Hanuman Langoolastra Stotram in Telugu-శ్రీ హనుమాల్లాంగూలాస్త్ర స్తోత్రం

YouTube Subscribe
Please share it
Rate this post

Hanuman Langoolastra Stotram in Telugu

హనుమంతుడు దీర్ఘలాంగూలధారి. హనుమంతుని లాంగూలం రావణునిచే అగ్నిప్రదీప్తమై లంకను కాల్చి వేసింది. లాంగూలం  అనగా తోక. ఈ స్తోత్రం చదవడం వల్ల పీడ తొలగి పోతుంది. అందుకే హనుమత్ పూజలలో హనుమత్ వాలాగ్ర పూజకు ఒక ప్రత్యేకత ఉంది.  పూజ కోర్కెలను తీర్చగలదని,  అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది .హనుమాన్ లంగూలా స్తోత్రం హనుమంతుడిని తన తోకకు ప్రాముఖ్యతతో సంబోధించే ప్రార్థన. 

శ్రీ హనుమాల్లాంగూలాస్త్ర స్తోత్రం

హనుమన్నంజనీసూనో మహాబలపరాక్రమ |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || 1 ||

మర్కటాధిప మార్తాండమండలగ్రాసకారక |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || 2 ||

అక్షక్షపణ పింగాక్ష దితిజాసుక్షయంకర |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || 3 ||

రుద్రావతార సంసారదుఃఖభారాపహారక |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || 4 ||

శ్రీరామచరణాంభోజమధుపాయితమానస |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || 5 ||

వాలిప్రమథనక్లాంతసుగ్రీవోన్మోచనప్రభో |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || 6 ||

సీతావిరహవారాశిభగ్న సీతేశతారక |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || 7 ||

రక్షోరాజప్రతాపాగ్నిదహ్యమానజగద్వన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || 8 ||

గ్రస్తాశేషజగత్స్వాస్థ్య రాక్షసాంభోధిమందర |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || 9 ||

పుచ్ఛగుచ్ఛస్ఫురద్వీర జగద్దగ్ధారిపత్తన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || 10 ||

జగన్మనోదురుల్లంఘ్యపారావారవిలంఘన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || 11 ||

స్మృతమాత్రసమస్తేష్టపూరక ప్రణతప్రియ |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || 12 ||

రాత్రించరతమోరాత్రికృంతనైకవికర్తన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || 13 ||

జానక్యా జానకీజానేః ప్రేమపాత్ర పరంతప |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || 14 ||

భీమాదికమహావీరవీరావేశావతారక |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || 15 ||

వైదేహీవిరహక్లాంతరామరోషైకవిగ్రహ |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || 16 ||

వజ్రాంగనఖదంష్ట్రేశ వజ్రివజ్రావగుంఠన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || 17 ||

అఖర్వగర్వగంధర్వపర్వతోద్భేదనస్వర |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || 16 ||

లక్ష్మణప్రాణసంత్రాణ త్రాతతీక్ష్ణకరాన్వయ |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || 19 ||

రామాదివిప్రయోగార్త భరతాద్యార్తినాశన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || 20 ||

ద్రోణాచలసముత్క్షేపసముత్క్షిప్తారివైభవ |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || 21 ||

సీతాశీర్వాదసంపన్న సమస్తావయవాక్షత |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || 22 ||

ఇత్యేవమశ్వత్థతలోపవిష్టః
శత్రుంజయం నామ పఠేత్స్వయం యః |
స శీఘ్రమేవాస్తసమస్తశత్రుః
ప్రమోదతే మారూతజప్రసాదాత్ || 23 ||

ఇతి శ్రీ హనుమాల్లాంగూలాస్త్ర స్తోత్రం |

Also read :వశిష్ఠ కృత శివలింగ స్తుతి 

Please share it

Leave a Comment