Makara Sankranti in telugu – Great festival

YouTube Subscribe
Please share it
5/5 - (1 vote)

Makara Sankranti in telugu

సంక్రాంతి పండుగ ఉత్తరాయన పుణ్యకాలంలో మార్గశిర, పుష్య మాసాలలో వస్తుంది. సూర్యుడు ఒక్కొక్క నెలలో ఒక్కో రాశిలోకి వస్తూ మకర రాశిలోకి వస్తాడు అలా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రమణము లేదా మకర సంక్రాంతి అంటారు.

మన పూర్వీకులు సూర్యుని సంచారాన్ని రెండు భాగాలుగా విభజించారు. సూర్యుడు భూమధ్య రేఖకు ఉత్తరదిశలో ఉన్నప్పుడు ఉత్తరాయణం మని దక్షిణ దిశలో ఉన్నప్పుడు దక్షినాయన మనీ పిలుస్తారు.

దక్షిణాయనంలో విపరీతంగా కురిసిన వానల వలన, ప్రకృతిలోని ఒడిదుడుకుల వలన శారీరకంగా అనేక మార్పులు వచ్చి వ్యాధులు వ్యాపించి ప్రజలు ఇబ్బందులకు లోనవుతారు ఉత్తరాయణం లో వానలు తగ్గి చలి ,ఎండ  మిశ్రితమైన అటువంటి ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది ప్రకృతిలో నూతన చైతన్యం కనిపిస్తుంది.

ఒక సంవత్సర కాలంలో ఉన్న 12 సంక్రమణంలో ఈ మకర సంక్రమణము విశేష ప్రాధాన్యత ఉంది. మిగిలిన సంక్రమణ మూలలో ప్రకృతిలో మార్పు అంత స్పష్టంగా కనబడదు కానీ మకరసంక్రమణం లో మాత్రమే ప్రకృతిలో మార్పు స్పష్టంగా గోచరిస్తుంది. ఈ కాలంలోనే సూర్యుని తేజం బలం అధికంగా ఉంటుంది‌. ‌ సంక్రమణ అంటే ఒక చోట నుండి మరొక చోటికి జరిగే మార్పు అని అర్థం సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారడాన్ని సంక్రమణం అని అంటారు.

సూర్యుడు నెలకు ఒక రాశి చొప్పున సంవత్సరానికి 12 రాశుల్లో సంచరిస్తుంటాడు రవి చంద్ర గ్రహాలకు లేవు ఉండవు కూడా. రవి ఒక రాశి నుంచి మరో రాశికి మారే సమయం సంక్రమణం అని అంటాము. మకర సంక్రాంతి అంటే సూర్యుడు తన నిరంతర కాల ప్రయాణంలో ఏ రోజైతే ధనస్సు రాశి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ఆ రోజును మకర సంక్రాంతిగా జరుపుకుంటారు.

సాధారణంగా జనవరి సమయంలో పంట చేతికి వస్తుంది కనుక ఈ రెండింటినీ పురస్కరించుకుని సంక్రాంతి పండుగ జరుపుకోవడం ఆచారంగా వచ్చింది. మీకు తెలుసా ఈ సంక్రాంతి వేడుకలు నగరాలలో కంటే పల్లెటూరు లోనే ఎక్కువగా ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారు. ఖగోళ శాస్త్ర పరంగా భూమి కొద్దిగా ఒక పక్కకు వంగినట్లు ఉంటే తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం వల్ల రోజులు రాత్రింబవళ్ళు ఏర్పడుతుంటాయి ఈ సమయంలోనే ఆయన మారుతుంది అప్పటివరకూ దక్షిణాయనం గా ఉండే కాలం సంక్రాంతి సమయంలో ఉత్తరాయన పుణ్య కాలం గా మారుతుంది. అంతేకాకుండా ఈ సంక్రమణాలు నెలకు రాశిలో రవి ఉండడాన్ని సూచిస్తాయి. సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించడం సంక్రాంతి గా చెప్పుకుంటాం. ఈ సంక్రమణ కాలాన్ని రవి సంక్రమణ దినం అని కూడా అంటారు. ఏ పంచాంగం తీసుకున్న ఈ సంక్రమణ తేదీలు సమయాలు యధావిధిగా తెలియజేస్తారు. కనుక సంక్రమణ సమయాలలో మంచి పనులు పదిమందికి ఉపయోగపడే పనులు సంఘ సంస్కరణ లు కూడా పుణ్యకర్యాలు చేయాలి.  

                         అలనాటి చల్లని చూపు గొబ్బియల్లో         

Makara Sankranti

                  మళ్లీ చూడవచ్చావ గొబ్బియల్లో

                  మంచి గంధం పూతలను గొబ్బియల్లో

                  మళ్లీ పూయ వచ్చావా గొబ్బియల్లో.

అంటూ గొబ్బి దేవతలకు కన్నెపిల్లలు స్వాగతం పలుకుతారు. పల్లెపడుచులు పాడుకునే గొబ్బిపాటలు ప్రముఖ వాగ్గేయకారులు సైతం ఆకర్షిస్తాయి. ప్రముఖ వాగ్గేయకారులు తాళ్ళపాక అన్నమాచార్యులు కూడా అనేక గొబ్బిపాటలు రచించారు. పేట ముద్దలు చేసి ముగ్గుల మధ్యన గుమ్మాల పక్కన పెట్టి వాటికి పసుపు కుంకుమ అది పిండితో ముగ్గువేసి చామంతి బంతి బీర గుమ్మడి పూలతో అలంకరిస్తారు వీటినే గొబ్బెమ్మలు అంటే గౌరీదేవిగా పూజిస్తారు. సాయంత్రపు వేళల్లో గొబ్బెమ్మల చుట్టూ చేరి చేతులు తడుపతూ ఎంతో ఉత్సాహంగా పాటలు పాడుకుంటారు. ఈ పాటలు అయ్యాక పసుపు కుంకుమలతో పాటు. పెసరపప్పు శెనగలు మరమరాలు అటుకులు మొదలైనవి పెట్టి పూజ పూజ అనంతరం జరిగే పేరంటం సందర్భంగా అమ్మాయిలు నవ్వుల జల్లులు చిలిపి అల్లర్ల తో ఆ ప్రదేశమంతా కళకళలాడుతుంది.నెలంతా గొబ్బెమ్మలు చేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి గోడకు వేసి ఎండబెట్టి దండగా గుచ్చి భోగినాడు మంటల్లో వేస్తారు.తమ పిల్లా పాపలకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగి వృద్ధి పొందాలని అగ్ని దేవుడిని పూజిస్తారు. కొందరు స్త్రీలు అయితే బోగీ నుంచి నాలుగు రోజుల వరకు గౌరీ వ్రతం చేస్తారు. అలాగే బంకమన్ను తో గౌరీదేవి ప్రతిమను తయారు చేసి పూజించి నదులు చెరువులు కాలువలలో వదులుతారు. ఈ మకర సంక్రాంతి అని కొందరు గ్రామీణ స్త్రీలు గొబ్బెమ్మల పండుగ అని పిలుస్తారు.మరి ఈ గొబ్బెమ్మలు వరుసగా గోవర్ధనగిరి కి గోమాతలకు గోపాలకృష్ణుడు సంకేతాలు గా చెప్తారు.

ఆశాజనకమైన టువంటి రేపటి జీవితానికి ఈ నాటి నుంచే మంచిని కోరుకునే కరమైన పాటలుగా గొబ్బి పాటలు ప్రాశస్త్యం పొందాయి.సంక్రాంతి పండుగ మూడురోజులు వెళ్ళిన తరువాత మహిళలు చేసే వ్రతం సావిత్రి గౌరీ వ్రతం. దీనిని బొమ్మల నోము అని కూడా అంటారు. సంక్రాంతి పండగ రోజున నువ్వులు దానం ఇస్తే చాలా మంచిది ఇది ఆచారంగా కూడా వస్తున్నది. మూడు రోజుల పాటు జరిగే ఈ సంక్రాంతి పర్వ దినం లో దానధర్మాలు చేయడం ఒక ఆచారంగా ఉన్నది. ఈ ఈ రోజుల్లో దానం చేస్తే చాలా పుణ్యప్రదం అందువలన వచ్చిన వారికి లేదనకుండా ఇచ్చి పంపడం సంక్రాంతి రోజుల్లో జరుగుతుంది.

తెలుగు పండగలలో ప్రతిదానికి ఒక అంతరార్థం ఉంది అలాగే సంక్రాంతి ఆగమనం లో కూడా అరుదైన అద్భుత తత్వం ఇమిడి ఉంది . అందరూ ఆయురారోగ్యాలు ఐశ్వర్య ఆనందాల తో ఉండాలానే అద్వైత తత్వం ఉంది.

ఇవి కూడా చదవండి : తెలుగు క్యాలెండర్ 

                                                        : నవగ్రహ స్త్రోత్రాలు  

: వసంత పంచమి

 

 

 

 

 

Please share it

1 thought on “Makara Sankranti in telugu – Great festival”

Leave a Comment