగ సహస్ర యోజనముల దూరంలో ఉన్న భానుడిని (సూర్యుడిని) మధురఫలమని అనుకుని అవలీలగా నోటిలో వేసుకున్నవాడవు.
ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ ।
జలధి లాంఘి గయే అచరజ నాహీ ॥ 19 ॥
అర్థం – అలాంటిది శ్రీరామ ప్రభు ముద్రిక (ఉంగరమును) నోటకరచి సముద్రాన్ని ఒక్క ఉదుటన దూకావు అంటే ఆశ్చర్యం ఏముంది?
దుర్గమ కాజ జగత కే జేతే ।
సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే ॥ 20 ॥
అర్థం – జగములో దుర్గము వలె కష్టమైన పనులు నీ అనుగ్రహం వలన సుగమం కాగలవు.
రామ దుఆరే తుమ రఖవారే ।
హోత న ఆజ్ఞా బిను పైసారే ॥ 21 ॥
అర్థం – శ్రీరామ ద్వారానికి నీవు కాపలాగా ఉన్నావు. నీ అనుమతి లేకపోతే ఎవరైన అక్కడే ఉండిపోవాలి.
సబ సుఖ లహై తుమ్హారీ శరణా ।
తుమ రక్షక కాహూ కో డర నా ॥ 22 ॥
అర్థం – నీ ఆశ్రయములో అందరు సుఖముగా ఉంటారు. నీవే రక్షకుడవు అయితే ఇంకా భయం ఎందుకు?
ఆపన తేజ సమ్హారో ఆపై ।
తీనోం లోక హాంక తే కాంపై ॥ 23 ॥
అర్థం – నీ తేజస్సును నీవే నియంత్రిచగలవు. నీ కేకతో మూడులోకాలు కంపించగలవు.
భూత పిశాచ నికట నహి ఆవై ।
మహవీర జబ నామ సునావై ॥ 24 ॥
అర్థం – భూతములు, ప్రేతములు దగ్గరకు రావు, మహావీర అనే నీ నామము చెప్తే.
నాసై రోగ హరై సబ పీరా ।
జపత నిరంతర హనుమత వీరా ॥ 25 ॥
అర్థం – రోగములు నశిస్తాయి, పీడలు హరింపబడతాయి, ఓ హనుమంతా! వీరా! నీ జపము వలన.
సంకట సే హనుమాన ఛుడావై ।
మన క్రమ వచన ధ్యాన జో లావై ॥ 26 ॥
అర్థం – మనస్సు, కర్మ, వచనము చేత ధ్యానము చేస్తే సంకటముల నుంచి, ఓ హనుమంతా, నీవు విముక్తునిగా చేయగలవు.
సబ పర రామ తపస్వీ రాజా ।
తినకే కాజ సకల తుమ సాజా ॥ 27 ॥
అర్థం – అందరికన్నా తాపసుడైన రాజు శ్రీరాముడు. ఆయనకే నీవు సంరక్షకుడవు.
ఔర మనోరధ జో కోయి లావై ।
తాసు అమిత జీవన ఫల పావై ॥ 28 ॥
అర్థం – ఎవరు కోరికలతో నీవద్దకు వచ్చినా, వారి జీవితంలో అమితమైన ఫలితాలను ఇవ్వగలవు.
చారో యుగ ప్రతాప తుమ్హారా ।
హై ప్రసిద్ధ జగత ఉజియారా ॥ 29 ॥
అర్థం – నాలుగుయుగాలలో నీ ప్రతాపము ప్రసిద్ధము మరియు జగత్తుకు తెలియపరచబడినది.
సాధు సంత కే తుమ రఖవారే ।
అసుర నికందన రామ దులారే ॥ 30 ॥
అర్థం – సాధువులకు, సంతులకు నీవు రక్షకుడవు. అసురులను అంతము చేసినవాడవు, రాముని ప్రేమపాత్రుడవు.
అష్ఠసిద్ధి నవ నిధి కే దాతా ।
అస వర దీన్హ జానకీ మాతా ॥ 31 ॥
అర్థం – ఎనిమిది సిద్ధులు, తొమ్మిది నిధులు ఇవ్వగలిగిన శక్తి జానకీమాత నీకు వరంగా ఇచ్చినది.
రామ రసాయన తుమ్హారే పాసా ।
సదా రహో రఘుపతి కే దాసా ॥ 32 ॥
అర్థం – నీ వద్ద రామరసామృతం ఉన్నది. దానితో ఎల్లప్పుడు రఘుపతికి దాసునిగా ఉండగలవు.
తుమ్హరే భజన రామకో పావై ।
జన్మ జన్మ కే దుఖ బిసరావై ॥ 33 ॥
అర్థం – నిన్ను భజిస్తే శ్రీరాముడు లభించి, జన్మ జన్మలలో దుఃఖముల నుండి ముక్తుడను అవ్వగలను.
అంత కాల రఘుపతి పురజాయీ ।
జహాం జన్మ హరిభక్త కహాయీ ॥ 34 ॥
అర్థం – అంత్యకాలమున శ్రీరఘుపతి పురమునకు వెళితే, తరువాత ఎక్కడ పుట్టినా హరిభక్తుడని కీర్తింపబడుతారు.
ఔర దేవతా చిత్త న ధరయీ ।
హనుమత సేయి సర్వ సుఖ కరయీ ॥ 35 ॥
అర్థం – వేరే దేవతలను తలుచుకునే అవసరంలేదు. ఒక్క హనుమంతుడే సర్వసుఖాలు కలిగించగలడు.
సంకట క(హ)టై మిటై సబ పీరా ।
జో సుమిరై హనుమత బల వీరా ॥ 36 ॥
అర్థం – కష్టాలు తొలగిపోతాయి, పీడలు చెరిగిపోతాయి, ఎవరైతే బలవీరుడైన హనుమంతుని స్మరిస్తారో.
జై జై జై హనుమాన గోసాయీ ।
కృపా కరహు గురుదేవ కీ నాయీ ॥ 37 ॥
అర్థం – జై జై జై హనుమాన స్వామికి. గురుదేవుల వలె మాపై కృపను చూపుము.
జో శత వార పాఠ కర కోయీ ।
ఛూటహి బంది మహా సుఖ హోయీ ॥ 38 ॥
అర్థం – ఎవరైతే వందసార్లు దీనిని (పై శ్లోకమును) పఠిస్తారో బంధముక్తులై మహా సుఖవంతులు అవుతారు.
జో యహ పడై హనుమాన చాలీసా ।
హోయ సిద్ధి సాఖీ గౌరీశా ॥ 39 ॥
అర్థం – ఎవరైతే ఈ హనుమాన చాలీసాను చదువుతారో, వారి సిద్ధికి గౌరీశుడే (శివుడు) సాక్షి.
తులసీదాస సదా హరి చేరా ।
కీజై నాథ హృదయ మహ డేరా ॥ 40 ॥
అర్థం – తులసీదాసు (వలె నేను కూడా) ఎల్లపుడు హరికి (హనుమకు) సేవకుడిని. కాబట్టి నా హృదమును కూడా నీ నివాసముగ చేసుకో ఓ నాథా (హనుమంతా).
దోహా
పవన తనయ సంకట హరణ – మంగళ మూరతి రూప్ ।
రామ లఖన సీతా సహిత – హృదయ బసహు సురభూప్ ॥
సియావర రామచంద్రకీ జయ । పవనసుత హనుమానకీ జయ । బోలో భాయీ సబ సంతనకీ జయ ।
అర్థం – పవన కుమారా, సంకటములను తొలగించువాడా, మంగళ మూర్తి స్వరూపా (ఓ హనుమంతా), రామ లక్ష్మణ సీతా సహితముగా దేవతా స్వరూపముగా నా హృదయమందు నివసించుము.
మరింత సమాచారం : చాలీసా గురించి తెలుసుకోండి
ఇవి కూడా చదవండి : శ్రీ లలితా సహస్ర నామ స్త్రోతం