కార్తిక మాసం | Karthika Masam Pooja Vidhanam

YouTube Subscribe
Please share it
3.2/5 - (4 votes)

  కార్తిక మాసం | Karthika Masam Pooja Vidhanam

                      సంవత్సరంలో వచ్చే అన్ని మాసాలలో అతి పవిత్రమైన మాసం కార్తీక మాసం. ఆయా మాసాలలో చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరే ఆ మాసానికి వస్తుంది. కృత్తికా నక్షత్రంపై చంద్రుడు పూర్ణుడై ఉండటంవల్ల ఈ మాసానికి కార్తీకమాసం అని పేరు వచ్చింది. ఈ మాసంలో కృత్తిక నక్షత్రానికి, దీపారాధనకు, సోమవారాలకు, అధిక ప్రాధాన్యత ఉంది. దైవ సంబంధమైనవంటి వ్రతాలకు నోములకు ఉపవాసాలకు ఇత్యాది శుభకార్యములకు ఈ మాసం చాలా పవిత్రమైనది. యోగ సాధనకు ఈ మాసం చాలా అనువైనది ఎందుకంటే ఈ మాసంలో వాతావరణం నిర్మలంగా ప్రశాంతంగా  ఉంటుంది.  కార్తీక మాసంలో నదీ స్నానం చేయడం చాలా మంచిది, ఎందుకనగా నదులు ఉండే నీరు ఉదయం సూర్యరశ్మి వలన వేడెక్కుతుంది రాత్రి సమయాలలో చంద్రుడి కిరణాల వల్ల చల్లబడుతుంది. అంతేకాకుండా అడవులలోని ఔషధ మొక్కలు నదీ ప్రవాహంలో కలగటం వలన నీరు స్వచ్ఛంగా ఉంటుంది . అందువలన ఈ సమయంలో నదీస్నానం చేయడం వల్ల మన ఆహ్లాదకరంగా ఉండటంతోపాటు, చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. 

Karthika Somavara Vratham
Karthika Masam Pooja Vidhanam in telugu

                                   ఈ మాసంలో చెప్పుకోదగ్గ మరో అంశం దీపారాధన, ఈ మాసం ప్రారంభం నుండి సూర్యోదయానికి పూర్వమే లేచి నదీస్నానం ఆచరించి శుచియై పొడిబట్టలు ధరించి దీపారాధన చేయాలి. కార్తీకమాసంలో స్త్రీలు నదులలో, కోనేటిలో దీపాలు వదులుతారు. ఈ దీపాలు ఆకాశంలోని చుక్కలవలె ప్రకాశవంతంగా వెలుగుతూ శోభాయమానంగా ఉంటాయి. ఇంటి ముంగిట ఈ మాసాంతం వరకు దీపాలు వెలుగుతూనే ఉంటాయి. ఈ మాసంలో స్త్రీలు దీపాన్ని దానం ఇవ్వడం వల్ల వారికి ఎనలేని కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయి. ఈ మాసం లో భక్తులు తండోపతండాలుగా నెయ్యి తీసుకుని అరుణాచలం కొండ మీద జ్యోతిని వెలిగిస్తారు. ఈ మాసం లో శివాలయంలో అన్ని దీప కాంతులతో కళకళలాడుతాయి. ఈ దీపాలు మనిషిలోని అజ్ఞానమునే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును నింపుతాయి.

                   దేవతలలో ప్రథముడైన టువంటి అగ్నిదేవుడు కృతిక నక్షత్రానికి అధిపతి. ఈ నక్షత్రానికి ‘అగ్ని నక్షత్రమని’ పేరు. అగ్ని ఆరు ముఖాలు కలవాడు. దీనికి ఒక విశిష్టత ఉంది అదేమిటంటే కుమార స్వామిని షణ్ముఖుడు అని అంటాం కదా అంటే ఆరు ముఖాలు కలవాడు అని అర్థం కదా. ఆకాశంలోని ఆరు కృత్తికా నక్షత్రములు మాతృమూర్తులై పాలు యివ్వగా కుమారస్వామి ఆరు ముఖాలతో పాలు త్రాగాడు. ఈ విధంగా కృత్తికలచే పెంచబడుటచే కుమారస్వామికి కార్తీకేయుడని పేరు వచ్చింది. ఈ కారణం వల్ల కృత్తికలకు ప్రాముఖ్యం కలిగినది. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం ఈ కార్తీక మాసం. కార్తీక మాసంలో బ్రాహ్మణుడికి దీపదానం చేస్తే ఉత్తమ ఫలాన్ని ఇస్తుంది. తులసి మారేడు ఉసిరికాయలతో శివాలయంలో,వైష్ణవాలయం లో, దీపాలు వెలిగించిన వారికి అనేక శుభాలు కలుగుతాయి. ఈ మాసంలో ఇంట్లో తులసి సన్నిధిలో, దేవాలయంలో దీపాలు వెలిగించిన వారికి గ్రహ దోషాలు తొలగి, ఐశ్వర్యసిద్ధి కలుగుతుంది. ఉసిరి కాయ పై దీపాలు వెలిగించిన వారికి అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. ఈ కార్తీక మాసంలో ఏ మంత్ర దీక్ష తీసుకున్నా గొప్ప ఫలితాలనిస్తుందని శాస్త్రం చెప్తుంది. కార్తీక ఏకాదశి నుంచి కార్తీక పున్నమి అనగా ఐదు రోజుల వరకు భీష్మ పంచక వ్రతం అంటారు. ఐదు రోజులు శివుడి యొక్క పంచాక్షరీ మంత్రము గాని. అష్టాక్షరీ మంత్రం గాని ఉపదేశం పొంది దీక్షగా జపించడం వల్ల అత్యుత్తమ ఫలితాలు ఉంటాయి. అభిషేక ప్రియుడైన ఇటువంటి శివుడికి, పంచామృతాలతో అభిషేకం చేయడం ఆవు నీటతో దీపం వెలిగిస్తే దారిద్ర్య దుఃఖ తొలగిపోతుంది. ఈ కార్తీకమాసములో శివ భజనలు అభిషేకాలు లక్షపత్రి పూజలు కోటి బిల్వార్చనలు చేస్తే సకల పాపాలు నశిస్తాయి. కార్తీకమాసంలో శివుడికి ప్రీతి పాత్రమైన బిల్వ పత్రాలతో పూజ చేయడం వల్ల అత్యున్నత శుభ ఫలితాలు కలుగుతాయి. శివుడికి ప్రీతి పాత్రమైనది బిల్వం, శివాలయంలో తప్పనిసరిగా కనిపించడం వల్ల కూడా బిల్వవృక్షం పవిత్రత పెరిగింది. ఆ చెట్టులోని ఆకులు కాయలు పండ్లు ఇలా ప్రతి ఒక్క భాగం శివునికి ప్రీతిపాత్రమైనది. ఎక్కడుంటే ఆ ప్రాంతం పవిత్ర స్థలం అయిపోతుంది. మనకు బిల్వ పత్రం మూడుగా చీలి కనిపిస్తుంది ఆ మూడు ఆకులు కలిసి ఏర్పడిన తీరు చూస్తే శివుని త్రిశూలాన్ని పోలి ఉంటుంది. శివుడికి ప్రీతిపాత్రం కావటం వలన ఆ రూపంలో ఆకులు ఏర్పడ్డాయి. ఆయుర్వేదంలో బిల్వ వృక్షానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఎందుకనగా ఇది పురాతన కాలం నుండి పూజలందుకుంటున్న చెట్టు గా గుర్తింపు పొందింది.

పాడ్యమి :- కార్తీక శుద్ధ పాడ్యమి రోజు తెల్లవారు జమునే లేచి స్నానం చేసి శివాలయం కి వెళ్లి  కార్తీక వ్రతం నిర్విఘ్నంగా సాగేట్లు అనుగ్రహింపుము తండ్రి అని ప్రార్థించి సంకల్పం చెప్పుకుని ఆకాశ దీపాన్ని సందర్శించుకోవాలి.

విదియ:- ఈ రోజు సోదరి ఇంటికి వళ్లి ఆమె చేతివంట తిని కానుకలు ఇచ్చినవారికి యమగండం వాటిల్లదని పురాణోక్తి.

తదియ :- ఈనాడు పార్వతీదేవికి స్త్రీలు కుంకుమ పూజ చేయడం వలన సౌభాగ్య సిద్ధి కలుగుతుంది.

చవతి :-నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి కి పుట్టలో పాలు పోయాలి.

పంచమి:- ఈ రోజు నే జ్ఞాన పంచమి అని కూడా అంటారు. ఈ రోజు సుబ్రహ్మణ్యస్వామి ప్రీత్యర్థం అర్చనలు అభిషేకాలు చేయించుకున్నవారికి కలి ప్రభావం కలగదు. జ్ఞాన వృద్ధి కలుగుతుంది.

షష్టి :-నేడు బ్రహ్మచారిని ఇంటికి పిలిచి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సహా కండువా దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది.

సప్తమి:-ఈరోజు ఎర్ర వస్త్రంలో గోధుమలు పోసి దానం ఇవ్వడం వల్ల ఆయుష్షు వృద్ధి కలుగుతుందని శాస్త్రోక్తి.

అష్టమి:- ఈ గోపాష్టమి నాడు చేసే గోపూజ విశేష ఫలితాలనిస్తుంది.

నవమి :- నేటి నుంచి మూడు రోజుల పాటు శ్రీ మహా విష్ణువును పూజించాలి.

దశమి:- ఈ రోజు విష్ణు సహస్రనామ పారాయణం చేసి గుమ్మడికాయను, ఉసిరికాయను దానం చేయాలి.

ఏకాదశి:- ఏకాదశికే బోధనైకాదశి అని పేరు ఈరోజు విష్ణువును పూజించిన వారికి ఉత్తమగతులు కలుగుతాయి.

ద్వాదశి: ఈ రోజు క్షీరాబ్ది ద్వాదశి నేటి సాయంకాలం తులసికోటలో ఉసిరి కొమ్మను ఉంచి తులసి. ఉసిరి కళ్యాణం చేయడం వల్ల  సకల పాపాలనూ క్షీణింప చేస్తుందని ప్రతీతి.

త్రయోదశి:– ఈరోజు సాలగ్రామం దానం ఇవ్వడం వల్ల కష్టాలూ దూరమవుతాయని ప్రతీతి. చతుర్దశి:– నేడు శనీశ్వర ప్రీత్యర్థం ఇనుము నువ్వులు పత్తి మినుములు మొదలైనవాటిని దానం చేయడం వల్ల శని సంతృప్తి చెంది శుభ దృష్టి ని ప్రసాదిస్తాడు. 

పౌర్ణమి:- కార్తీక పౌర్ణమి చాలా పరమ పవిత్రమైనది ఈరోజు నదీస్నానం చేసి శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవడం వ ల్ల పాపాలన్నీ పటాపంచలవుతాయి.

పాడ్యమి:- కార్తీక బహుళ పాడ్యమి ఈరోజు ఆకుకూర దానం చేయడం వల్ల చాలా శుభ ఫలితాలు కలుగుతాయి.

విదియ:-ఈరోజు మన భోజనం చేయడం చాలా మంచిది.

తదియ:-పండితులకు గురువులకు తులసిమాలను సమర్పించడంవల్ల ఆరోగ్యము తెలివితేటలు జ్ఞానం అభివృద్ధి కలుగుతుంది.

పంచమి:-ఈరోజు చీమలకు నూకలు చల్లడం వల్ల శునకాలకు అన్నం తినిపించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

షష్టి: – ఈ రోజు గ్రామ దేవతను పూజించటం వలన వారు సంతుష్టి చంది ఏ విదమైన కీడు కలగకుండా కాపాడుతారు.

సప్తమి:-జిల్లేడు ఆకులతో గుచ్చిన దండను ఈశ్వరునికి సమర్పిస్తే సంపదలు వృద్ధి చెందుతాయి. అష్టమి:-కాలభైరవాష్టకం చదివి గారెలతో దండ చేసి కాలభైరవుడి సమర్పించడంవల్ల ధనప్రాప్తి కలుగుతుంది.

నవమి:-వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి పండితునికి బ్రాహ్మణుడికి దానం ఇస్తే పితృదేవతలు తరిస్తారు.

దశమి:-నేడు అన్న సంతర్పణ చేస్తే విష్ణువుకు ప్రీతిపాత్రమై కోరికలు తీరతాయని పురాణోక్తి. ఏకాదశి:-ఈనాటి వైష్ణవాలయం లో దీపారాధన పురాణ శ్రవణం పఠనం జాగరణ చేస్తే విశేష ఫలదాయకం.

త్రయోదశి:-నవగ్రహారాధన చేయడంవల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి.

చతుర్దశి:-ఈ మాసం శివరాత్రినాడు ఈశ్వరార్చన అభిషేకం చేయటం వల్ల అపమృత్యు దోషాలు, గ్రహబాధలు తొలగి పరిపూర్ణ ఆరోగ్యవంతులవుతారని పురాణోక్తి.

అమావాస్య:-ఈరోజు పితృదేవతల సంతృప్తి కొరకు ఎవరినైనా పిలిచి వారికి భోజనం పెట్టాలి. అలా కుదరకపోతే పండితులకు కానీ బ్రాహ్మణులకు స్వయంపాకం ఇవ్వాలి.

శివుడి అన్ని స్త్రోత్రాల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి శివ స్త్రోత్రాలు 

ఇవి కూడా చదవండి : కార్తిక సోమవార వ్రత మహత్యం

 

Please share it

2 thoughts on “కార్తిక మాసం | Karthika Masam Pooja Vidhanam”

Leave a Comment