Jo Achyutananda Lyrics in Telugu – జో అచ్యుతానంద జోజో ముకుందా

YouTube Subscribe
Please share it
5/5 - (1 vote)

Jo Achyutananda Lyrics in Telugu

Discover the enchanting Annamayya keerthana “Jo Achyutananda JoJo Mukunda” dedicated to Lord Venkateswara of Tirumala. Immerse yourself in the divine bliss of this popular devotional song and experience the spiritual essence of Tirumala. Listen now and let your soul be uplifted by the melodious tunes and profound lyrics.

జో అచ్యుతానంద జోజో ముకుందా

జో అచ్యుతానంద జోజో ముకుందా
రావె పరమానంద రామ గోవిందా ॥

అంగజుని గన్న మా యన్న యిటు రారా
బంగారు గిన్నెలో పాలు పోసేరా ।
దొంగ నీవని సతులు గొంకుచున్నారా
ముంగిట నాడరా మోహనాకార ॥

గోవర్ధనంబెల్ల గొడుగుగా పట్టి
కావరమ్మున నున్న కంసుపడగొట్టి ।
నీవు మధురాపురము నేలచేపట్టి
ఠీవితో నేలిన దేవకీపట్టి ॥

నందు నింటను జేరి నయము మీఱంగ
చంద్రవదనలు నీకు సేవ చేయంగ ।
నందముగ వారిండ్ల నాడుచుండంగ
మందలకు దొంగ మా ముద్దురంగ ॥

పాలవారాశిలో పవళించినావు
బాలుగా మునుల కభయమిచ్చినావు ।
మేలుగా వసుదేవు కుదయించినావు
బాలుడై యుండి గోపాలుడైనావు ॥

అట్టుగట్టిన మీగ డట్టె తిన్నాడే
పట్టి కోడలు మూతిపై రాసినాడే ।
అట్టె తినెనని యత్త యడగ విన్నాడే
గట్టిగా నిది దొంగ కొట్టుమన్నాడే ॥

గొల్లవారిండ్లకు గొబ్బునకుబోయి
కొల్లలుగా త్రావి కుండలను నేయి ।
చెల్లునా మగనాండ్ర జెలిగి యీశాయీ
చిల్లతనములు సేయ జెల్లునటవోయి ॥

రేపల్లె సతులెల్ల గోపంబుతోను
గోపమ్మ మీ కొడుకు మా యిండ్ల లోను ।
మాపుగానే వచ్చి మా మానములను
నీ పాపడే చెఱిచె నేమందుమమ్మ ॥

ఒకని యాలినిదెచ్చి నొకని కడబెట్టి
జగడములు కలిపించి సతిపతులబట్టి ।
పగలు నలుజాములును బాలుడై నట్టి
మగనాండ్ర చేపట్టి మదనుడై నట్టి ॥

అలిగి తృణావర్తు నవని గూల్చితివి
బలిమిమై బూతన బట్టి పీల్చితివి ।
చెలగి శకటాసురుని జేరి డొల్చితివి
తలచి మద్దులు రెండు ధరణి వ్రాల్చితివి ॥

హంగుగా తాళ్ళపాకన్నయ్య చాల
శృంగార రచనగా చెప్పె నీ జోల ।
సంగతిగ సకల సంపదల నీవేళ
మంగళము తిరుపట్ల మదనగోపాల ॥

Also read – శ్రీ సాయిబాబా ఏకాదశ సూత్రములు

Please share it

Leave a Comment